అప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు.! కాదు కాదు, ఆ ముసుగులో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు బిల్డప్.! సమయం చూసి, వెన్నుపోటు పొడవడం.! ఒకప్పుడు చిరంజీవికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కీ ఎదురవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చుట్టూ నడుస్తున్న ‘స్పేస్’లను పరిశీలిస్తే, ‘ఇంత మంది ఫేక్ అభిమానులున్నారా.?’ అన్న అనుమానం కలగకమానదు.
అందులో కొందరు రాత్రికి రాత్రి, పవన్ కల్యాణ్ అభిమానులుగా మారి, తెల్లారేసరికి ప్లేటు ఫిరాయించేసేవాళ్ళు.. ఇంకొందరేమో, వ్యూహాత్మకంగా కొన్ని నెలలు లేదా సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అనిపించుకుని.. కీలక సమయంలో దెబ్బ కొట్టేవాళ్ళు.. కనిపిస్తున్నారు.
దురదృష్టకరమైన విషయమేంటంటే, నిఖార్సయిన అభిమానులకు లభించని పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్, ఈ తరహా ఫేక్‌గాళ్ళకి తేలిగ్గానే లభిస్తోంది. పవన్ కళ్యాన్‌తో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. మిగతా అభిమానుల్ని ట్రాప్‌లో పడేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ 24 సీట్లు తీసుకోవడమేంటి.? దీనికన్నా, పార్టీని టీడీపీలో విలీనం చేసెయ్యడం బెటర్.. అన్న చర్చకు తెరలేపారు కొందరు. ఇంకొందరైతే, రాజకీయ పార్టీ పెట్టడమెందుకు.? ఎన్జీవో పెట్టుకోవచ్చు కదా.. అన్నది ఇంకొందరి ఉవాచ.
సరిగ్గా ఎన్నికలకు 50 రోజుల ముందర, జనసైనికుల్ని గందరగోళానికి గురిచేస్తోంది ఈ పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన అధినాయకత్వం, జనసేన ఐటీ విభాగం వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంది.