Switch to English

ఫ్లాష్ న్యూస్: టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్

05:00PM:  టీవీ5పై దాడి చేసిన వారిని శిక్షించాలి – పవన్ కళ్యాణ్

కొద్దీ రోజులుగా ప్రభుత్వాలు మీడియాపై తమ జులుం చూపిస్తున్నాయని ఇది వరకే తెలిపాం. ప్రస్తుతం ఓ అధికార పార్టీకి వ్యతిరేకంగా కథనాలు రచిస్తే వారిపై అధికార రౌడీయిజం చూపిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని టీవీ 5 ప్రధాన కార్యాలయం పై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దాని వలన ఆర్ధిక నష్టం జరిగింది. ఈ దుష్ట చర్యలపై స్పందించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయంపై టీవీ5 యాజమాన్యానికి తన సంఘీభావం తెలియజేస్తూ ఇలాంటి దుష్ట చర్యలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడమే కాకుండా దోషులను గుర్తించి చట్టపరంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

04:45PM:  సోషల్‌ డిస్టెన్స్‌ పాటించేలా చేస్తున్న రోబో డాగ్‌

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తున్న ఈ సమయంలో పలు దేశాలు లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నాయి. రెండు మూడు నెలలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతున్న కారణంగా కొన్ని చోట్ల సడలింపులు ఇస్తున్నారు. సింగపూర్‌లో కూడా లాక్‌డౌన్‌ విధించినా కూడా అక్కడ కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే ప్రజలు సామాజిక దూరం పాటించేలా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుంది.

పార్క్‌ల్లో పాదచారులు ఇంకా ఇతర కార్యక్రమాలు నిర్వహించే వారు సామాజిక దూరం పాటించేలా రోబో డాగ్‌ను ఏర్పాటు చేశారు. అచ్చు కుక్కలా ఉండే ఈ రోబో కుక్కలా ప్రవర్తిస్తుంది. గుంపులుగా ఎక్కడ జనాలు కనిపించినా కూడా అక్కడకు వెళ్లి సౌమ్యంగా ఫిజికల్‌ డిస్టెన్స్‌ను పాటించాల్సిందిగా కోరుతుంది. ఆ కుక్క సౌమ్యంగా చెప్పడంతో ప్రతి ఒక్కరు కూడా ఆ కుక్క మాట విని ఫిజికల్‌ డిస్టెన్స్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.

04:30PM:  విజయనగరం జిల్లాలో మరణాల ఖాతా తెరిచిన కరోనా

ఫ్లాష్ న్యూస్: ఇవంకాని టెన్షన్ పెట్టిన కరోనా పాజిటివ్ కేసు.!

దాదాపు 40 రోజులు ఒక్క కేసు కూడా లేని విజయనగరంలో ఇటీవలే కరోనా కేసులు నమోదవ్వడం మొదలయ్యాయి. అవి రోజు రోజుకీ పెరుగుతున్నాయి కూడాను. విజయనగరం జిల్లాలో మొదట సమోదైన మొదటి కరోనా కేసు మహిళ నేడు మరణించింది. బలిజిపేట మండలం చిలకపల్లి గ్రామానికి చెందిన వృద్దురాలు కిడ్నీ ప్రాబ్లెమ్ తో బాధపడుతూ విశాఖపట్నం వెళ్ళింది. కానీ అక్కడ టెస్టుల్లో కరోనా పాజిటివ్ గా తేలడంతో విమ్స్ హాస్పిటల్ లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. కానీ కిడ్నీ సమస్య వలన కోలుకోలేక మరణించింది.

14:00AM: ఇవంకాని టెన్షన్ పెట్టిన కరోనా పాజిటివ్ కేసు.!

ఫ్లాష్ న్యూస్: పార్కింగ్ గొడవకి కబడ్డీ ప్లేయర్ ప్రాణం తీసిన ఎస్సై

అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ అమెరికాలో 13.22 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 79వేల మంది చనిపోయారు. నిన్ననే ట్రంప్ టీంలోని ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంతో వైట్ హౌస్ లో హై టెన్షన్ మొదలైందని తెలిపాము.

అది జరిగి 24 గంటలు కాకముందే ట్రంప్ కుమార్తె ఇవాంక సహాయకురాలికి మరియు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ సిబ్బందిలోని ఒకరికి కరోనా పాజిటివ్అని తేలింది. ఇక్కడ కాస్త హ్యాపీ న్యూస్ ఏంటంటే కరోనా పాజిటివ్ వచ్చిన ఇవాంకా సహాయకురాలు దాదాపు 2 నెలలుగా ఇంటి నుంచే పనిచేస్తుండడం. ఇవాంకతో పాటు ఆమె భర్త జరేడ్ కుష్‌నర్‌కు కోవిడ్ టెస్ట్స్ చేయగా నెగటివ్ వచ్చిందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు. కరోనా మహమ్మారి అమెరికాని పట్టి పీడిస్తున్నట్టే వైట్ హౌస్ మీద కూడా తన జులుం చూపిస్తోంది.

11:45AM: పార్కింగ్ గొడవకి కబడ్డీ ప్లేయర్ ప్రాణం తీసిన ఎస్సై

ఫ్లాష్ న్యూస్: సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

పంజాబ్‌కు చెందిన ప్రముఖ కబడ్డీ ప్లేయర్‌ అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఏఎస్సై పరమ్‌ జిత్‌ సింగ్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ ఎస్‌యూవీ కారులో ప్రయాణిస్తు రోడ్డు పక్కన పార్క్‌ చేశారు. ఆ సమయంలోనే అటుగా పెట్రోలింగ్‌ చేస్తూ వెళ్తున్న ఏఎస్సై పరమ్‌ జిత్‌ సింగ్‌ ఆ కారును చూసి ఆపి ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆపారంటూ ప్రశ్నించారు. దాంతో అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ సమాధానం చెప్పకుండా వెళ్లి పోయాడు. కారు స్పీడ్‌గా వెళ్తుండటంతో ఏఎస్‌ఐ  పరమ్‌ జిత్‌ ఆ కారును ఫాలో అయ్యాడు.

కొద్ది సేపు చేజింత్‌ తర్వాత అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ కారును ఆపేశాడు. ఆ సమయంలో బటయకు వచ్చిన అర్వీందర్‌ సింగ్‌పై పరమ్‌ జిత్‌ సింగ్‌ కాల్పులు జరిపాడు. కారులోంచి దిగుతున్న మరో వ్యక్తిపై కూడా పరమ్‌ జిత్‌ కాల్పులు జరిపాడు. అర్వీందర్‌ సింగ్‌ మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసు ఉన్నతాధికారులు పరమ్‌ జిత్‌ సింగ్‌పై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. డిస్మిస్‌ చేయడంతో పాటు హత్య కేసును కూడా నమోదు చేసి పరమ్‌ జిత్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపించారు. అర్వీందర్‌ జిత్‌ సింగ్‌ మరణంతో స్థానికంగా ఆయన అభిమానులు సన్నిహితులు శోఖంలో మునిగిపోయారు.

10:45AM: సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

సీఎం గారు ప్రజలు కావాలో ఫ్యాక్టరీలు కావాలో తెల్చుకోండి?

వైజాగ్‌ ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుండి విషవాయువులు లీక్‌ అయ్యి 12 మంది చనిపోయిన విషయం తెల్సిందే. ఆ సంఘటన నుండి స్థానికులు తేరుకోలేక పోతున్నారు. ముందు ముందు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయనే ఆందోళన ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతోంది. ఆ ఫ్యాక్టరీ ఉన్న వెంకటాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చి ఆందోళన మొదలు పెట్టారు. కంపెనీ మూసేయండి లేదంటే పోయిన ప్రాణాలను తీసుకు రాండి అంటూ ఆందోళనకారులు ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

చనిపోయిన వారి మృత దేహాలను రహస్యంగా తరలించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆందోళనకారులు ఎల్జీ పాలిమర్స్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు అంతా కూడా ఫ్యాక్టరీ వైపే ఉన్నారంటూ ఆందోళనకారులు అంటున్నారు. ఫ్యాక్టరీని అక్కడ నుండి తరలిస్తామని ప్రభుత్వం నుండి ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్నారు. సీఎం జగన్‌ గారు మీకు ఫ్యాక్టరీ కావాలో ప్రజలు కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆందోళనకారులు అంటున్నారు. మరి ప్రభుత్వం ఈ విషయమై ఎలా స్పందిస్తుందో చూడాలి.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

ప్రేయసి కోసం ప్రియుడు.. అమ్మాయి వేషంలో వెళ్లి..

‘దేశంలో లాక్ డౌన్ వల్ల వ్యవస్థలన్నీ నిస్తేజమైపోయాయి.. ఆర్ధిక లావాదేవీలు ఆగిపోయాయి.. ప్రజలంతా ఇళ్లకే పరిమితమైపోయారు.. కార్మికులు పనుల్లేక అవస్థలు పడ్డారు..’ ఇవే మనం చూశాం. కానీ.. లాక్ డౌన్ వల్ల ప్రేమికులు...

పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్న చిరంజీవి ఫ్యామిలీ

మెగాస్టార్ చిరంజీవి తేనెటీగల దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా దోమకొండలో ఈ ఘటన జరిగింది. ఇటివల రామ్ చరణ్ భార్య ఉపాసన తాతయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కామినేని...

జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌: ఎస్‌ఇసిగా నిమ్మగడ్డకు లైన్‌ క్లియర్‌

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం...

జనవరిలో జరిగిన వుహాన్ విందే నేటి అల్లకల్లోలానికి కారణమా..

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ వైరస్ పుట్టింది చైనాలోని వుహాన్ నగరంలోనే అయినా.. ఎలా పుట్టిందో.. ఎందుకు ఇంతగా వ్యాపించిందో ఇప్పటికీ సరైన సమాధానం లేదు....

‘కరోనా’ కేవలం ప్రారంభం మాత్రమే.!

అ!, కల్కి చిత్రాల దర్శకుడు ప్రశాంత్ వర్మ మూడో సినిమాతో వచ్చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం కరోనా వైరస్ నేపధ్యంలో ఒక చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించిన ప్రశాంత్ నిన్న ఆ చిత్రానికి సంబంధించిన...