Game Changer: రామ్ చరణ్.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రానికే పరిమితం కాదు.. దక్షిణాది నుంచి దేశందాటి అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ స్టార్ గా మోగిపోతున్న పేరు. శంకర్.. దక్షిణాదికి గ్రాండియర్ సినిమాను పరిచయం చేసిన సీనియర్ దర్శకుడు. చిరుత, మగధీరతో మాస్ లో ఇమేజ్.. ధృవ, రంగస్థలంతో క్లాస్ లో క్రేజ్, ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఆడియన్స్ అప్లాజ్ దక్కించుకున్న రామ్ చరణ్ ఓవైపు. గ్రౌండ్ రియాలిటీ కథలను ఆడియన్స్ మెదడుకు కనెక్టయ్యేలా గ్రాండ్ స్క్రీన్ ప్లేతో మెప్పించే శంకర్ మరోవైపు. వీరిద్దరి కలయికను సెట్ చేసి తన జడ్జిమెంట్ పవర్ చూపించాలని తహతహలాడుతున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంకోవైపు. ఇన్ని సంచలనాల మధ్య భారీ అంచనాలతో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ టీజర్ విడుదలై అందరిలో ఉన్న అంచనాలను అదేస్థాయిలో అందుకుని మెప్పించడం రియాలిటీ.
ఇటివల శంకర్ మార్క్ తగ్గిందన్న వారికి.. రామ్ చరణ్ లేట్ గా సినిమాలు చేస్తున్నాడనే ఫ్యాన్స్ ఆందోళనలకు.. శంకర్ గ్రాండియర్ అంటే ఏంటో.. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఏంటో.. శంకర్ రియల్ వర్క్ ఏంటో.. సరైన కంటెంట్ కథలు రామ్ చరణ్ ను వెతుక్కుంటూ వస్తే ఎలా ఉంటదో.. ఇలా వీటన్నింటికీ ఒకటే టీజర్ తో సమాధానం చెప్పింది ‘గేమ్ చేంజర్’. ప్రాజెక్టు ప్రారంభమై మూడేళ్లు.. ఫ్యాన్స్, ట్రేడ్ సర్కిల్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవేళ వారి అంచనాలను అందుకుంటే ఇక ఆకాశమే హద్దు. గేమ్ చేంజర్ చేసిందదే. యాక్షన్, స్టోరీ, మేకోవర్, కథలో ఇంటెన్సిటీ, పాత్రల తీరు, అన్నింటినీ విజువల్స్ లో చూపించి.. రామ్ చరణ్ పాత్రతో మాత్రం ‘ఐ యామ్ అన్ ప్రెడిక్టబుల్’ అనే ఒక్క డైలాగ్ తోనే సినిమాను శిఖరంపైకి తీసుకెళ్లాడు శంకర్. ఇక మిగిలింది అక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవడమే.
ముఖ్యంగా రామ్ చరణ్ లో ఇన్ని మేకోవర్స్.. అదీ ఒక్క సినిమాలోనే చూపించి సరైన హీరో మెటీరియల్ దొరికితే తానేం చేయగలడో నిరూపించాడు దర్శకుడు శంకర్. స్టైలిష్, ఎనర్జిటిక్, సిన్సియర్ సిటిజన్, బ్యూరోక్రాట్.. ఇలా ఇన్ని వేరేయేషన్లలో రామ్ చరణ్ ను చూపించి అభిమానుల్లో వెయ్యి ఓల్టుల కరెంట్ జనరేట్ అయ్యేలా చేశాడు శంకర్. ఇక మిగిలింది ధియేటర్లో పూర్తి సినిమా. రామ్ చరణ్ సత్తా చాటేలా.. శంకర్ ఒరిజినల్ మార్క్ పడేలా సినిమా ఏ కొంచెం ఉన్నా బాక్సాఫీస్ జాతరే. అదే యునానిమస్ టాక్ వస్తే ఆకాశమే హద్దు. ఈ రెండోదే ఖాయం చేసుకునేలా కనిపిస్తోంది ‘గేమ్ చేంజర్’. భారతీయుడు2 తో శంకర్ పై అనుమానాలున్న ప్రతిఒక్కరినీ అవాక్కయ్యేలా చేసింది. బ్యాలెన్స్.. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ ను అదే స్టాండర్డ్స్ లో నిలిపి.. తాను బిగ్ కమ్ బ్యాక్ ఇచ్చుకోవడమే. ఆల్ ది బెస్ట్ ‘గేమ్ చేంజర్’.