Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్స్ సెన్సేషన్ మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వం వహించిన సినిమా ప్రస్తుతం ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. అయితే.. ఇప్పుడీ సినిమాకి తెలంగాణ రాష్ట్రంలో టికెట్ ధరల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనూహ్య పరిణామం ఎదురైంది.
టికెట్ ధరల పెంపుపై సినిమాకు ఇచ్చిన వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ‘గేమ్ చేంజర్’ టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. తెలంగాణలో ఇకపై ఏ సినిమాకీ ప్రీమియర్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘గేమ్ చేంజర్’ విడుదల రోజున తెల్లవారుఝామున 4గంటలకు స్పెషల్ షోతోపాటు 6షోలు.. టికెట్ రేట్లను సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ.100, మల్టీ ప్లెక్స్ లలో రూ.150 పెంచుకునేందుకు అనుమతిచ్చింది రాస్ట్ర ప్రభుత్వం. = జనవరి 11 నుంచి 19 వరకూ 5షోలకు సింగిల్ ధియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ ల్లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
