Switch to English

అమరావతి కోసం 100 రోజుల పోరాటం.. అద్వితీయం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

పెయిడ్‌ ఆర్టిస్టులన్నారు.. కూకట్‌పల్లి ఆంటీలన్నారు.. ఆడాళ్ళను ముందుపెట్టి, వెనక దాక్కుంటున్న ఆడింగి వెధవలన్నారు.. ఇంకా చాలా చాలా విమర్శలు చేశారు రాజకీయ నాయకులు. కానీ, రాజధాని లేని రాష్ట్రం కోసం ఆ రైతాంగం త్యాగం చేసింది. రైతుకి అవమానాలు కొత్త కాదు. ప్రకృతి, రైతుని వెక్కించడమూ కొత్త కాదు.

ప్రకృతి కన్నెర్రజేసినా, పాలకులు అవమానించినా.. రైతు వ్యవసాయం చేసేది, పది మందికీ తిండి పెట్టడానికి. పొలాల్లో పంట పండించి, పదిమందికి తిండి పెట్టడం వ్యవసాయం.. అంతకు మించిన సాయం రాజధాని కోసం భూముల్ని ఇవ్వడం. అది సాయం కాదు, అంతకు మించి.. అందుకే, దాన్ని ‘త్యాగం’ అంటున్నాం. దురదృష్టవశాత్తూ ప్రస్తుత పాలకులకి ఆ ‘త్యాగం’ కనిపించడంలేదు. దాని స్థానంలో చాలా చాలా కన్పిస్తున్నాయి. ఎందుకంటే, చూసే కళ్ళు అలాంటివి మరి.!

ఒక రోజు కాదు, పది రోజులు కాదు, పాతిక రోజులు కాదు.. ఏకంగా 100 రోజులపాటు అకుంరిత దీక్షతో అమరావతి రైతాంగం పోరాడుతోంది. మింగడానికి మెతుకుల్లేవుగానీ, మీసాలకు సంపెంగ నూనె.. అన్న చందాన ప్రభుత్వం, మూడు రాజధానుల కాన్సెప్ట్‌ని తెరపైకి తీసుకొస్తే, దానికి నిరసనగా రైతాంగం ఆందోళన చేపట్టింది. లారీలు విరిగాయి.. అయినా, రైతాంగం తట్టుకుంది. మహిళలనీ చూడకుండా, పోలీసులు చితక్కొట్టారు.. అయినా, అమరావతి రైతులు తట్టుకున్నారు. పోలీస్‌ ఉన్నతాధికారులు సైతం, తమ స్థాయిని మరిచి.. రైతుల ఒళ్ళు హానం చేశారంటే.. అమరావతి రైతుల మీద జరిగిన దాష్టీకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.

న్యాయస్థానం పలుమార్లు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. పోలీసులకు చీవాట్లు కూడా పెట్టింది. దాంతో, రైతుల మీద లారీÄపెత్తనం కాస్త తగ్గిన మాట వాస్తవం. ఇక, ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్‌’ కూడా, రాజధాని రైతుల పోరాటాన్ని ఆపలేకపోయింది. ఇళ్ళకే పరిమితమవ్వాల్సి వచ్చినా.. ఇళ్ళల్లోనే స్వచ్చందంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు అమరావతి రైతులు.

వీలు కుదిరిన ఆ కొద్ది సమయం, దీక్షా శిబిరాల్లో తగిన దూరం పాటిస్తూ.. ఆందోళన కొనసాగిస్తున్నారంటే.. వారి చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. రైతులు భూములు ఇచ్చింది ఎవరికోసం.? మొత్తం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల కోసం కాదా.? ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం కాదా.? మరి, ఆ రైతులకు బాసటగా నిలవాల్సిన బాధ్యత రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని గ్రామాల ప్రజలకూ లేదా.? అమరావతి రైతులు త్యాగం చేశారు.. మరి రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నారు.? ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సందర్భమిది.!

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్ పర్సనాలిటీ. నిత్యం సినిమాలతో బిజీ. పరిశ్రమ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...