Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా టీజర్ నేడు విడుదలైంది. ఇండియాకు హార్ట్ సిటీగా పేరున్న లక్నో నగరంలో టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. భారీ అంచనాల మధ్య వచ్చిన టీజర్ అభిమానులకు అంతకుమించిన కిక్ ఇచ్చింది. రామ్ చరణ్-కియరా అద్వాణీ వేడుకలో అలరించారు. ‘తెలుగు బులెటిన్’ స్వయంగా అభిమానుల్ని పలకరించింది. రామ్ చరణ్ పై ఉన్న అభిమానాన్ని వారు పంచుకున్నారు.
వేడుకలో హైలైట్స్..
- వేడుక జరిగింది ఉత్తరాంధ్రలోనా.. ఉత్తరాది లక్నోలోనా అన్నట్టు అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
- రామ్ చరణ్ ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు ఉండటం విశేషం.
- వేడుక సాయంత్రం 6గంటలకే అయినా.. 3.30కే అభిమానులు, స్థానిక అభిమానులు సైతం తరలివచ్చారు.
- రామ్ చరణ్ ను చూసేందుకు ఎంతసేపైనా ఉంటామని ఉత్సాహం, కేరింతలతో సందడి చేశారు.
- రామ్ చరణ్ కు దక్షిణాదిలోనే కాకుండా జాతీయస్థాయిలో పెరిగిన క్రేజ్ కు ఇది నిదర్శనం.
- లక్నోలో వేడుకకు దక్షిణాది మీడియాను ఆహ్వానించారు. వీరిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వారున్నారు.
- హిందీ మీడియా సైతం భారీ కవరేజ్ ఇవ్వడం విశేషం.
- రామ్ చరణ్ కోసం తామెంత అభిమానం చూపిస్తామనేది ‘తెలుగు బులెటిన్’ మీడియాతో పంచుకున్నారు.
- రామ్ చరణ్-కియరాను వ్యాన్ పై నుంచి మీడియా, అభిమానులను పలకరించేందుకు చేసిన ఏర్పాట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
- మీడియాకు చేసిన ఏర్పాట్లు.. మీడియా కవరేజ్ కోసం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి.
- రామ్ చరణ్ లుక్స్, పెర్ఫార్మెన్స్, శంకర్ మార్క్ వంద శాతం కనిపించాయనేది మీడియా ఉవాచ.
- మొత్తంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు ఆర్ఆర్ఆర్ తర్వాత ‘గేమే చేంజర్’ ఫుల్ ఫీస్ట్ అని చెప్పాలి.
- టీజర్ కట్ తో జనవరి 10న విడుదల కాబోతున్న ‘గేమ్ చేంజర్’పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయనేది వాస్తవం.
I was suggested this web site by my cousin. I am not sure whether
this post is written by him as nobody else know such detailed about my difficulty.
You are wonderful! Thanks!