Switch to English

బిగ్ బాస్ తెలుగు: గీతూ రాయల్ ఓవరాక్షన్ వేరే లెవల్.!

91,306FansLike
57,004FollowersFollow

‘ఆట రానోళ్ళు కూడా, ఆట గురించి మాట్లాడుతున్నారు..’ అంటూ చలాకీ చంటి మీద గీతూ రాయల్ నోరు పారేసుకుంది. కెప్టెన్సీ పోటీదారులకు సంబంధించిన టాస్క్ సందర్భంగా చంటి – గీతు మధ్య జరిగిన రచ్చ బిగ్ బాస్ వీక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. హౌస్‌లో ఆట రావడం, రాకపోవడం అన్నది అసలు ప్రశ్నే కాదు. ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ ప్రక్రియ చాలా సిల్లీగా కనిపిస్తుంటుంది ప్రతిసారీ.

సిల్లీ రీజన్స్‌కి నామినేట్ అవడం, అంతకన్నా సిల్లీగా హౌస్ నుంచి ఎలిమినేట్ అవడం జరుగుతుంటాయి. అదే బిగ్ బాస్ ప్రత్యేకత. ప్రత్యేకత అనడం కంంటే, బిగ్ బాస్ పైత్యం అనొచ్చేమో. ఈమాత్రందానికి ఆట రావడమేంటి.? రాకపోవడమేంటి.? ‘నువ్వు ఇంకా పూర్తిగా చూడలేదు.. చూస్తావ్..’ అంటూ చంటి ఏదో చెప్పేశాడు.

‘కెప్టెన్సీ అంటే, రూలింగ్ కోసం.. నేను ఎక్కడైనా రూల్ చేయడానికే ప్రాధాన్యతనిస్తాను..’ అంటూ గీతూ రాయల్ ఇంకో సందర్భంలో చెప్పుకొచ్చింది. రూల్ చేయాలనుకునేవాళ్ళు బిగ్ బాస్‌కి ఎందుకొస్తారు.? కెప్టెన్ అయితే ఆర్డర్ వేసి పని చేయించుకోవచ్చట. అసలు గీతూ రాయల్ మానసిక స్థితి సరిగ్గానే వుందా.? బిగ్ బాస్ ఆదేశాల మేరకే ఎవరైనా పని చేయాల్సి వుంటుంది.. కెప్టెన్ సహా.

కంటెస్టెంట్లు ఏవన్నా పొరపాట్లు చేస్తే, బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చేది కెప్టెన్‌కే. సరే, ఆ కెప్టెన్సీకి కొన్ని ప్రత్యేకతలుంటాయ్ అన్నది వేరే చర్చ. ఆ ప్రత్యేకతల వల్ల ఓ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ నుంచి తప్పించుకోవచ్చంతే. ‘ఇమ్యూనిటీ కోసం కాదు రూలింగ్ కోసం..’ అని గీతూ రాయల్ చెప్పడంలోనే ఆమె అహంకారం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

గతంలోనే బెటర్.. కాస్తో కూస్తో ఏదో ఒక టాలెంట్ వున్నోళ్ళు, దాన్ని బిగ్ బాస్ వేదికగా చాటుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరి టాలెంట్ కూడా సరిగ్గా బయటకు రావడంలేదు. పైగా, ఈ అనవసరపు రొట్ట రచ్చ. చలాకీ చంటి నుంచి ఎంత ఎంటర్టైన్మెంట్ ఆశిస్తాం.? ప్చ్, ఏమీ లేదు. ఫైమా కూడా కమెడియనే.. ఆమె నుంచి కూడా ఏమీ లేదు.. ఈ విషయం ఇంటిలోని సభ్యులే అనుకోవటం కొస మెరుపు..
.
హౌస్‌లో జరుగుతున్న విషయాలకు సంబంధించి టెలికాస్ట్ అవుతున్న కంటెంట్ కూడా అర్థం పర్థం లేని అంశాలతో కూడుకున్నదే. ఏ గేమ్ కి సంబంధించి.. సామాన్య వీక్షకులకు ఏదైనా అర్థం అయితే ఒట్టు.. అందుకే, ఈసారి ఓటింగ్ కూడా చాలా దారుణంగా పడిపోయింది. కంటెస్టెంట్ల పెయిడ్ బ్యాచ్ సోషల్ మీడియాలో చేసే రచ్చ తప్ప, ఈసారి బిగ్‌బాస్‌ని ఎవరూ పట్టించుకోవడంలేదు.

ఇదిలా వుంటే, గీతూ రాయల్ అనూహ్యంగా పాపులారిటీ పెంచుకున్నా, దాన్ని ఆమె స్వయంగా తన ఆటిట్యూడ్‌తో నాశనం చేసుకుంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

గుడ్డు పోయింది బిగ్ బాస్.! వాట్ ఏ కామెడీ.!

కొన్ని తాళ్ళు కట్టబడి వున్నాయ్.. వాటిల్లోంచి చేతిలోని ఓ బ్యాటు లాంటి వస్తువు సాయంతో, గుడ్డుని దాని మీద పెట్టుకుంటూ వెళ్ళాలి.. బుట్టలో గుడ్లను వెయ్యాలి....

ప్రభాస్ ఆస్తులపై ఏడుస్తున్న నేషనల్ మీడియా..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్...

కశ్మీర్ ఫైల్స్ వివాదానికి ఫుల్ స్టాప్..! ఇఫి జ్యూరీ హెడ్ క్షమాపణలు..

ఇటివల గోవాలో జరిగిన ఇఫి వేడుకల్లో జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి...

పూనమ్ కౌర్ కు అరుదైన వ్యాధి..! కేరళలో చికిత్స..

ప్రముఖ సినీ నటి పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జీయా అనే అరుదైన వ్యాధికి గురయింది. ఈమేరకు వైద్యులు నిర్ధారించారు. నిద్రలేమి, కండరాల నొప్పులు, జ్ఞాపకశక్తి తగ్గడం,...

మహేష్ కొడుకు గౌతమ్ స్టేజ్ షో అదరగొట్టేసాడుగా… వైరల్ అవుతోన్న వీడియో

సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ అయింది. అందులో తన కొడుకు...

రాజకీయం

కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆమెకిచ్చిన గౌరవం నాకెందుకు ఇవ్వరు: వైఎస్ షర్మిల

‘నన్ను ఆంధ్రావాళ్లు అంటున్నారు. కేటీఆర్ భార్య ఆంధ్రా కాదా..? ఆయన భార్యను గౌరవించినప్పుడు నన్నెందుకు గౌరవించరు..?’ అని వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రశ్నించారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఇక్కడే పెరిగాను.....

పోలవరం వద్ద ఉద్రిక్తత..! రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

పోలవరం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలవరం డ్యామ్ సందర్శనకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదేం...

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్

తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాజకీయ ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈకేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసిన సంగతి కూడా తెలిసిందే. ఇప్పుడీ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులకు హైకోర్టు...

మొన్న సునీతారెడ్డి.. నిన్న షర్మిల.! వైఎస్ జగన్ ఇంతేనా.?

‘మా నాన్నని దారుణంగా చంపేశారు.. అతి కిరాతకంగా హత్య చేశారు.. మాకు న్యాయం చేయండి..’ అంటూ మొత్తుకుంటున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. 2019 ఎన్నికల సమయంలో ఆ సునీతారెడ్డి...

మోడీ కంటే ఈడీ ముందొచ్చింది.. భయపడేది లేదు: ఎమ్మెల్సీ కవిత

‘దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా ముందు మోడీ కంటే ఈడీ వస్తుంది. ఇదేమీ కొత్త విషయం కాదు. నాతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం నీచమైన రాజకీయ...

ఎక్కువ చదివినవి

జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..! విలువ ఎంతంటే..?

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన సంస్థల ఆస్తులను అటాచ్ చేసినట్టు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఈడీ) ఓ ప్రకటన విడుదల చేసింది. జేసీ...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ట్వీట్లు.. రీట్వీట్లు..! కవిత-షర్మిల మధ్య హై ఓల్టేజ్ పొలిటికల్ వార్

మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల మధ్య ట్విట్టర్లో మాటల యుద్ధం ముదురుతోంది. తాము వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’ అని కవిత...

న్యాయస్థానాల్లో తీర్పులు.! తెలుగు మీడియాలో వక్రభాష్యాలు.!

సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయమై వాదోపవాదాలు జరిగాయి. రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల్ని సర్వోన్నత న్యాయస్థానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుల్లోని...

కీర్తి భట్‌పై సింపతీ వేవ్.! బిగ్ బాస్ విన్నర్‌ని చేస్తుందా.?

కీర్తి భట్.! బుల్లితెర నటీమణి.! ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్‌లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్ అని చెప్పొచ్చు. చేతి వేలికి గాయం కారణంగా ఫిజికల్ టాస్కుల్లో తేలిపోతోంది....