గ్యాంగ్ లీడర్ .. మెగాస్టార్ చిరంజీవి ల్యాండ్ మార్క్ మూవీ .. ఇప్పటికి ఎప్పటికి గ్యాంగ్ లీడర్ అంటే చిరంజీవి గుర్తొస్తాడు .. కానీ ఇప్పుడు గ్యాంగ్ లీడర్ గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు మన నాచురల్ స్టార్ నాని ? నానిన్ గ్యాంగ్ లీడర్ అంటూ మన ముందుకు రానున్న ఈ సినిమా ఈ నెల 13న విడుదలకు సిద్ధమైంది. మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో సంచలనం రేపింది. నిజంగా నాని కెరీర్ లోనే ఈ సినిమా బిజినెస్ సంచలనం రేపుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అటు ఓవర్ సీస్ లోకూడా అదే రేంజ్ బిజినెస్ తో దుమ్ము రేపుతున్నాడు నాని.
మరి ఈ నాని గ్యాంగ్ లీడర్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందొ ఓ లుక్కేద్దాం..
నైజాం – 8. 10 కోట్లు, సీడెడ్ – 3. 50 కోట్లు, ఉత్తరాంధ్రా – 2. 50 కోట్లు, కృష్ణా – 1. 50 కోట్లు, గుంటూరు – 1. 70 కోట్లు, ఈస్ట్ – 1. 65 కోట్లు, వెస్ట్ – 1. 25 కోట్లు, నెల్లూరు – 0. 82 కోట్లు, మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కలిపి .. 21. 08 కోట్లు, రెస్ట్ అఫ్ ఇండియా – 1. 85 కోట్లు, ఓవర్ సీస్ – 5. 40 కోట్లు, మొత్తంగా ఈ సినిమా 30 కోట్ల బిజినెస్ ని పూర్తీ చేసింది.
మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమాతో నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.
