Switch to English

#AA20 అప్‌డేట్‌ ఇవ్వకుంటే ఊరుకునేలా లేరుగా

అల్లు అర్జున్‌ 20వ చిత్రం సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. రంగస్థలం చిత్రం తర్వాత రెండేళ్ల గ్యాప్‌ వచ్చిన నేపథ్యంలో చాలా కసిగా ఉన్న దర్శకుడు సుకుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రంగస్థలంను మించి ఉండేలా స్క్రిప్ట్‌ వర్క్‌ చేశాడు. మహేష్‌బాబు తన సినిమా కాదనడం వల్ల సుకుమార్‌కు ఏకంగా సంవత్సర కాలం వృదా అయ్యింది. ఆ కారణంగా కూడా సుకుమార్‌ కసితో రగిలి పోతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. మహేష్‌ కుళ్లుకునేలా బన్నీ 20వ చిత్రంను తీస్తానంటూ సుకుమార్‌ ప్రతిజ్ఞ చేశాడట.

ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ కొట్టిన బన్నీ కూడా చాలా ఫైర్‌ మీదున్నాడు. వీరిద్దరి జోరు చూస్తే మరో బ్లాక్‌ బస్టర్‌ ఇండస్ట్రీ హిట్‌ ఖాయం అని అంతా అనుకున్నారు. గత నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాల్సి ఉంది. కేరళలో షూటింగ్‌ కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో కరోనా మహమ్మారి కారణంగా మొత్తం అస్థవ్యస్తం అయ్యింది. షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభించేంది చెప్పలేని పరిస్థితి. ఈ సమయంలో బన్నీ బర్త్‌డే రాబోతుంది. ఈనె 8వ తారీకున రాబోతున్న బన్నీ బర్త్‌డే కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గత వారం రోజుల నుండే బన్నీ బర్త్‌డే రాబోతుంది అప్‌డేట్‌ ఇవ్వాల్సిందే అంటూ కొందరు విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విట్టర్‌ ఇంకా పలు సోషల్‌ మీడియా వేదికలపై బన్నీ బర్త్‌డేకు ఫస్ట్‌లుక్‌ను తీసుకు రావాల్సిందే అంటున్నారు. ఫస్ట్‌లుక్‌ సంగతి ఏమో కాని సినిమా టైటిల్‌ను మాత్రం దర్శకుడు సుకుమార్‌ అనౌన్స్‌ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. బన్నీ షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాలేదు. కనుక ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడం సాధ్యం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే కనీసం టైటిల్‌ను అనౌన్స్‌ చేసినా కూడా ఫ్యాన్స్‌ పండుగ చేసుకోవడం ఖాయం.

ఈ చిత్రం కోసం రెండు అక్షరాల టైటిల్‌ను సుకుమార్‌ రిజిస్ట్రర్‌ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. బన్నీ, సుకుమార్‌ల కాంబోలో ఆర్య ఇంకా ఆర్య 2 చిత్రాలు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే సెంటిమెంట్‌ ను రిపీట్‌ చేయాలనే ఉద్దేశ్యంతో రెండు అక్షరాల పేరును టైటిల్‌గా నిర్ణయించారట. సుకుమార్‌ మనసులో ఏముందో ఈనెల 7 లేదా 8న క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

సినిమా

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

రాజకీయం

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

గ్యాస్‌ లీకేజీ : ఆ రైతులను ఆదుకునేది ఎవరు?

విశాఖ గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన వారికి ప్రభుత్వం కోటి నష్టపరిహారంను ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక బాధితులకు సైతం ప్రభుత్వం అంతో ఇంతో సాయం చేసింది. అయితే గ్యాస్‌ లీకేజీ...

ఎక్కువ చదివినవి

క్రైమ్ న్యూస్: మృత్యుబావి మర్డర్ మిస్టరీ – స్లీపింగ్స్ పిల్స్ తో 9 హత్యలు.!

వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో బావిలో బయటపడిన 9 మృతదేహాల ఉదంతం గత కొద్ది రోజులుగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన ఈ మృతదేహాల పోస్ట్...

విశాఖ వాసుల్ని బెంబేలెత్తించిన దట్టమైన పొగలు

12 మంది ప్రాణాలు బలిగొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన మరవక ముందే మరో ఘటన విశాఖ ప్రజల్ని భయాందోళనలకు గురి చేసింది. కొద్దిసేపటి క్రితం విశాఖ, మల్కాపురంలోని HPCL రిఫైనరీ నుంచి దట్టమైన...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

టిబి స్పెషల్: రంజాన్ రోజు ముస్లిం సోదరుల ఇంట నోరూరించే టాప్ 10 ఫుడ్స్

రంజాన్ అనేది ముస్లిం సోదరులకు ఇదొక పర్వదినం.. వారి పండుగల్లో చాలా ప్రత్యేకమైనది.. నెల రోజుల ముందు నుంచే ఉపవాసం ఉంటూ, ప్రతి రోజూ నియమనిష్టలతో నమాజ్ చేస్తూ, ఎంతో పవిత్రంగా చేసుకునే...

క్రైమ్ న్యూస్: ప్రియుడిని చంపి తాను చావాలనుకుంది

గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుని సహజీవనం సాగిస్తున్న పవన్‌ కుమార్‌, నాగలక్ష్మి మద్య పెళ్లి వివాదంను రాజేసింది. కొన్ని రోజులుగా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేస్తుండటంతో పవన్‌ కుమార్‌ ఆమెకు దూరంగా ఉంటున్నాడు....