ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా నటించిన అలియా భట్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం గంగూభాయ్ కథియావాడి. గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని వెర్సటైల్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించాడు. నిజానికి గంగూభాయ్ జనవరి 6న విడుదల కావాల్సింది కానీ ఆర్ ఆర్ ఆర్ తో పోటీ వద్దనుకుని ఫిబ్రవరికి వాయిదా వేశారు.
ఈలోగా పరిస్థితి దిగజారింది. దేశంలో కోవిడ్ కేసులు పీక్స్ కు చేరుకున్నాయి. దీంతో మళ్ళీ థియేటర్లపై నిబంధనలు అమలయ్యాయి. ఇక గంగూభాయ్ మరోసారి వాయిదా పడుతుందనుకున్నారు కానీ పరిస్థితిలో మార్పు వస్తుందన్న సంకేతాలు అందుతున్నాయి. అలాగే ఈసారి పాజిటివ్ కేసులు వచ్చినా అంత ఎఫెక్ట్ ఉండట్లేదు కాబట్టి నిబంధనలు సడలించారు.
దీంతో గంగూభాయ్ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 25న గంగూభాయ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.