Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’పై భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇటివల విడుదలైన టీజర్ తో అంచనాలు రెట్టింపయ్యాయి. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదలవుతున్న సినిమాకు సంబంధించి యూకేలో అడ్వాన్స్ సేల్స్ ప్రారంభమవగా రికార్డుస్థాయిలో టికెట్లు సేల్స్ జరుగుతున్నాయి.
లేటెస్ట్ లెక్కల ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన 24గంటల్లో 3800 టికెట్స్ సేల్స్ జరిగి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది గేమ్ చేంజర్. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకూ ఈస్థాయిలో అడ్వాన్స్ ప్రీసేల్స్ బుకింగ్ జరగకపోవడం గమనార్హం. హెవీగా ఆక్యుపెన్సీ ఉండటంతో క్రేజ్ గమనించి పంపిణీదారులు ఇల్ ఫోర్డ్, హౌన్స్ లో ప్రాంతాల్లో 8గంటల షోలు అదనంగా యాడ్ చేశారు.
జర్మనీలో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. డిసెంబర్ 21న అమెరికాలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో రామ్ చరణ్ పాత్ర శక్తివంతంగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి.