వైసీపీ హయాంలో తమపై సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మొన్న బోరుగడ్డ అనిల్ అరెస్ట్.. ఇప్పుడు శ్రీరెడ్డి తాను మారిపోయాను క్షమించండి అంటూ చెప్పడం.. దీని వెనకాల చాలా పెద్ద తతంగమే నడిచినట్టు తెలుస్తోంది. వాస్తవానికి వీరంతా కూడా గతంలో పవన్ కుటుంబ సభ్యులపై కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు. కానీ అప్పట్లో వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తెలిపారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మొన్న ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనితపై కాస్త సీరియస్ అయ్యారు. మీరు యాక్షన్ తీసుకోండి.. లేదంటే ఇలాంటి వాళ్లను చూసి అత్యాచారాలు చేసే వాళ్లు పెరుగుతారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచే సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారిపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో శ్రీరెడ్డి చేసిన కామెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్టు సమాచారం.
అంతే కాకుండా శ్రీరెడ్డికి అండగా ఉంటున్న వారిని.. ఆమె వీడియోల కింద సపోర్టుగా కామెంట్లు పెడుతూ, ఆమె వీడియోలను షేర్ చేస్తున్న వారిపై కూడా యాక్షన్ తీసుకుంటున్నారంట. దాంతో శ్రీరెడ్డి దెబ్బకు దిగొచ్చి తప్పై పోయింది క్షమించండి.. ఇక నుంచి మారుతాను అంటూ వీడియో రిలీజ్ చేసింది. అంటే పవన్ అక్కడ సీరియస్ అయితే.. ఇక్కడ శ్రీరెడ్డికి షాక్ తగిలిందన్నమాట.