జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కథ అందించిన ఫస్ట్ డే ఫస్ట్ షో చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ సినిమాకు చేసిన ప్రమోషన్స్ చాలా మందిని అట్ట్రాక్ట్ చేసాయి. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దామా.
కథ:
ఈ సినిమా కథ 2000లలో సెట్ చేయబడింది. శ్రీనివాస్ (శ్రీకాంత్ రెడ్డి) పవన్ కళ్యాణ్ కు భక్తుడు. తన కాలేజీలోనే చదివే సంచిత (సంచిత బసు)ను ఇష్టపడతాడు.
పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సంచిత, శ్రీనివాస్ ను ఎలాగైనా ఖుషి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, టికెట్స్ తీసుకురమ్మంటుంది.
మరి శ్రీనివాస్ ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్స్ కోసం ఎలాంటి తిప్పలు పడ్డాడు? ఇంతకీ టికెట్స్ సంపాదించాడా? తన గర్ల్ ఫ్రెండ్ కోరికను తీర్చగలిగాడా? అన్నది సినిమా కథ.
నటీనటులు:
శ్రీకాంత్ రెడ్డి, సంచిత బసు ఇద్దరికీ ఈ చిత్రం తొలి సినిమానే అయినా కూడా కాన్ఫిడెంట్ గా కనిపించారు. ఇద్దరూ కూడా తమ పరిధుల మేరకు బాగానే నటించారు. వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించాడు. ఫస్ట్ హాఫ్ వరకూ డీసెంట్ గా అనిపించే ఈ పాత్ర, సెకండ్ హాఫ్ లో బోర్ కొట్టిస్తుంది. దర్శకుల్లో ఒకరైన వంశీధర్ గౌడ్ ఒక చిన్న పాత్రలో మెరిశాడు. ఈ పాత్రకు రాసిన డైలాగ్స్ బాగున్నాయి.
జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ ఒక క్యామియో రోల్ చేసాడు. ఆ పాత్ర అనవసరం. తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. వాళ్ళు పర్వాలేదు. మిగిలిన వారు మాములే.
సాంకేతిక వర్గం:
అసలు ఇలాంటి కథను డీల్ చేయడానికి ఇద్దరు దర్శకులు ఎందుకా అనిపిస్తుంది. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పుట్టంచెట్టి… ఇద్దరూ కూడా సినిమాకు న్యాయం చేయలేకపోయారు. అసలు కథే సరిగ్గా లేనప్పుడు వాళ్ళు మాత్రం చేసేదేం ఉంది. అనుదీప్ అందించిన కథకు తలా తోకా లేదు. అలాగే డైలాగ్స్ కూడా వీక్ గా ఉన్నాయి.
ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు. అదిరిపోయే రేంజ్ లో ఏం లేదు కానీ.. ఓకే. ఇక ఎడిటింగ్ పరమ రొటీన్ గా సాగింది. రధన్ ఒక సాంగ్ లో తన పనితనాన్ని చూపించాడు. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్ర నిర్మాణ విలువలు ఓకే.
పాజిటివ్ పాయింట్స్:
- పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిఫరెన్స్
- నీ నవ్వే సాంగ్
- అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సీన్స్, డైలాగ్స్
నెగటివ్ పాయింట్స్:
- సరైన కథ లేకపోవడం
- సిల్లీ కామెడీ
- అన్ని వర్గాలకూ చేరువ కాలేని స్టోరీలైన్
చివరిగా:
ఈ చిత్రం కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చే వీలుంది. ఖుషి రిలీజ్ కు ముందు జరిగిన హంగామా, టికెట్ల కోసం పడిన పాట్లు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు నోస్టాల్జియా మూమెంట్స్ గా నిలుస్తాయి. మరోపక్క అటు కథ, కథనం ఇలా ఏ విషయంలోనూ ఈ సినిమా మెప్పించదు.
తెలుగు బులెటిన్ రేటింగ్: 1.5/5
707077 319181hi!,I like your writing so a lot! share we maintain up a correspondence extra approximately your post on AOL? I require a specialist on this space to solve my issue. Could be that is you! Seeking ahead to peer you. 972784