Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించారు. 2025 సంక్రాంతికి జనవరి 10న విడుదలవుతున్న సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల చేసిన టీమ్ మూడో పాటగా మెలోడియస్ పాటను విడుదల చేయబోతోంది. నవంబర్ 28న విడదలవుతున్న పాటకు సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమోలో తమన్, గాయనీగాయకులు కార్తీక్, శ్రేయా ఘోషల్ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
ఈ ఏడాది బెస్ట్ మెలోడీ పాటగా ‘నానా హైరానా..’ పాట నిలిచిపోతుందని అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే తమన్ స్వరాలు చాలా వినసొంపుగా ఉన్నాయని ప్రోమోలో సంగీతం ద్వారా తెలుస్తోందని చెప్పాలి. పాటలో రామ్ చరణ్ స్క్కీన్ ప్రెజన్స్, చరణ్-కియారా జంట అద్భుతంగా ఉన్నారని ఇప్పటికే శంకర్ కితాబిచ్చారు. అందమైన న్యూజిలాండ్ లొకేషన్లలో పాటను అంతే అందంగా తెరకెక్కించామని.. దేశంలోనే తొలిసారి ఈ పాటకి ఇన్ ఫ్రారెడ్ కెమెరా ఉపయోగించినట్టు తెలిపారు.