విశ్వక్ సేన్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పీరియాడిక్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం యావరేజ్ రేటింగులనే సాధించింది. అయితే మే 31న విడుదలైన ఈ చిత్రం డీసెంట్ ఓపెనింగ్ ను సాధించింది. ఆ రోజు విడుదలైన మిగతా రెండు సినిమాలతో పోలిస్తే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కి డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి.
మొదటి వీకెండ్ లో ఈ సినిమా ఏకంగా 6 కోట్లు వసూలు చేసి డిస్ట్రిబ్యూటర్లకు రిలీఫ్ ను ఇచ్చింది. మొదటి వీకెండ్ లోనే ఈ చిత్రం 80 శాతం బిజినెస్ ను రికవర్ చేయడం గమనార్హం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓవరాల్ గా 8 కోట్ల బిజినెస్ చేసింది.
ఇక రానున్న రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు చేరుకోవడం ఖాయం. కృష్ణ చైతన్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నేహా శెట్టి, అంజలి కీలక పాత్రలు పోషించారు.