Switch to English

భారత్ చేరిన బ్రహ్మాస్త్రాలు.. ‘రఫేల్ యుద్ధ విమానాలు’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,516FansLike
57,764FollowersFollow

అత్యాధునిక టెక్నాలజీ కలిగిన రఫేల్ యుద్ధ విమానాలు భారత్‌ అమ్ములపొదిలో చేరాయి. హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ స్టేషన్‌లో ల్యాండ్ అయ్యాయి. త్వరలో ఇవి 17వ వైమానిక స్క్వాడ్రన్ లో ఇవి చేరనున్నాయి. ఆగష్టులో మరికొన్ని రఫేల్ యుద్ధ విమానాలు రానున్నాయి. దక్షిణ ఆసియాలోనే ఇవి శక్తివంతమైనవిగా గుర్తింపు పొందాయి. సోమవారం ఫ్రాన్స్‌లో బయలుదేరిన ఈ యుద్ధ విమానాలు 7వేలకు పైగా కిలోమీటర్ల ప్రయాణంలో యూఏఈలో కాసేపు విశ్రాంతి తీసుకుని ఈరోజు మధ్యాహ్నానికి భారత్‌కు చేరుకున్నాయి. 58 వేల కోట్ల రూపాయల ఖర్చుతో మొత్తం 36 యుద్ధ విమానాలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తొలి విడతగా అయిదు రఫేల్ యుద్ధ విమానాలను అందించింది.

ట్విన్ ఇంజిన్స్.. నెక్స్ట్ జెనరేషన్ టెక్నాలజీ..

ట్విన్ ఇంజిన్స్‌ గల రఫేల్ యుద్ధ విమానాలు ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలం, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను సంధించే సత్తా కూడా వీటి సొంతం. ఈస్థాయి టెక్నాలజీ ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్‌ ను మించిన లక్ష్యాలను కూడా ఇవి ఛేధించగలవు. రాడార్ వార్నింగ్ రిసీవర్లు, అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నల్స్ ను కూడా ఇవి పసిగట్టగలవు.

ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే ఏకంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం రఫేల్ సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలగడం రఫేల్ ప్రత్యేకత. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయిలీ హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్‌ప్లే, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి అత్యాధునిక వ్యవస్థలు రాఫెల్‌ సొంతం. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లోనే కాకుండా.. అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు.

తొమ్మిది టన్నుల బరువులను సైతం..

ఒకేసారి తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రఫేల్ కు ఉంది. నావికాదళానికి చెందిన 13 టన్నుల సామాగ్రిని మోయగలవు. సైడ్ విండర్, అపాచి, హర్పూర్, అలారం, పీజీఎం 100, మేజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేరుస్తాయి. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగల స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించేందుకు రఫేల్ లో ప్రత్యేక వ్యవస్థ ఉంది. నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధిస్తాయి.

రఫేల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు కాగా.. రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. రఫేల్ బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు.. అయితే 6.7 టన్నుల ఇంధనాన్ని మోయగలవు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan Birthday Special: నిజ జీవితంలో మానవతావాది.. రామ్ చరణ్

Ram Charan: తండ్రి నుంచి వారసత్వం మాత్రమే కాదు.. రాజసం కూడా పుణికిపుచ్చుకుంటే ఆ కొడుకును చూసి తండ్రి మురిసిపోతాడు. కుటుంబ పేరు ప్రతిష్టలను కూడా...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ...

Ram Charan Birthday Special: కథల ఎంపికలో రామ్ చరణ్ స్పెషాలిటీ...

Ram Charan: మెగా ఫ్యామిలీ హీరోలకు మాస్ ఇమేజ్ ఓ వరం. దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి సాధించిన క్రేజ్ అది. తనదైన శైలి నటన, డైలాగులు,...

Kamal Haasan: ‘కల్కి’లో తన పాత్ర రివీల్ చేసిన కమల్ హాసన్

Kamal Haasan: అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో...

రాజకీయం

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

రఘురామ కృష్ణరాజుకి ఎందుకిలా జరిగింది చెప్మా.?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకి షాక్ తగిలింది. కొద్ది రోజుల క్రితమే ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల ముందర చేసిన రాజీనామా కావడంతో, అది ఆమోదం పొందలేదు. చాలాకాలంగా...

ఎన్నికల బరిలో కంగనా రనౌత్.. పోటీ అక్కడ నుంచే

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్( Kangana Ranaut) భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేయనున్నారు. ఆ పార్టీ ఈరోజు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత: పిఠాపురం ఎవరిది.?

పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు పోటీగా,...

ఇన్‌స్టా రికార్డుల్లో కూడా తగ్గేదేలే.. అంటున్న ఐకాన్‌స్టార్

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఆయ‌నకున్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. పుష్ప చిత్రంతో అంత‌ర్జాతీయంగా అభిమానుల‌ను సంపాందించుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ రోజు రోజుకు త‌న పాపులారిటీని పెంచుకుంటూనే పోతున్నాడు. ప్ర‌తి...

‘ఓం భీమ్ బుష్’ ఆడియన్స్ ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో శ్రీవిష్ణు

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, 'హుషారు' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ 'ఓం భీమ్ బుష్' తో ప్రేక్షకులని ఆలరించబోతున్నారు. వి సెల్యులాయిడ్,...

Ram Charan: రామ్ చరణ్-సుకుమార్ కాంబో.. RC17 ప్రకటన వచ్చేసింది..

Ram Charan: యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాకుండా మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  భారీ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ చరణ్ (Ram Charan) – క్రియేటివ్...

Taapsee: తాప్సీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా..!? న్యూస్ వైరల్

Taapsee: హీరోయిన్ తాప్సీ (Taapsee) పెళ్లి చేసుకుందా..? అంటే తాప్సీ ఫ్రెండ్, నిర్మాత కనిక చేసిన ఇన్ స్టా పోస్ట్ ఔననే సమాధానమే ఇస్తోంది. కొన్ని ఫొటోలు పోస్ట్ చేసిన ఆమె.. ‘నా...