‘గేమ్ ఛేంజర్’ ఇంపాక్ట్.! సమాజంపై ఆ స్థాయిలో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,094FansLike
57,764FollowersFollow

శంకర్ తెరకెక్కించే సినిమాలకు పాన్ ఇండియా రేంజ్ వుంటుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడంటే పాన్ ఇండియా.. అనే పేరు వాడుతున్నాంగానీ, శంకర్ దర్శకత్వంలో వచ్చే ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమానే ఒకప్పుడు.!

ఇక, శంకర్ సినిమాల్లో సామాజిక బాధ్యత.. అనే అంశం స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రధానంగా అవినీతి, రాజకీయాల చుట్టూ శంకర్ చాలా సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు అంచనాల్ని అందుకోకపోయి వుండొచ్చు.. కానీ, వాటిల్లోని సోషల్ మెసేజ్, ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తూనే వుంటుంది.

ఇక, ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికొస్తే, సినిమాపై విపరీతమైన నెగెటివిటీని చూశాం, చూస్తూనే వున్నాం. కానీ, వసూళ్ళు మాత్రం వస్తూనే వున్నాయ్. సక్సెస్, ఫెయిల్యూర్‌.. ఈ తేడాలేవీ లేకుండా రామ్ చరణ్ సినిమాలకి వసూళ్ళు రావడం కొత్తేమీ కాదు, అది మళ్ళీ వేరే చర్చ.

అసలు విషయమేంటంటే, ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని పొలిటికల్ కాన్‌ఫ్లిక్ట్, అందులో చూపించిన సోషల్ మెసేజ్.. తెలుగునాట రాజకీయాలపై ముందు ముందు చాలా ప్రభావం చూపబోతోంది. రాజకీయ అవినీతి గురించి సినిమాల్లో ఇంతకు ముందు చూపించలేదా.? అంటే, దానికీ.. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలోని కంటెంట్‌కీ చాలా తేడా వుంది మరి.! ఈ ఇంపాక్ట్ వేరే లెవల్.

ఓటుకి ఐదొందల నుంచి రెండు వేల దాకా ఇవ్వడం చూస్తుంటాం. తెలంగాణలో ఆ మధ్య జరిగిన ఓ ఉప ఎన్నికలో, జనం 10 వేల రూపాయలు డిమాండ్ చేయడం కూడా చూశాం. ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో అయితే, ఏకంగా ఓటుకి 20 వేలు డిమాండ్ చేశారు ఓటర్లు. అధికార పార్టీ, ఓటర్లు అడిగినంతా సమర్పించుకోక తప్పలేదు. ఇంతా చేసినా ఓడిపోయిందాయె.! ఇది జస్ట్ సినిమా మాత్రమే.

రియల్ రాజకీయాల్లో చూసుకుంటే, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసిన రెండు పార్టీలూ అధికారాన్ని చేజార్చుకున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో. దీన్ని ఓటరు చైతన్యం.. అని నిస్సంకోచంగా అనొచ్చు.

ముందు ముందు ఓటర్లు డిమాండ్ చేసే ‘ఓటుకు నోటు’ వేరే రేంజ్‌లో వుండబోతోంది. అది రాజకీయ పార్టీలు భరించలేని స్థాయిలో వుంటుందన్నది నిర్వివాదాంశం. అప్పుడిక, డబ్బుతో అవసరం లేని రాజకీయాల్నే మనం చూడాల్సి వస్తుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా గురించి, తెలుగు రాష్ట్రాల్లో రచ్చ బండల సాక్షిగా జరుగుతున్న చర్చల్లో ఇదే ముఖ్యమైన అంశం.

సినిమా

‘పిఠాపురంలో… అలా మొదలైంది’ మే 1న రిలీజ్… ఫ్యామిలీ ఎమోషన్స్‌తో వస్తున్న...

సీనియర్ దర్శకుడు Mahesh Chandra తెరకెక్కించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. Rajendra Prasad, Prudhvi Raj, కేదార్...

Ram Charan: కెరీర్-ఫ్యామిలీ.. ‘ఎస్క్వైర్ ఇండియా’తో రామ్ చరణ్ ముచ్చట్లు..

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టయిలింగ్ రేంజ్ ఏంటో ప్రముఖ మ్యాగజైన్ ‘ఎస్క్వైర్ ఇండియా’ చూపించింది. మ్యాగజైన్ కోసం రెండు నెలల...

ఎన్టీఆర్–త్రివిక్రమ్ సినిమా ‘షణ్ముఖుడు’? బర్త్‌డే సర్ప్రైజ్‌పై భారీ బజ్!

Jr NTR – Trivikram Srinivas కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి ‘షణ్ముఖుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో...

‘రాకా’లో బన్నీ డబుల్ కాదు… నాలుగు షేడ్స్? క్రేజీ అప్డేట్స్ వైరల్

ఐకాన్ స్టార్ Allu Arjun నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రాకాపై తాజా అప్డేట్స్ సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌తో...

మండే కూడా తగ్గని ‘డకాయిట్’ జోరు… ఐదో రోజు భారీ జంప్?

Adivi Sesh నటించిన లవ్ అండ్ యాక్షన్ డ్రామా Dacoit బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. వీకెండ్ తర్వాత సాధారణంగా కలెక్షన్స్ తగ్గే సోమవారం రోజున కూడా...

రాజకీయం

“ప్రతి సమస్యకు పరిష్కారం”: మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్‌లో భరోసా

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh 88వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా కలుసుకుని...

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గం: జనసేన నేత ప్రేమ్ కుమార్

భారత రాజ్యాంగ నిర్మాత B. R. Ambedkar 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాలానగర్‌లో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో జనసేన పార్టీ నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ...

ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా… జనసేన నేతల నివాళులు

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద Jana Sena Party తెలంగాణ రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో B. R. Ambedkar 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి...

“ట్రోలింగ్ వెనుక కుటుంబమే?” షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీసేలా YS Sharmila కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్ వెనుక తన అన్నయ్య, వదినతో పాటు సజ్జల ఉన్నారని ఆమె ఆరోపించారు. “వీళ్లంతా...

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

ఎక్కువ చదివినవి

“ఆత్మాహుతి వ్యాఖ్యలు… వైసీపీలో కొత్త వివాదం”

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది YSR Congress Party. పార్టీ నేతల నుంచి వస్తున్న వ్యాఖ్యలు తాజాగా పెద్ద దుమారం రేపుతున్నాయి. టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన Mithun Reddy, తమ అధినేత...

Jana Nayagan: విజయ్ కు మరో భారీ షాక్.. లోకల్ చానెల్లో ‘జననాయగన్’

Jana Nayagan: తమిళనాడు రాష్ట్రాన్ని ఎన్నికల వేడి కుదిపేస్తున్న ప్రస్తుత తరుణంలో మరో అంశం కూడా జోరుగా వార్తల్లో నిలుస్తోంది. అదే.. విజయ్ హీరోగా తెరకెక్కిన ‘జననాయగన్’ సినిమా. జనవరిలో విడుదల కావాల్సిన...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రీ-ఎంట్రీ.. బెల్లంకొండ గణేష్‌తో కొత్త సినిమా!

తొలిప్రేమ వంటి క్లాసిక్ ప్రేమకథతో దర్శకుడిగా గుర్తింపు పొందిన కరుణాకరన్ మళ్లీ టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నట్లు...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం మీద నవ్వొచ్చే కామెంట్స్ చేసుకుంటే సబబు...