కంటెంట్ డ్రివెన్ సినిమాలతో విలక్షణ కథలతో సినిమాలను నిర్మిస్తూ దూసుకెళ్తోంది గీతా ఆర్ట్స్ 2 బ్యానర్. వారు నిర్మించిన చిత్రాలు భలే భలే మగాడివోయ్, ప్రతీరోజూ పండగే, మహానుభావుడు వంటి సూపర్ హిట్స్ ను అందుకుని రీసెంట్ గా పక్కా కమర్షియల్ ను కూడా తెరకెక్కించింది జీఏ2 బ్యానర్.
ఇక జోహార్, అర్జున ఫాల్గుణ వంటి సినిమాలతో తేజ మర్ని తన విలక్షణతను చాటుకున్నాడు. బన్నీ వాస్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నేడు హైదెరాబా లోని ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ఈ చిత్రం పూజ కార్యక్రమాలతో మొదలైంది. అల్లు అరవింద్ సమర్పిస్తోన్న ఈ సినిమాకు బన్నీ వాస్ తనయ బేబీ హాన్విక క్లాప్ కొట్టారు.
బన్నీ వాస్ తో పాటు విద్యా మాధురి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.