Switch to English

ఆ ఐదు కళ్లూ చైనా పైనే..

ప్రపంచానికి పీడలా పరిణమించిన కరోనా వైరస్ పుట్టడానికి చైనాయే కారణమంటూ వస్తున్న ఆరోపణలకు తగిన ఆధారాలు వెలుగు చూశాయి. కరోనా విషయంలో ఆది నుంచి చైనా ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించిందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా డ్రాగన్ దేశానికే వంత పాడిందని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. తాను ఆధారాలు చూసిన తర్వాతే ఇది చెబుతున్నానని పేర్కొన్నారు. కానీ ఆ ఆధారాలు ఏమిటనేది బయటపెట్టలేదు. తాజాగా అవేమిటి అనేది బయటకు పొక్కింది.

ఓ అంతర్జాతీయ పత్రికలో ఇందుకు సంబంధించిన కథనం ప్రచురితమైంది. ఫైవ్ ఐస్ (ఐదు కళ్లు) ఉన్న అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల కూటమి రహస్య నివేదికలో దీనికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు చైనాదే తప్పని చెబుతున్నాయి.

గతేడాది డిసెంబర్ తొలి రోజుల్లోనే చైనాలోని వూహాన్ లో కరోనా కేసులు మొదలయ్యాయని, కానీ ఆ విషయాన్ని చైనా కొన్ని రోజులపాటు దాచిపెట్టిందని ఆ నివేదికలో ఉంది. వూహాన్ లోని సీ మార్కెట్ నుంచి వైరస్ ప్రబలిందంటూ చైనా చెప్పిన విషయం పచ్చి అబద్ధమని, అది వూహాన్ లోని పీ4 వైరాలజీ ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందని పేర్కొన్నారు. వెంటనే ల్యాబ్ అధికారులు వైరస్ నమూనాలను నాశనం చేశారని, ఆ తర్వాత పేషెంట్ జీరోగా భావిస్తున్న ల్యాబ్ పరిశోధకురాలు హువాన్ యాంగ్ లింగ్ కనిపించడంలేదని గుర్తుచేశారు.

వైరస్ ప్రమాదం గుర్తించిన వైద్యులపై చైనా ఉక్కుపాదం మోపింది. దీని గురించి మొదటగా మాట్లాడిన వైద్యుడు లీ వెన్ లియాండ్ ఆ మహమ్మారే సోకి ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత చైనా ప్రభుత్వం ఆయనకు అధికారికంగా క్షమాపణ చెప్పింది. జనవరిలో వైరస్ విజృంభించినా.. చైనా ఆ విషయాన్ని దాచిపెట్టింది. అంతా అదుపులోనే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొంది. పైగా మనిషి నుంచి మనిషికి ఆ వైరస్ సోకదని ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించింది.

జనవరి 23న వూహాన్ లాక్ డౌన్ విధించిన చైనా.. ప్రపంచ దేశాలను ఆ పని చేయకుండా నిరోధించింది. ట్రావెల్ ఆంక్షలు విధిస్తామన్న అమెరికాపై విమర్శలు చేసింది. దీంతో ఫిబ్రవరి, మార్చిలో కూడా చాలాదేశాలు తమ విమానాలను నడిపించాయి. అదే పెను విపత్తుకు దారి తీసింది. చైనా నుంచి వివిధ దేశాలకు ప్రయాణించిన వారి ద్వారా ఈ మహమ్మారి ప్రపంచం మొత్తం పాకేసింది. దీంతో ఇందుకు చైనాయే కారణమని పలు దేశాలు మండిపడుతున్నాయి. తాజాగా 5 ఐస్ నివేదిక బయటకు రావడంతో దీనిపై మరింత దుమారం రేగుతోంది.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: భార్యను చంపేందుకు ఆ భర్త చేసిన ప్లాన్‌కు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే

రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్న సూరజ్‌కు అప్పుడే భార్య అంటే విరక్తి పుట్టింది. మరో పెళ్లి చేసుకుంటే కట్నం వస్తుందని భావించిన సూరజ్‌ ఆమెను చంపేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. అద్బుతమైన...

క్రైమ్ న్యూస్: గొర్రెకుంట మృత్యుబావి మిస్టరీలో మరో ట్విస్ట్.!

ఈ రోజు ఉదయమే వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల మర్డర్ కి కారణమైన సంజయ్ కుమార్ యాదవ్ నిజానిజాలు ఒప్పుకోవడంతో ఈ మృత్యుబావి మిస్టరీ...

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

ఏపీలో కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలా.? సమంజసమేనా.!

కరోనా వైరస్‌.. ఎవరూ ఊహించని విపత్తు. ప్రపంచమే విలవిల్లాడుతోంది కరోనా వైరస్‌తో. అద్దె కోసం ఇళ్ళ యజమానులు, కిరాయిదారులపై ఒత్తిడి చేయవద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. అంతేనా, ఉద్యోగుల్ని తొలగించవద్దంటూ ఆయా సంస్థల్ని...