Switch to English

‘కరోనా’ టెన్షన్‌ నుంచి ‘మెగా’ రిలీఫ్‌.!

ఎటు చూసినా కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ విన్నా ఇదొక్కటి తప్ప, ఇంకో చర్చ లేదు. ఎందుకంటే, ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకి చిగురుటాకులా వణుకుతోంది. ప్రాణం కన్నా ఏదీ మిన్న కాదు కదా.! అందుకే, కరోనా గురించే ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. అయితే, ఈ మాటల్లో చాలా ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. అదే అసలు సమస్య. అక్కడ కరోనా వచ్చిందట కదా.. వాళ్ళు చనిపోయారట కదా.. వీడికి కరోనా వచ్చిందట కదా.. ఇలాంటి రూమర్స్‌ పెరిగిపోవడంతో జనంలో ఆందోళన పెరిగిపోతోంది. దాన్ని తొలగించేందుకు ప్రభుత్వాలు పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నాయి. ప్రసార మాధ్యమాలు ఈ విషయంలో తనవంతు బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తున్నాయి.

ఇదిలా వుంటే, కరోనా దెబ్బ నుంచి కాస్త మానసిక ఊరట కలిగించేలా మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలోకి వచ్చారు. దాంతో, ఆ హీరో ఈ హీరో అన్న తేడా లేకుండా.. అందరు హీరోల అభిమానులకీ, సగటు సినీ అభిమానులకీ బోల్డంత స్టఫ్‌ దొరుకుతోంది. చిరంజీవి తన ట్విట్టర్‌ పేజీలో ఇలా అన్నారట కదా.. అలా అన్నారట కదా.. అని అంతా చర్చించుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో ఈ హ్యాష్‌ట్యాగ్స్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నాయి.

అయితే, ఇక్కడ మెగాస్టార్‌ చిరంజీవి, దాదాపుగా తన ప్రతి ట్వీట్‌లోనూ కరోనా వైరస్‌ గురించిన ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సెలబ్రిటీలు చేస్తున్న ప్రచారం పట్ల అవగాహనా కార్యక్రమాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి. చిరంజీవి మాత్రమే కాదు, దాదాపుగా సెలబ్రిటీలంతా సోషల్‌ మీడియాని ఇప్పుడు అత్యంత సమర్థవంతంగా, బాద్యతాయుతంగా వినియోగిస్తుండడం గమనార్హం.

హీరోలు, హీరోయిన్లు.. ఇలా ప్రతి ఒక్కరూ, ప్రజల్లో కరోనా పట్ల అవగాహన పెంచుతూ ట్వీట్లేస్తున్నారు.. తమ తమ ఇళ్ళల్లో చేపడుతున్న ‘సెల్ప్‌ ఐసోలేషన్‌ – సెల్ప్‌ క్వారంటీన్‌’ అంశాల గురించీ తెలియజేస్తుండడం గమనార్హం.

ఇదిలా వుంటే, మెగా పవర్‌ స్టార్‌ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ‘వెయిటింగ్‌’ అంటూ ఓ ట్వీటేశారు. దానికి రాజమౌళి ‘సార్‌.. అదీ..’ అంటూ స్పందించడం గమనార్హం. ఇదంతా, చరణ్‌ బర్త్‌ డే గిఫ్ట్‌ గురించి. అది ఎన్టీఆర్‌ ఇవ్వబోయే గిఫ్ట్‌. దాన్ని చరణ్‌కి ఇవ్వకుండా రాజమౌళికి పంపించాడు ఎన్టీఆర్‌. ‘అదేంటీ, రాజమౌళికి పంపించావ్‌.. ఈ రోజు వస్తుందా.?’ అని చరణ్‌ పేర్కొనడం.. వెరసి.. ఇదో ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌లా మారింది.

సినిమా

కేజీఎఫ్‌ 2 గురించి రెండు బ్యాడ్‌ న్యూస్‌

కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ కేజీఎఫ్‌ కు ప్రస్తుతం సీక్వెల్‌గా కేజీఎఫ్‌ 2ను చిత్రీకరిస్తున్న విషయం తెల్సిందే. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న...

ఆచార్యలో చరణ్‌.. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన చిరు

చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో ఒక కీలక పాత్ర ఉంటుందని ఆ పాత్రను మహేష్‌ బాబు లేదా రామ్‌ చరణ్‌ చేయబోతున్నట్లుగా గత కొన్ని రోజులుగా ఏదో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీంకు 5 కోట్ల ఫైన్‌ వేసిన ఆలియా?

 టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్లాన్‌ వేస్తే దాన్ని అచ్చు గుద్దినట్లుగా పొల్లు పోకుంటా మొదటి నుండి చివరి వరకు ఎగ్జిక్యూట్‌ చేస్తాడనే విషయం అందరికి తెల్సిందే....

ఫ్యాన్స్‌లో గందరగోళం క్రియేట్‌ చేస్తున్న చరణ్‌

మెగా హీరో రామ్‌ చరణ్‌ ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్‌ పాత్రలో...

‘ఒరేయ్‌ బుజ్జిగా’ ఓటీటీ ప్రచారంపై నిర్మాత స్పందన

రాజ్‌ తరుణ్‌ హీరోగా మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా విజయ్‌ కుమార్‌ కొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఒరేయ్‌ బుజ్జిగా’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యి...

రాజకీయం

జనసేనాని హుందాతనం.. వైఎస్సార్సీపీ వెకిలితనం.!

కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమల్లో వుంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయి. అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది నిస్సిగ్గుగా....

కరోనాని చంపే జెల్ ని కనుగొన్న బాంబే ఐఐటి.!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలన్నీ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. కొంతమంది వాక్సిన్లు తయారీలో నిమగ్నమై ఉండగా.. మరికొంత మంది దీనిని నిరోధించే ఔషధం కనుగొనే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు. వాక్సిన్...

కరోనా ఎఫెక్ట్‌: ప్రపంచం చాలా చాలా మారిపోవాల్సిందే.!

‘ఇకపై ఏదీ ఇంతకు ముందులా వుండదు..’ ఇదీ నిపుణులు చెబుతున్న మాట కరోనా వైరస్‌ గురించి. ప్రపంచం చాలా మారాలి. చాలా చాలా మార్పులు చోటు చేసుకోవాలి. అయితే, అవన్నీ మనుషుల అలవాట్ల...

శానిటైజర్‌ డబ్బా మీదకెక్కిన పబ్లిసిటీ పైత్యం.!

ఆంధ్రప్రదేశ్‌లో అధికార పార్టీ పైత్యం రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాదేదీ పబ్లిసిటీకి అనర్హం అన్నట్లు.. స్మశానాలకీ, మరుగుదొడ్లకీ అధికార పార్టీ రంగులు పూసిన వైనం గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఇప్పుడు కరోనా వైరస్‌ని...

సోనియా ఐడియా.. మీడియాకు సంకటమే

కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి, కరోనాపై పోరుకు అవసరమైన నిధులు ఎలా తీసుకురావాలి అనే అంశంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన సూచనలు మీడియాకు సంకటంగా మారాయి....

ఎక్కువ చదివినవి

ఔను మాది గిరిజన కుటుంబమే

మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన ముద్దుగుమ్మ సాయి పల్లవి తెలుగులో ఫిదాతో అందరిని ఫిదా చేసింది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో కూడా వరుసగా సినిమా ఛాన్స్‌లు వస్తున్నా కూడా డబ్బుకు...

లాక్ డౌన్ లాభాల్లో ఇది మరో కోణం

లాక్ డౌన్.. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం మార్మోగుతున్న పదం. దీని గురించి చిన్నపిల్లాడి నుంచి పండు ముదుసలి వరకు, చదువురాని వ్యక్తి నుంచి ప్రొఫెషన్ వరకు అందరికీ తెలుసు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి లాక్...

‘కరోనా’ కక్కుర్తిలో చైనాకి సాటెవ్వరు.?

కరోనా తొలుత వెలుగు చూసింది చైనాలో. అందుకే దీన్ని కరోనా వైరస్‌ (కోవిడ్‌ 19) అనడం కంటే, చైనా వైరస్‌ అనడం సబబు అని ప్రపంచ దేశాలు అభిప్రాయపడుతున్నాయి. చైనాలో సుమారు 80...

పవన్‌కు తోడు దొంగ సరోజ?

పవన్‌ కళ్యాణ్‌ 26వ చిత్రం బాలీవుడ్‌ హిట్‌ మూవీ పింక్‌కు రీమేక్‌ అనే విషయం తెల్సిందే. ఆ రీమేక్‌ వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. ప్యాచ్‌ వర్క్‌ మినహా అంతా...

భయపెడ్తున్న ‘మళ్ళీ లాక్‌డౌన్‌’ పుకార్లు.!

ఏది నిజం.? ఏది అబద్ధం.? ఏమీ అర్థం కాని పరిస్థితి. ‘అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించండి.. పుకార్లను అస్సలేమాత్రం నమ్మొద్దు.. లాక్‌డౌన్‌ కొనసాగింపు ఆలోచనల్లేవు..’ అని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా...