విష వాయువు కంటే విష రాజకీయం అత్యంత ప్రమాదకరం. అవును, కరోనా వైరస్ కంటే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అత్యంత ప్రమాదకరమని ఇటీవలి సంఘటనలు నిరూపించాయి. కరోనా వైరస్‌తో జనం ప్రాణాలు కోల్పోతోంటే, ఆ కరోనా వైరస్‌ని పెంచేందుకు ప్రతిపక్షం ‘స్లీపర్ సెల్స్’ని నియమించిందని సాక్షాత్తూ ఓ మంత్రి బాధ్యత లేకుండా మాట్లాడటం చూశాం.
ప్రభుత్వం నైతికతకు తిలోదకాలిచ్చి, లాక్‌డౌన్‌లోనూ మద్యం షాపుల్ని తెరిస్తే.. ఆ మద్యం షాపుల వద్ద కనీసపాటి భద్రతా చర్యలు లేకపోవడంతో మందుబాబులు విచ్చలవిడిగా వ్యవహరిస్తే.. ప్రతిపక్షమే డబ్బులిచ్చి మరీ గలాటా చేయించిందని ఇంకో మంత్రి నోరు పారేసుకున్నారు. ఇక, ఇప్పుడు.. విశాఖలో విష వాయువు కలకలం నేపథ్యంలోనూ రాజకీయం ‘విష పంజా’ విసురుతోంది.
ప్రతిపక్ష నేత, విశాఖ వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్నారనీ, విపక్షాలకు చెందిన నేతలూ అదే ఆలోచనలున్నారనీ వార్తలు రావడం మొదలు.. ‘విష రాజకీయం కోసమే విపక్షాలు ప్రయత్నిస్తున్నాయంటూ అధికార పక్షం నుంచి ‘విష రాజకీయం’ మొదలైపోయింది. జనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నా ప్రభుత్వంలో వున్నవారికి ‘బాధ్యత’ తెలియడంలేదు.
అధినేత మెప్పు కోసం అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. దానికి తోడు ‘తోక మీడియా’ వుండనే వుంది. ఎలక్ట్రానిక్, ప్రింట్ మరియు వెబ్ మీడియా సాయంతో విపక్షాలపై విషం చిమ్మడమే పరమావధిగా పెట్టుకుంది అధికార పార్టీ. నిజానికి, ఈ సమయంలో విపక్షాలేవీ ఇప్పటిదాకా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. సూచనలు మాత్రమే చేశాయి.
అధికార పక్షం కంటే ముందుగా విపక్షాలే, రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. పైగా, అధికార యంత్రాంగం వేగంగా స్పందిందని కితాబులూ ఇస్తున్నాయి. ఇంకా ఎందుకు అధికార పార్టీ నేతలకి ఈ కక్కుర్తి.? రాష్ట్రానికి పెను శాపం.. ఈ విష రాజకీయమే.
923890 153359This is a extremely exciting write-up, Im looking for this know how. So you realize I established your internet site when I was searching for websites like my own, so please look at my internet website someday and post me a opinion to let me know how you feel. 895241
732778 708107I surely did not realize that. Learnt some thing new these days! Thanks for that. 431414
742643 396322Thanks for this excellent. I was wondering whether you were preparing of writing related posts to this 1. .Maintain up the outstanding articles! 63590