Switch to English

ఏపీ అసెంబ్లీలో తొలి వేటు పడింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీపై తొలి వేటు పడింది. శాసనసభా వ్యవహారాలకు అడ్డు తగులుతున్నారనే కారణంతో ముగ్గురు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను ఇస్తాననే హామీ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరిన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడులను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ప్రకటించారు.

మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే వాడివేడి వాతావరణం నెలకొంది. సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. దీంతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందిస్తూ.. దీనికి సంబంధించి తాము ఎన్నికల మేనిఫెస్టోలో ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. ఈ దశలో సీఎం జగన్ జోక్యం చేసుకుని తాను ఎన్నికల సందర్భంగా మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించి, వివరణ ఇచ్చారు. 44

ఈ నేపథ్యంలో తమకు కూడా వీడియో ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని టీడీపీ సభ్యులు స్పీకర్ ను కోరారు. అందుకు ఆయన నిరాకరించడంతో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మంత్రి బుగ్గన కల్పించుకుని.. సభా కార్యకలాపాలకు అడ్డు తగులుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, రామానాయుడులను ఈ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించగా.. స్పీకర్ అందుకు ఆమోదం తెలిపారు.

సభ నుంచి సస్పెండ్ చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లిపోయారు. ఈ వ్యవహారంపై టీడీపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. ప్రజాపక్షాన పోరాడుతుంటే తమ గొంతు నొక్కేస్తున్నారంటూ సస్పెన్షన్ కు గురైన నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. సభను వాళ్ల సొంత సభలా నడుపుతున్నారని ధ్వజమెత్తారు.

ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో తొలిసారి సస్పెన్షన్ కి గురయ్యానని ఆవేదన వ్యక్తంచేశారు. మందబలం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం మంచిది కాదని హితవు పలికారు. దివంగత వైఎస్ కూడా తనను సస్పెండ్ చేయించలేదని, కానీ ఆయన తనయుడు జగన్ సస్పెండ్ చేయించారని విమర్శించారు.

కాగా, టీడీపీ ఎమ్మెల్యేలపై విధించి సస్పెన్షన్ ను ఎత్తివేయాలని కోరాలని టీడీపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. అచ్చెన్నాయుడు తన స్థానంలోనే కూర్చుని ఉన్నారని, అయినప్పటికీ ఆయన్ను సస్పెండ్ చేశారని విమర్శించింది. ఈ అంశంపై స్పీకర్ కు కలివాలని నిర్ణయం తీసుకుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Ram Charan : ‘మగధీర’తో రానున్న గేమ్‌ చేంజర్‌

Ram Charan : మెగా ఫ్యాన్స్ గత కొన్ని రోజులుగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామ్‌ చరణ్ బర్త్‌డే మరి కొన్ని గంటల్లో రాబోతుంది. మార్చి 27న మెగా ఫ్యాన్స్ కి...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

BJP: ‘ఆ హీరోకి ఫాలోయింగ్ ఎక్కువ.. సినిమాలు ఆపండి’ ఈసీకి బీజేపీ లేఖ

BJP: కర్ణాటక (Karnataka) లో రాజకీయం రసవత్తరంగా మారింది. 2019లో రాష్ట్రంలోని 28 పార్లమెంట్ స్థానాలకు 25 స్థానాలు గెలుచుకున్న బీజేపీ (BJP) మళ్లీ తన మ్యాజిక్ చూపాలని ప్రయత్నిస్తోంది. అయితే.. అధికారంలో...

Lokesh Kanagaraj: రొమాంటిక్ సాంగ్ లో లోకేశ్ కనగరాజ్.. వీడియో వైరల్

Lokesh Kanagaraj: ఖైదీ, విక్రమ్ సినిమాలతో టాప్ రేంజ్ కి వెళ్లిన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj). ప్రస్తుతం ఆయన నటుడిగా మారారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది. మే 9న...