బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో దాదాపు ఐదు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత ఆయన్ను డాక్టర్లు డిశ్చార్జి చేశారు. సైఫ్ కు మేజర్ ఆపరేషన్లు నిర్వహించిన డాక్టర్లు ఎలాంటి ప్రాణాపాయ ప్రమాదం లేదని ఇప్పటికే ప్రకటించారు. సైఫ్ పూర్తిగా కోలుకోవడానికి ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు వెల్లడించారు. గాయాలు మానడానికి కనీసం మూడు నెలలు సమయం పడుతుందన్నారు. ఈ నెల 16న సైఫ్ ఇంట్లో దొంగతనం కోసం ఓ దొంగ ప్రవేశించిన సంగతి తెలిసిందే. అతన్ని అడ్డుకోవడానికి సైఫ్ ప్రయత్నించగా ఇద్దరి మధ్య తోపులాట జరిగింది.
ఆ దుండగుడు తన వద్ద ఉన్న కత్తితో సైఫ్ మీద దాడి చేయగా చాలా చోట్ల గాయాలు అయ్యాయి. దాంతో ఆయన్ను లీలావతి ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. దాడి చేసిన వ్యక్తి బంగ్లాదేశ్ కు చెందిన మహ్మద్ షరీఫుల్ అని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో నిందితులుగా ఇంకొందరిని చేర్చే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు సైఫ్ అలీఖాన్ కుటుంబ సభ్యులు ఎవరూ దీని గురించి బయట మాట్లాడట్లేదు.
కానీ వారి వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. సైఫ్ ప్రస్తుతం కొన్ని సినిమాల్లో విలన్ రోల్స్ తో పాటు కీలక పాత్రలు పోషిస్తున్నాడు. గాయాలు కావడంతో అతను కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.