బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొనే వారికి పాపులారిటీతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తుంటాయి. ఈ షోలో కి వచ్చి ఆర్థికంగా స్థిరపడిన వారు ఎంతోమంది ఉన్నారు వారిలో గంగవ్వ కూడా ఒకరు. మై విలేజ్ షో ద్వారా పబ్లిసిటీ సంపాదించుకున్న గంగవ్వ అనూహ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 లో అడుగుపెట్టింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు బాగానే ఎంటర్టైన్ చేసింది. హోస్ట్ నాగార్జున కూడా గంగవ్వ సందడి కి ఫిదా అయ్యారు. తనకి ఇల్లు లేదని గంగవ్వ చెప్పగానే తన వంతుగా సాయం చేస్తానని నాగార్జున అప్పుడే ప్రకటించారు. అన్నట్టుగానే షో పూర్తయ్యాక గంగవ్వ సొంత ఇంటి కల సాకారమైంది. రీసెంట్ గా మై విలేజ్ షో లో తన సంపాదన గురించి ఒక వీడియో చేసింది ఈమె.
ఈ వీడియోలో ఆస్తుల వివరాల గురించి చెప్పింది. బిగ్ బాస్ షో వల్ల తన జీవితం ఎంతగానో మారిందని తన ఇంటిని చూపిస్తూ మురిసిపోయింది ఈమె. ఆ ఇంటి విలువ రూ. 22 లక్షలట. రూ.3 లక్షలు ఖర్చుపెట్టి ఆవులుకొని వాటికి షెడ్డు కూడా ఏర్పాటు చేసింది. మరో రూ. 9లక్షలు ఖర్చుపెట్టి నాలుగు కుంటల పొలం కొన్నదట. అదేవిధంగా మరోచోట కొన్న రెండున్నర ఎకరాల పొలం విలువ అక్షరాల రూ 75-80 లక్షలు ఉంటుందట. ఇంకోచోట కమర్షియల్ ప్లాట్ కూడా కొనుగోలు చేసింది. వీటితోపాటు మరికొన్నిచోట్ల వ్యవసాయ భూమి తో కలిసి మొత్తంగా తన ఆస్తుల విలువ రూ.కోటి 30 లక్షల వరకు ఉంటుందని ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తనకి వచ్చిన డబ్బులతో మనవరాలి పెళ్లి చేసిందట గంగవ్వ. అదీ సంగతి.. బిగ్ బాస్ ఎంట్రీ అవ్వకు బాగానే గిట్టుబాటు అయ్యిందన్నమాట.