Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: గన్నవరం ఉప ఎన్నిక రిఫరెండం అవుతుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,513FansLike
57,764FollowersFollow

టీడీపీ రెబల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, తన పదవికి రాజీనామా చేయాలనే ఆలోచనతో వున్నారట. తన రాజీనామాతో వచ్చే ఉప ఎన్నికలో తాను మళ్ళీ గెలుస్తాననీ, అది మూడు రాజధానులకు రిఫరెండం అవుతుందని చెబుతున్నారు. ఈ మాట చెప్పాల్సింది వల్లభనేని వంశీ కాదు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ఎందుకంటే, ఆయన టెక్నికల్‌గా ఇంకా టీడీపీ ఎమ్మెల్యేనే.

నిజానికి, అమరావతి పరిధిలో చట్ట సభలకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ప్రజా ప్రతినిథులంతా రాజీనామా చేస్తే, అందులో ఎంతమంది గెలుస్తారు.? అన్నదాన్నిబట్టి కాస్తో కూస్తో ‘రిఫరెండం’ అనే చర్చకు ఆస్కారం వుంటుంది. ‘మేం అమరావతికి కట్టుబడి వున్నాం.. అమరావతి నుంచి రాజధాని ఎక్కడికీ తరలిపోదు..’ అని ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ చెప్పింది. ‘వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే, రాజధాని అమరావతి నుంచి తరలిపోతుంది..’ అని టీడీపీ ఆరోపించింది. నిజానికి, ఇక్కడ టీడీపీ భయమే నిజమయ్యింది.

సో, మాట ఇచ్చి.. తప్పినందున వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సి వుంటుందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ లెక్కన, ప్రభుత్వమే రిఫరెండంకి వెళ్ళాలి. అంటే, వున్నపళంగా ప్రభుత్వాన్ని రద్దు చేసి, వైఎస్‌ జగన్‌ మళ్ళీ ఎన్నికలకు సన్నద్ధమవ్వాల్సి వుంటుంది. కానీ, అంత ధైర్యం వైఎస్సార్సీపీకి లేదన్నది నిర్వివాదాంశం. మరి, గన్నవరం ఎమ్మెల్యే ఎందుకు అకస్మాత్తుగా రాజీనామా – ఉప ఎన్నిక – రిఫరెండం.. అనే అంశాల్ని తెరపైకి తెచ్చినట్లు.?

టీడీపీ నుంచి దూరమైన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేసి వుండాల్సింది. ‘ఎవరన్నా పార్టీ మారితే, వెంటనే అనర్హత వేటు పడుతుంది’ అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినా, అది ఉత్తమాటగానే మిగిలిపోయింది. మాట తప్పడం.. మడమ తిప్పడం.. అప్పుడే మొదలయ్యింది. ‘అబ్బే, ఆయనింకా మా పార్టీలో చేరలేదు’ అని వైసీపీ నేతలు బుకాయిస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

ఏదిఏమైనా, ప్రజలంతా మూడు రాజధానుల్ని సమర్థిస్తున్నారని వైఎస్సార్సీపీ భావిస్తోంటే.. క్షణం ఆలోచించకుండా వైసీపీ ప్రజా ప్రతినిథులంతా రాజీనామా చేసి, మూడు రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్ళాల్సి వుంటుంది. ఇదే జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ డిమాండ్‌ చేసింది కూడా. అలా కాదని, గన్నవరం ఎమ్మెల్యేతోనే వైసీపీ రాజీనామా చేయిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.?

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

టీడీపీ వెకిలి వేషాలకు బాధ్యత ఎవరిది.?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించడాన్ని తెలుగు దేశం పార్టీ మద్దతుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్వయంగా, ఈ పంపకాలను డిజైన్ చేసి, ఆమోద ముద్ర...

అన్న జగన్‌కి పక్కలో బల్లెంలా తయారైన చెల్లెలు సునీత.!

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వ్యవహారానికి సంబంధించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు, స్వయానా ఆ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి కౌంటర్ ఎటాక్...

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

ఎక్కువ చదివినవి

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టిల్లు స్క్వేర్ పై అంచనాలు పెరుగుతూనే...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...

Ram Charan Birthday special: మిస్టర్ కూల్.. ‘రామ్ చరణ్’

Ram Charan: రంగం ఏదైనా రాణించేందుకు ప్రతిభతోపాటు నడవడిక, క్రమశిక్షణ, నిబద్దత మరీ ముఖ్యం. ఇవే ఒక వ్యక్తిని కొలిచే కొలమానాలు. ప్రతిభతో రాణించొచ్చు కానీ గౌరవం దక్కించుకోలేం. ఇవన్నీ ఉంటే అతడు...

Chiranjeevi: హీరో శ్రీకాంత్ కి మెగా సర్ ప్రైజ్..

Chiranjeevi: శంకర్ దాదా ఎంబీబీఎస్ లో.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తిని శంకర్ (చిరంజీవి) కౌగిలించుకోవాలని భావిస్తే అతను తటపటాయిస్తాడు. ‘అరె వెళ్లరా భాయ్.. ఈ అవకాశం కోసం ఎంతమంది ఎదురు చూస్తుండ్రు’...