ఏపీలో 15 నుంచి ‘స్త్రీశక్తి’ – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,898FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకానికి ‘స్త్రీశక్తి’ అనే పేరు పెట్టింది. ఈ పథకం ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంటుంది. సూపర్ లగ్జరీ, నాన్‌స్టాప్ బస్సులకు ఈ సౌకర్యం వర్తించదు.

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం, బస్సుల్లో సీసీ కెమెరాలు మరియు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రద్దీని బట్టి అదనపు బస్సులు నడపడం, త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం కూడా ప్రణాళికలో ఉంది.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతోనే పథకాన్ని ప్రారంభించగా, అన్ని జిల్లాల్లో దశల వారీగా విస్తరించనున్నారు. ఉచిత ప్రయాణానికి జీరో టికెట్ జారీ చేయాలని ఆర్టీసీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని మహిళల సాధికారతకు, సురక్షితమైన ప్రయాణానికి ఒక మైలురాయిగా పేర్కొంది. ఈ పథకం ద్వారా మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లు ప్రయాణ ఖర్చు విషయంలో గణనీయమైన ఆదా పొందనున్నారు.

సినిమా

Peddi pre-release: కెరీర్లో పదేళ్లకోసారి వచ్చే అద్భుతమైన కథ.. ‘పెద్ది’: రామ్...

Peddi pre-release: ‘ఎన్నో కథలు వింటాం. కొన్ని నచ్చుతాయి. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి కానీ, నాన్న చెప్పినట్టు.. పదేళ్లకోసారి వస్తుందేమో ఇలాంటి కథ. అదే ‘పెద్ది’. ఇటువంటి...

వెంకటేష్ – కళ్యాణ్ రామ్ – అనిల్ రావిపూడి సినిమా షూటింగ్‌కు...

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న భారీ మల్టీస్టారర్ చిత్రంపై ఆసక్తికర అప్డేట్ వెలువడింది. సినీ వర్గాల...

Chiranjeevi: పొలాచ్చి వెళ్లిన మెగాస్టార్..! చిరంజీవి-బాబి మూవీ కీలక షెడ్యూల్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ఇటివలే ప్రారంభమైంది. బాబి కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. వాల్తేరు వీరయ్య ఘన విజయం తర్వాత వీరిద్దరి కాంబోలో...

ఆల్ ఇండియా కాపు, తెలగ, బలిజ సంఘానికి అల్లు అరవింద్...

ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని ఆల్ ఇండియా కాపు, తెలగ,...

విచిత్ర ప్రశ్నలు.. హుందాగా సమాధానమిచ్చిన రామ్ చరణ్

జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఎదురైన రెండు ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ప్రశ్నల స్వభావం...

రాజకీయం

“సామాన్యులు పన్నులు కడుతుంటే.. సంస్థలు ఎగవేస్తే ఎలా?”: పవన్ కళ్యాణ్

పంచాయతీలకు రావాల్సిన పన్నులను ఎగవేసే విద్యాసంస్థలు, పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పంచాయతీలు అందిస్తున్న మౌలిక...

అమరావతి నుంచి ఏఐ హబ్ వరకు.. ఏపీ అభివృద్ధి బ్లూప్రింట్ వివరించిన లోకేష్

ముంబైలో జరిగిన బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇండియా కాన్ఫరెన్స్-2026లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్ర అభివృద్ధి దిశ, పెట్టుబడుల ఆకర్షణ, డేటా సెంటర్లు, ఉద్యోగాల సృష్టి, అమరావతి...

తెలంగాణ రాజకీయాల్లో పవన్ సునామీ.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం.?

మంత్రులు మీడియా ముందుకొచ్చి విమర్శించేస్తున్నారు. ప్రొఫెసర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీడియా సంగతి సరే సరి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఆషామాషీగా లేదు. ఇదంతా ఎందుకు.? పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో...

పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: పొన్నం ప్రభాకర్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘నవ నిర్మాణ సభ’పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేళ...

కుల, మత విభేదాలకు తావులేని రాజకీయాలే లక్ష్యం.. ‘సేనా గళం’ ఏర్పాటుపై పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమకాలీన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ లక్ష్యంగా ‘సేనా...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: వృషభ రాశివారికి ఆర్థికంగా అనుకూలం.. ధనుస్సు రాశివారికి కొత్త అవకాశాల సూచనలు

జూన్ 1 , 2026 సోమవారం రాశిఫలాలు: చాంద్రమాన పంచాంగం ఆధారంగా జూన్ 1 సోమవారం ద్వాదశ రాశుల వారికి గ్రహ స్థితులు, రోజువారీ పరిస్థితుల ఆధారంగా ఫలితాలు తెలుసుకుందాం. కొన్ని రాశుల వారికి...

పంచాయతీల ఆర్థిక బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఫోకస్.. గోదావరి కాలుష్య నివారణకు రూ.100 కోట్లు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనపై ప్రత్యేక దృష్టి సారించారు. సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని, గ్రామాల అభివృద్ధికి ఆన్లైన్ పన్నుల విధానం కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు....

తెలంగాణపై వ్యాఖ్యలు వద్దు.. మహానాడుపై చంద్రబాబు కీలక సూచనలు

తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో పార్టీ జనరల్ సెక్రటరీలు, జోనల్ ఇంచార్జ్‌లు, ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి జరిగిన...

గోదావరి కాలుష్యంపై పవన్ ఫోకస్.. ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ కార్యాచరణ ప్రకటింపు

రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’ పేరుతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు...

చెత్త నుంచి విద్యుత్.. చంద్రబాబు ఆలోచనకు మళ్లీ ఊపిరి!

ఆంధ్రప్రదేశ్‌లో చెత్త నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి అంశం మరోసారి చర్చనీయాంశంగా మారుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల నేపథ్యంలో, ఈ రంగంలో గత ప్రభుత్వాల...