Switch to English

13 ఇళ్లున్న గ్రామానికి.. రూ. 2 కోట్లతో రోడ్డు సదుపాయం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,947FansLike
57,764FollowersFollow

గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు ఎలా ఉంటాయో తెలిసిందే. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి ఎక్కువగా డోలీలపై ఆధారపడాల్సిన పరిస్థితిని చాలా దగ్గర చూస్తుంటాం. అయితే అక్కడ మాత్రం కూటమి ప్రభుత్వం ఆ ఊరి ప్రజల వెతలకు ఫుల్ స్టాప్ పెట్టింది. కొన్నేళ్లుగా అసలు రోడ్డు సదుపాయమేలేని ఆ ఊరికి రూ. 2 కోట్లతో రహదారి వేయించింది.

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధిలోని బింగిడి వలస గ్రామానికి ఎన్నో సంవత్సరాలుగా రోడ్డు లేదు. అత్యవసర సమయాల్లో వారికి డోలీలే శరణ్యం. అయితే గత టీడీపీ ప్రభుత్వం 400 మీటర్ల మేర మట్టి రోడ్డు వేసి నిధుల సమస్య వల్ల వదిలేసింది. ఆ తర్వాత వైసీపీ హయాంలో పలుమార్లు రోడ్డు సదుపాయం గురించి మొరపెట్టుకున్న ఫలితం లేదు.

బింగిడి వలస గ్రామ ప్రజల కష్టాలని గుర్తించిన కూటమి ప్రభుత్వం దిగువమెంగిడి – బూర్జ ప్రధాన రహదారి నుంచి శిఖరాగ్రం లో ఉన్న బింగిడి వలస గ్రామానికి 1.4 కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు వేయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ. రెండు కోట్ల నిధులు కేటాయించింది.

ఇటీవలే రోడ్డు పనులకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి శంకుస్థాపన చేశారు. బింగిడివలస లాగే శిఖరాగ్రం లో ఉన్న అన్ని గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. ఇంతకీ ఆ ఊరిలో ఉన్న ఇళ్లెన్నో తెలుసా.. అక్షరాల 13. జనాభా కేవలం 55 మంది మాత్రమే.

సినిమా

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

అఖండ 2కి అకస్మాత్తు బ్రేక్: భారీ షాక్‌కు గురైన అభిమానులు, ఇండస్ట్రీ

అఖండ 2 విడుదలపై అర్ధరాత్రి వచ్చిన ఆకస్మిక ప్రకటన తెలుగు చిత్ర పరిశ్రమను, బాలకృష్ణ అభిమానులను తీవ్ర నిరాశలోకి నెట్టింది. నిర్ణయించిన తేదీకి సినిమా విడుదల...

అఖండ 2 విడుదల వాయిదా: అర్ధరాత్రి మేకర్స్ ప్రకటనతో అభిమానుల...

అర్ధరాత్రి సమయంలో అఖండ 2 మేకర్స్ ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. అనివార్య కారణాల వల్ల చిత్రం నిర్ణయించిన...

రాజకీయం

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

కలెక్టర్ తెలుగు శ్రద్ధకు.. పవన్ కళ్యాణ్ ప్రశంసలు

పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా చూపించిన తెలుగు భాషాభిమానం ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఆకట్టుకుంది. చిలకలూరిపేటలో జరిగిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో ఆయన, తెలుగు నేర్చుకోవడంపై కలెక్టర్‌గారి కృషిని హృదయపూర్వకంగా...

ఎక్కువ చదివినవి

తెలంగాణలో జనసేన బలోపేతం – ఉత్సాహంగా జనశ్రేణుల సమావేశం

హైదరాబాద్ రాయల్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు జరిగిన తెలంగాణ జనశ్రేణుల విస్తృతస్థాయి సమావేశం జనసేన కార్యకర్తలతో సందడి చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ వైస్ ప్రెసిడెంట్ బి....

హెలికాప్టర్‌ పడిపోవాలి అన్న నాని వ్యాఖ్యలతో వైసీపీ శాడిజం బట్టబయలు: బొలిశెట్టి శ్రీనివాస్

సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ హెలికాప్టర్లు, విమానాల్లో ప్రయాణిస్తే అవి పడిపోవాలనే పేర్ని నాని వ్యాఖ్యలు వైసీపీ నేతల శాడిజం, నీచ బుద్ధిని స్పష్టంగా బయటపెడుతున్నాయని...

“పార్టీ శాశ్వతం… కార్యకర్తలే శక్తి!” – పాలకొండలో లోకేష్ సందేశం

పాలకొండలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే సందేశం ఇచ్చారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన స్పష్టం...

తిరుపతిలో నకిలీ సీఐ హల్‌చల్… శివయ్య బాగోతం బట్టబయల్!

తిరుపతి జిల్లాలో నకిలీ సీఐ శివయ్య చేస్తున్న హడావిడి పెద్ద సెన్సేషన్‌గా మారింది. రెడ్‌ శాండిల్‌ టాస్క్‌ ఫోర్స్‌ సీఐగా పనిచేస్తున్నానంటూ పెద్దగా వేషాలు వేసిన శివయ్య, చినగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లిలో ఓ...

హైదరాబాద్‌కి కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్… ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు చేసే ఆలోచన

న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బంజారాహిల్స్‌లోని ఎల్‌.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో...