Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తైన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. సినిమా ట్రైలర్ కట్ రెడీ అయిందని ఈనెల మూడో వారంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, రెండు పాటలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాకు ప్రమోషన్ విషయంలో టీమ్ వెనకబడిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.
జూన్ 4న విడుదల. ఇంకా 28 రోజులే మిగిలుంది విడుదలకు. కానీ.. టీమ్ ఇప్పటివరకూ ప్రమోషన్ విషయంలో స్పీడ్ పెంచినట్టు ఎక్కడా హడావిడి కనిపించడంలేదు. ‘పెద్ది’ వెహికల్ ను సుస్మిత లాంచ్ చేయడం, చిత్ర ప్రొడక్షన్ డిజైన్ అవినాశ్ కొల్లాతో ఇంటర్వ్యూ తప్పితే సినిమాను టీమ్ ఏమాత్రం హైప్ పెంచేలా ప్రమోట్ చేయలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్ పెంచండని సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ ను కోరుతూ ట్వీట్స్, పోస్ట్స్ చేస్తున్నారు. కంటెంట్ పై ఎంతోమంది హైప్ ఇచ్చారు. రిలీజ్ డేట్ ప్రకటించన సందర్భంలో కూడా సుకుమార్ సినిమా గురించి రామ్ చరణ్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. దానిని కంటిన్యూ చేసే హైప్ పెంచట్లేదనేది ఫ్యాన్స్ ఆవేదన.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘పెద్ది’ నేషనల్ వైడ్ రీచ్ పాటలతో వచ్చిందనేది నిజం. కానీ, రెండు పాటలు వచ్చి కొన్ని నెలలు గడిచిపోయాయి. జనాల్లో ఆసక్తి ఎంతుందనేది ఆలోచించాల్సిందే. పైగా.. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాను ఐపీఎల్ వంటి పీక్ సీజన్లో ప్రమోషన్ కోసం వినియోగించుకోలేదని కూడా ఫ్యాన్స్ ఆవేదన చెందుతున్నారు. తక్కువ సమయంలో సినిమా హైప్ రావాలంటే రామ్ చరణ్ రంగంలోకి దిగి చెన్నై, బెంగళూరు, కేరళం, ముంబై వంటి ప్రధాన కేంద్రాల్లో ప్రచారం చేస్తూ.. టీమ్ ఈవెంట్లు ప్లాన్ చేయాలి. ఈపాటికే ఇవన్నీ మొదలుపెట్టి టీమ్ రౌండ్స్ వేయాలి కానీ.. ఇంకా చప్పగా కేవలం కౌంట్ డౌన్ పోస్టర్స్ తో ఉపయోగంలేదనేది ఫ్యాన్స్ వాదన.
పెద్ది టీమ్ ఏం ప్లాన్ చేస్తుందో తెలీదు కానీ.. ఇదే వేరే కాంటెంపరరీ హీరో, టీమ్ ఈసరికే ప్రచారంలో వేగం పెంచేవారని అంటున్నారు. పుష్ప-2 విషయంలో ఏ ఒక్క అవకాశాన్ని మైత్రీ కానీ, హీరో అల్లు అర్జున్ కానీ వదులుకోలేదని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బీభత్సమైన హైప్ ను సోషల్ మీడియాలో పెంచుకుని ప్రచారాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్లగానే ఎంట్రీ అదిరిపోయిందని.. అవే భారీ కలెక్షన్లకు ఊపిరి పోశాయని అంటున్నారు. ఇలానే పాన్ ఇండియా సినిమాగా ఇప్పటికే క్రేజ్ ఉన్న ‘పెద్ది’కి ప్రచారం పెంచాలని.. ఇతర రాష్ట్రాల పెద్ద నగరాల్లో ఈవెంట్స్ ప్లాన్ చేయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఇదే జరిగితే సినిమాకు రీచ్ పెరిగి భారీ కలెక్షన్లు సాధ్యమని ఫ్యాన్స్ అంటున్నారు. మరి.. టీమ్ ఏంచేస్తుందో..?
