Switch to English

ఫ్లాష్ న్యూస్: కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

కరోనాకు భయపడని తల్లి ప్రేమ.. ఎదిరించి గెలిచింది

చిన్నా పెద్దా ముసలి ముతక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కరోనా వైరస్‌ తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రతి చోట కూడా పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా కరోనా రోగులు నమోదు అవుతున్నారు. గత నెలలో చతీస్‌ఘడ్‌లో 17 నెలల పాపకు కరోనా సోకింది. ఆ పాపను ఐసోలేషన్‌లో ఉంచాల్సి వచ్చింది. అయితే కన్న తల్లి లేకుండా ఆ పాప ఉండలేని పరిస్థితి. కరోనా నెగటివ్‌ ఉన్న ఆ తల్లి పాపతో ఉండేందుకు వైధ్యులు ఒప్పుకోలేదు. కాని ఆమె బలవంతంగా పాపతోనే ఉండాలని సిద్దం అయ్యింది.

ప్రత్యేక అనుమతులతో ఆ పాపతోనే మూడు వారాల పాటు ఉంది. ఎట్టకేలకు పాపకు కరోనా నెగటివ్‌ అని తేలింది. మూడు వారాల పాటు బిడ్డతో ఉన్నందుకు గాను తల్లికి కూడా కరోనా పాజిటివ్‌ వచ్చి ఉంటుందని అంతా భావించారు. కాని కరోనా టెస్టులు నిర్వహించగా తల్లికి కరోనా లేదని తేలింది. వైధ్యులు చెప్పిన జాగ్రత్తలు అన్ని విధాలుగా తీసుకోవడంతో కరోనా వైరస్‌ ఆ తల్లిని చేరలేదు. కరోనాపై ఆ తల్లి విజయం సాధించింది అంటూ వైధ్యులు ప్రకటించారు.

కోవిడ్‌ హాస్పిటల్‌లో ఫైర్‌ యాక్సిడెంట్‌

ఫ్లాష్ న్యూస్: విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో అన్ని దేశాలు కూడా తమ దేశాన్ని కరోనా నుండి కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా అన్ని దేశాల్లో కూడా ప్రత్యేక కోవిడ్‌ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అత్యంత కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవడంతో పాటు చాలా జాగ్రత్తగా పేషంట్స్‌ను చూసుకుంటున్నారు. అలాంటి చోట ఫైర్‌ యాక్సిడెంట్‌ జరగడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.

రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లోని కోవిడ్‌ హాస్పిటల్‌లో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కోవిడి బాధితులు చిక్కుకున్నారు. ఆ మంటల్లో అయిదుగురు కరోనా రోగులు కాలి బూడిద అయ్యారు. పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలయ్యారు. మొత్తం 150 మందిని రెస్క్యూ టీం కాపాడి మరో హాస్పిటల్‌కు తరలించడం జరిగింది. రష్యాలో ఇప్పటి వరకు 2.32 లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 2116 మంది ఇప్పటి వరకు అక్కడ మరణించారు.

విశాఖ గ్యాస్‌ లీకేజీ మృతుల సంఖ్య తగ్గించిన పబ్జీ గేమ్

ఫ్లాష్ న్యూస్: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీక్‌ అయ్యి చుట్టుపక్కల గ్రామాల్లో జనాలు తీవ్ర అస్థతకు గురైన విషయం తెల్సిందే. 12 మంది మృతి చెందగా వందలాది మంది అనారోగ్యం పాలయ్యారు. పశువులు మృతి చెందడటంతో పాటు స్థానిక గ్రామంలోని పశుగ్రాసం, పంటలు అంతా కూడా విశతుల్యం అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండేది. కాని నీలావు కిరణ్‌ అనే కుర్రాడు చేసిన పనితో 12 మందితో మృతుల సంఖ్య ఆగింది.

అసలు విషయం ఏంటీ అంటే గ్యాస్‌ అర్థరాత్రి సమయంలో లీక్‌ అయ్యింది. ఆ సమయంకే అంతా కూడా నిద్ర పోయారు. మృతుల్లో ఎక్కువ శాతం మంది నిద్రలోనే మరణించినట్లుగా గుర్తించారు.

అర్థరాత్రి దాటిన తర్వాత నీలావు కిరణ్‌ పబ్జీ గేమ్‌ ఆడుతూ ఉండగా అతడికి గ్యాస్‌ వాసన వచ్చింది. వెంటనే అతడు అర్ట్‌ అయ్యి తన కుటుంబ సభ్యులను లేపడంతో పాటు పలువురు స్నేహితులకు ఫోన్‌ చేసి నిద్ర లేపాడు. వారు నిద్రలేచి వారి కుటుంబాలను పక్కింటి వారిని లేపడంతో అలా వందలాది మంది కిరణ్‌ వల్ల నిద్ర లేచారు. లేదంటే వారు నిద్రలోనే ఉండి ఉంటే మృతుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండేదంటూ స్థానికులు చెబుతున్నారు.

బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కు హోం క్వారంటైన్.! 

ఫ్లాష్ న్యూస్: మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

లాక్ డౌన్ కారణంగా విజయవాడలోనే ఉంటున్న ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఒక అత్యవసర పని పడడంతో పర్మిషన్ తీసుకొని హైదరాబాద్ బయలుదేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని రామాపురం చెక్ పోస్ట్ వద్ద గోపీచంద్ కు తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆయన నార్మల్ గా ఉండడంతో హోమ్ క్వారంటైన్ టాగ్ వేశారు. ఈ విషయంపై తెలంగాణ వైద్య ఆరోగ్య సిబ్బంది స్పందిస్తూ  ‘ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏమి లేనివారికి హోం క్వారంటైన్ ముద్ర వేస్తున్నామని’ చెప్పారు.

మంత్రి కేటీఆర్‌కు అనారోగ్యం, అసలేం అయ్యిందంటే..!

ఫ్లాష్ న్యూస్: ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎప్పుడు ఉత్సాహంగా నలుగురితో నవ్వుతూ ఉంటాడు. అయితే నిన్న సొంత నియోజకవర్గంలో పర్యటించిన ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లుగా కనిపించాడు. జలుబు మరియు దగ్గుతో ఆయన బాధపడుతున్నాడు. ఎప్పుడు లేనిది చేతిలో రుమాలును వాడుతూ పదే పదే ఆయన ముక్కు తూడ్చుకోవడం చేశాడు.

నియోజక వర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేయాల్సి ఉండగా కార్యక్రమాలను మద్యలోనే రద్దు చేసుకుని తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నాడు. వాతావరణ మార్పు మరియు ఇతరత్ర కారణాల వల్ల కేటీఆర్‌కు జలుబు చేసి ఉంటుందని పార్టీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆయన శ్రేయోభిలాషులు ఒకసారి కరోనా పరీక్ష చేయించుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

ఈ కన్న తల్లికి వచ్చిన పరిస్థితి మరెవ్వరికి రాకూడదు

కరోనా కారణంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చావుకు 10 మంది పెళ్లికి 20 మందిని అనుమతిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అయిదే భద్రాచలంలో మాత్రం ఒక బాలుడు చనిపోతే కనీసం ఇద్దరు ముగ్గురు కూడా లేకపోవడంతో ఒక రిక్షాలో డెడ్‌ బాడీని తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ కన్న తల్లి బాధ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలం సుందరయ్య నగర్‌కు చెందిన ఫరీదా భర్త పదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కొడుకులను అన్ని తానై పెంచింది. చిన్న కొడుకు గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతున్నాడు. తాజాగా 12 ఏళ్ల సాదిక్‌ తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందాడు. సాదిక్‌ అంత్యక్రియలకు స్థానికులు మరియు బంధువులు ఎవరు రాలేదు. దాంతో సాదిక్‌ తాత స్వయంగా ఒక రిక్షా ఏర్పాటు చేసి అందులో అంతిమ యాత్ర నిర్వహించి  గోదావరి ఒడ్డున సాదిక్‌ మృతదేహంను పూడ్చి పెట్టాడు. తన కొడుకు చనిపోయాడన్న బాధతో పాటు అంత్యక్రియలు ఇలా చేయాల్సి రావడంతో ఆ తల్లి బాధ వర్ణనాతీతం. ఇలాంటి దారుణ పరిస్థితులు ఈ ప్రపంచంలో మరెవ్వరికి రావద్దంటూ ఆ తల్లి తల్లడిల్లి పోయింది.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు చూసాక స్పందిస్తా: మంత్రి తలసాని

సినీ పరిశ్రమ గురించి ప్రముఖులతో జరిగిన చర్చలపై బాలకృష్ణ వ్యాఖ్యలను చూశాక స్పందిస్తానని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. షూటింగ్స్ పునఃప్రారంభించే విషయమై సినిమా, టీవీ...

టీటీడీ ఆస్తుల అమ్మకంపై బోర్డు కీలక నిర్ణయం

కొన్ని రోజుల క్రితం టీటీడీకి చెందిన ఆస్తులను అమ్మేందుకు బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. బహిరంగ వేలంకు ప్రకటన రావడం.. భూముల వివరాలను కూడా ప్రకటించిన తర్వాత తీవ్ర విమర్శలు రావడంతో...

బ్రేకింగ్ న్యూస్: 12 గంటల్లో ఢిల్లీలో రెండు భారీ అగ్ని ప్రమాదాలు.!

సోమవారం అర్ధరాత్రి 12 గంటల 50 నిమిషాలకి ఢిల్లీలోని తుగ్లకాబాద్‌ మురికివాడలో మంటలు చెలరేగాయి.ఈ మంటలు సుమారు రెండు ఎకరాల మేర వ్యాపించడంతో అక్కడున్న దాదాపు 1500 గుడిసెలు ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదం...

ఫ్లాష్ న్యూస్: ఏసీలో మంటలు.. బీజేడీ నేత మృతి

ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో గోషనిన్‌గావ్‌లో నిన్న ఉదయం బీజేడీ నేత అలేఖ్‌ చౌదరి మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. ఆయన్ను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా మంటల్లో చిక్కుకుని ఊపిరి...

అఫీషియల్: మహేష్ బాబు 27వ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్.!

'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత దాదాపు 5 నెలల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి తన 27వ సినిమా న్యూస్ వచ్చింది. చాలా రోజులుగా మహేష్...