Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. సెన్సేషనల్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సినిమాకు సంబంధించి ఈనెల 9న టీజర్ విడుదల గ్రాండ్ గా ప్లాన్ చేసింది చిత్ర యూనిట్.
తొలి ప్రచారాన్ని ఉత్తరాదిలో ఒకటైన పెద్ద నగరం లక్నలో జరుపనున్నారు. అక్కడే టీజర్ రిలీజ్ చేసి ఈవెంట్ నిర్వహించనున్నారు. దీంతోపాటు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన 11 నగరాలు, పట్టణాల్లో అభిమానుల సమక్షంలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది చిత్ర నిర్మాణ సంస్థ. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, బెంగళూరు, అనంతపురం, తిరుపతి, ఖమ్మం.. నగరాల్లో విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన రామ్ చరణ్ స్టిల్స్ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటేలా చేశాయి. అభిమానులు, ట్రేడ్ సర్కిల్స్ లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్ సంగీతం అందిస్తున్నారు.