Ukku Satyagraham: ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ నటించిన ఆఖరి చిత్రం,”ఉక్కు సత్యాగ్రహం”. ‘విశాఖ ఉక్కు-తెలుగు వారి హక్కు’ నినాదంతో స్వీయ దర్శకత్వంలో హీరో.. జనం స్టార్ సత్యారెడ్డి నిర్మాతగా సినిమాను తెరకెక్కించారు. సినిమాలో మూడు పాటలు పాడి రెండు పాటలతోపాటు కొన్ని సందేశాత్మక సన్నివేశాల్లో గద్దర్ నటించడం విశేషం. ఆగష్టు 30న విడుదలవుతున్న సినిమా పోస్టర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది.
చిత్ర దర్శక-నిర్మాత, హీరో సత్యారెడ్డి మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. భూనిర్వాసితులకి న్యాయం చేయాలనే కథాంశంతో సినిమాను తెరకెక్కించాం. సినిమాని 3ఏళ్లపాటు కష్టపడి నిర్మించాం. నిజజీవితంలో పోరాడుతున్న స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్స్, ఎంప్లాయిస్, భూనిర్వాసితులతోపాటు ఎంతోమంది మేధావులు, కవులు, కళాకారుల, రచయితలు సినిమాలో నటించారు’.
ఢిల్లీలోని ఇండియా గేట్, జంతర్ మంతర్, ఆంధ్రప్రదేశ్ భవన్, సింగరేణి కోల్ మైన్స్, విశాఖపట్నం.. తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని 200లకు పైగా దియోటర్లలో సినిమా విడుదల చేస్తున్నా’మని తెలిపారు.