Switch to English

విశాఖ గ్యాస్‌ లీకేజీని, భోపాల్‌ ఘటనతో పోల్చగలమా.?

కరోనా వైరస్‌ దెబ్బకి రాష్ట్రంలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినా, ముఖ్యమంత్రి అమరావతిని విడిచి బయటకు రాలేదు. దేశంలో పలు రాష్ట్రాల్లో వృద్ధాప్యంలో వున్న ముఖ్యమంత్రులు, ప్రాణాలకు తెగించి మరీ ప్రజల వద్దకు వెళ్ళారు కరోనా పరిస్థితుల్లోనూ.! మరి, జగన్‌ ఎందుకు జనంలోకి రాలేదు.? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేని పరిస్థితి అధికార పక్షానిది.

అయితే, వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, అమరావతి నుంచి బయటకు రాక తప్పలేదు. కారణం విశాఖలో చోటు చేసుకున్న ప్రమాదకర గ్యాస్‌ లీక్‌ దుర్ఘటన. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ‘పెద్దగా భయపడాల్సిందేమీ లేదట.. ఆక్సిజన్‌ పెట్టుకుంటే సరిపోతుందట..’ అంటూ అధికార పార్టీకి చెందిన ఛానల్‌లో, ఓ సీనియర్‌ జర్నలిస్టు తనకెవరో చెప్పిన విషయాన్ని ప్రస్తావించి అభాసుపాలయ్యారు. కరోనా వైరస్‌కి పారాసిటమాల్‌ అన్నట్లే వుందీ వ్యవహారం. కానీ, సమస్యలో సీరియస్‌నెస్‌ ఏంటన్నది, ముఖ్యమంత్రి హుటాహుటిన విశాఖ రావడంలోనే తేలిపోయింది. దీన్ని భోపాల్‌ దుర్ఘటనతో పోల్చుతున్నారు చాలామంది.

అయితే, ‘అంత తీవ్రత లేదు ఈ ఘటనకి’ అని కొందరు అభిప్రాయపడ్తున్నారు. ఇలాంటి ఘటనల్లో ప్రమాద తీవ్రతని వెంటనే అంచనా వేయలేం. 10 మంది ప్రాణాలు కోల్పోగా, చాలామంది ఆసుపత్రుల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. వారిలో ఎంతమంది కోలుకుంటారు.? ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు.? అన్నదాని చుట్టూనే ప్రమాద తీవ్రతపై ఓ స్పష్టత వస్తుంది.

గాలి, నీరు, నేల.. ఇలా అన్నీ ఆ ప్రాంతంలో విష తుల్యంగా మారతాయి. 3 కిలోమీటర్ల మేర ఈ విష ప్రభావం వుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి చెబుతున్నదాన్ని బట్టి 15 వేల మంది ఎఫెక్టెడ్‌ పీపుల్‌ వున్నారు. సో, ఇది చిన్న ఘటన కానే కాదు. ఈ రంగానికి చెందిన నిపుణులు విశాఖ చేరుకుంటున్నారు, పరిస్థితుల్ని అధ్యయనం చేయాల్సి వుంది. దీర్ఘకాలిక రోగాలు తప్పకపోవచ్చని, సదరు కెమికల్‌ గుణంపై వైద్యులు అంచనా వేస్తుండడం చూస్తోంటే, ప్రమాద తీవ్రత ఊహించినదానికన్నా ఎక్కువే వుండొచ్చు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

వైఎస్‌ జగన్‌ పాలనకు ఏడాది.. ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని ఏదీ.?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రెండుగా విడిపోయాక.. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఏదన్నదానిపై రాష్ట్ర ప్రజానీకానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే వుండిపోయింది. చంద్రబాబు హయాంలో అమరావతి, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ప్రకటితమయ్యింది. అయితే, అప్పట్లో అమరావతికి మద్దతిచ్చిన...

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ను బుట్టలో వేసుకున్న దాసు

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అంటే నాకు చాలా ఇష్టం అంటూ పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చిన యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తాజాగా తన అభిమానంను చాటుకున్నాడు. ఎన్టీఆర్‌ పై అభిమానం ఉందని మాటలు...

మే 22 తో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న స్పెషల్ లింకప్ ఏంటో తెలుసా.?

నేటితో అక్కినేని మూడు తరాల హీరోలు కలిసి చేసిన 'మనం' సినిమా ఆరేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మే 22 కీ, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నారు కింగ్ నాగార్జున. "నాన్నగారితో...

విశాఖ గ్యాస్‌ లీక్‌: ఎల్జీ పాలిమర్స్‌కి బిగ్‌ షాక్‌.?

యావత్‌ భారతదేశాన్ని కుదిపేసింది విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన. ఎల్జీ పాలిమర్స్‌ పరిశ్రమ నుంచి ప్రమాదకరమైన విష వాయువు లీక్‌ కావడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదానికి కారణమైన ‘స్టైరీన్‌’...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...