మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఒకప్పటి సూపర్ డూపర్ హిట్ “గ్యాంగ్ లీడర్” సినిమాను ఫిబ్రవరి 11న రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు..వేగా ఎంటర్ టైన్మెంట్ ద్వారా ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. సంక్రాంతి సినిమాల తర్వాత మంచి డేట్ చూసుకుని ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు,లోగడ ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది.
చాలా ఏళ్ల క్రితం వచ్చిన “గ్యాంగ్ లీడర్” సినిమా అప్పట్లో అభిమానులతో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని, అందులో చిరంజీవి, విజయశాంతి నటనతో పాటు చక్కటి కథ, కథనాలు, కామెడీ, యాక్షన్ వంటి అన్ని అంశాలు ఆద్యంతం అలరింపజేశాయన్న విషయం తెలిసిందే..
ఇక పాటల సంగతికి వస్తే “పాప రీటా….”,, “పాలబుగ్గ…”, “భద్రాచలం కొండ… “, “వానా.. వానా…”, “వయసు వయసు…”, “పనిసా ససా…” వంటి పాటలు, వాటికి చిరంజీవి చేసిన డాన్స్ నేటికీ వీనులవిందు చేస్తున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు.
Comapred to All chiru movies, some of the movies are mass craze movies of chiranjeevi, Gang Leader is one of the movie in that list, especially dialouges are awesome