Switch to English

ఫ్లాష్ న్యూస్: ఫొటోటాక్‌ : కూతురు హోదా చూసి తండ్రి కళ్లలో ఆనందం

06.25 P.M: ఫొటోటాక్‌ : కూతురు హోదా చూసి తండ్రి కళ్లలో ఆనందం

కని పెంచిన కొడుకు లేదా కూతురు ప్రయోజకులు అయినప్పుడు ఆ తల్లిదండ్రుల ఆనందంకు అవధులు ఉండవు. కూతురు విజయంను చూస్తూ ఒక తండ్రి ఆనందిస్తున్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మణిపూర్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పోలీసు అధికారికగా బాధ్యతలు చేపట్టింది రతన్‌ గ్నసెప్పం. కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న రతన్‌ ఇటీవలే డ్యూటీలో జాయిన్‌ అయ్యింది.

యూనిఫామ్‌ వేసుకుని డ్యూటీకి వెళ్తున్న కూతురుకు ఉన్న స్టార్స్‌ను తండ్రి ఆసక్తిగా చూస్తు ఉండగా, అమిత్‌ పంచాల్‌ అనే జర్నలిస్ట్‌ ఈ ఫొటోను తీశాడు. తన విజయం తాలూకు ఆనందంను తండ్రి కళ్లలో చూసిన రతన్‌ గ్నస్పెం ఆనందానికి అవధులు లేవు. తన కూతురు ఆ హోదాలో చూసిన ఆ తండ్రి ఆనందం కూడా అంతా ఇంతా కాదు. తండ్రి కూతుళ్ల ఆనందదాయక ఈ ఫొటోకు వేలల్లో లైక్స్‌ వందల్లో కామెంట్స్‌ వస్తున్నాయి.

06.00 P.M: సిర్పూర్లో మరో గ్యాస్ లీకేజ్ – 20మందికి అస్వస్థత

ఫ్లాష్ న్యూస్: హతవిధి టీటీడీకి ఎంతటి కష్టమొచ్చింది

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై ఇంకా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.. అదే రోజు దేశంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజుకొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం పేపర్ ఇండస్ట్రీలో మరో ప్రమాదం జరిగింది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పేపర్ 1, 2 ఫ్లాంట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు లోనయ్యారు.

ముఖ్యంగా బాయిలర్‌కు దగ్గర్లోని క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు భయాందోళనతో పరుగులు పెట్టారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఒకర్ని వెంటనే సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు. ప్రస్తుతం ఆ కార్మికుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందట. అలాగే మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు.

లాక్ డౌన్ కారణంగా పూర్తి స్థాయిలో బాయిలర్స్ ఉపయోగించడం లేదు, దాని వల్ల పేపర్ బ్రైట్ నెస్ పెంచడం కోసం ఉపయోగించిన క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడం వలనే ఈ ఘటన జరిగుంటదని సమాచారం. ఈ విషయంపై మాట్లాడటానికి జేకే పేపర్ మిల్ యాజమాన్యం మాట్లాడటానికి నిరాకరించడమే కాకుండా కార్మికులను అర్థాంతరంగా ఇంటికి పంపేసింది.

05.30P.M: హతవిధి టీటీడీకి ఎంతటి కష్టమొచ్చింది

ఫ్లాష్ న్యూస్: హతవిధి టీటీడీకి ఎంతటి కష్టమొచ్చింది

ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు జిల్లాలో ఉండే తిరుమల తిరుపతి దేవస్థానంకు అత్యంత ప్రాచుర్యం ఉంది. ప్రపంచ దేశాల నుండి వచ్చి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. రోజుకు రెండు కోట్లకు తగ్గకుండా హుండీ ఆదాయం, విరాళాలు ఇంకా ఇతరత్ర రూపాల ద్వారా డబ్బు వచ్చేది. కాని ఇప్పుడు లాక్‌ డౌన్‌ కారణంగా ఆదాయం జీరోకు పడిపోయింది. రూము కిరాయిల నుండి హుండీ ఆదాయం వరకు అంతా జీరో అవ్వడంతో టీటీడీ ఇప్పుడు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది.

గత నెలలో ఏదోలా జీతాలు ఇచ్చిన టీటీడీ ఇప్పుడు మాత్రం తమ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు కిందా మీద పడుతోంది. వేల కోట్ల టీటీడీ ఆస్తులు ఉన్నా వాటిని ముట్టుకోకూడదు అనే ఉద్దేశ్యంతో అధికారులు ఉద్యోగులకు జీతాలకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తిరుమల శ్రీవారి దేవస్థానం చేరుకోవడం అత్యంత బాధకరం.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేవస్థానంగా పేరు గాంచిన తిరుమలలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇతర చిన్న చిన్న ఆలయాల్లో కనీసం అర్చకుల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంటుంది. కరోనా మహమ్మారి వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాలను అతలా కుతలం చేస్తుంది అనేందుకు ఇదే సజీవ సాక్ష్యం.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ బాగా పెరిగింది. వరసగా టాలీవుడ్ లో...

నాగబాబు ట్వీట్స్ పై పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్.!

గత కొద్ది రోజులుగా మెగా బ్రదర్ నాగబాబు తన ట్వీట్స్ తో న్యూస్ లో దుమారం రేపుతున్న సంగతి అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం ఆయన గాడ్సే గురించి చేసిన కామెంట్స్...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...