“ఫ్యామిలీల ఫస్ట్ ఛాయిస్‌గా ‘తిమ్మరాజుపల్లి టీవీ’…”: కిరణ్ అబ్బవరం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

92,684FansLike
57,764FollowersFollow

గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా విడుదలైన తొలి రోజే మంచి స్పందన అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వి. మునిరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామా, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ప్రత్యేకంగా కనెక్ట్ అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది.

ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ, సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తోందని, చాలా చోట్ల హౌస్ ఫుల్ షోలు నమోదవుతున్నాయని తెలిపారు. డైరెక్టర్ వి. మునిరాజు మాట్లాడుతూ, బీ, సీ సెంటర్లతో పాటు విదేశాల్లోనూ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోందని, ప్రేక్షకులు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారని చెప్పారు.

హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ, కొత్త టీమ్ చేసిన ఈ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ లభించడం ఆనందంగా ఉందని తెలిపారు. డీవోపీ అక్షయ్ రామ్ పొదిశెట్టి కూడా సోషల్ మీడియాలో వస్తున్న పాజిటివ్ స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు. హీరో సాయి తేజ్ మాట్లాడుతూ, ప్రేక్షకులు ఇచ్చిన విజయానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, “మా సినిమాకు మీడియా, ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమా చూసి కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా సెకండాఫ్, క్లైమాక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త వాళ్లు చేసిన ఈ ప్రయత్నాన్ని అందరూ ఆదరించాలి. కుటుంబంతో కలిసి థియేటర్‌కు వెళ్లి ఈ సినిమాను తప్పక చూడండి” అని కోరారు.

సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. వంశీకాంత్ రేఖన సంగీతం అందించిన ఈ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో ముందుకు సాగుతోంది.

 

సినిమా

Pawan Kalyan: అభిమాని గురించి పవన్ భావోద్వేగ పోస్ట్..! బండ్ల గణేశ్...

Pawan Kalyan: తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా హనుమకొండకు చెందిన 17ఏళ్ల నిరంజన్ ను నేటి ఉదయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలుసుకున్న...

Pawan Kalyan: ‘పవన్ కల్యాణ్’ను కలవాలి..! బాలుడి కోరిక నెరవేర్చిన పవర్...

Pawan Kalyan: పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం వరంగల్ జిల్లా హనుమకొండ విచ్చేశారు. స్థానికంగా నివసించే పవన్ కల్యాణ్...

పర్సంటేజ్ సబ్ కమిటీ నుంచి సురేష్ బాబు, దిల్ రాజు తప్పుకోవాలి:...

తెలుగు సినీ పరిశ్రమలో థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలుపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు....

రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య దూరం పెరిగిందా? ఈ ఉదాహరణలే చర్చకు కారణం!

'RRR’ సమయంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ మధ్య ఉన్న స్నేహం, బాండింగ్, బ్రదర్‌హుడ్ గురించి ఇద్దరూ చాలా సందర్భాల్లో మాట్లాడారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అయితే రామ్...

ఒకే ఏడాదిలో రూ.300 కోట్ల మైలురాయి.. బాక్సాఫీస్ చరిత్రలో చిరంజీవి–రామ్ చరణ్...

బాక్సాఫీస్ చరిత్రలో కలెక్షన్ల గురించి మాట్లాడితే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేర్లు మరోసారి ప్రత్యేకంగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఒకే...

రాజకీయం

సాయికృష్ణ కేసులో సీఎం సీరియస్.. సీఐ సస్పెన్షన్‌కు ఆదేశం

సాయికృష్ణ అదృశ్యం ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. సింగపూర్ పర్యటన ముగించుకుని సచివాలయానికి చేరుకున్న వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం...

మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి పశ్చాత్తాపమెందుకు కలగలేదు.?

రాజకీయ నాయకులన్నాక దిగజారిపోవాలా .. దిగజారుడు మాటలే మాట్లాడాలా ..   ఏమో, అంతేనేమో.! చెల్లెలు వైఎస్ షర్మిల కట్టుకున్న చీర రంగు మీద వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో చేసిన  వ్యాఖ్యల్ని...

సీఎం ఇచ్చిన మాట.. సత్యనారాయణ ఇంటి కలకు శ్రీకారం

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కామధేనువులంక గ్రామానికి చెందిన సత్యనారాయణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలు దిశగా అడుగులు పడ్డాయి. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సాధారణ...

భద్రకాళి అమ్మవారి ఆలయంలో నిరంజన్ కోసం పవన్ ప్రత్యేక పూజలు

అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అభిమాని ఆరోగ్యం...

మంగళగిరిలో అభివృద్ధి వేగం.. ఒకేరోజు నాలుగు కీలక ప్రాజెక్టులకు లోకేష్ శ్రీకారం

మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగం పుంజుకున్నాయి. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఒకేరోజు నాలుగు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కేంద్ర సహాయ మంత్రి...

ఎక్కువ చదివినవి

నిరంజన్ ధైర్యం నన్ను కదిలించింది: పవన్ కళ్యాణ్

అరుదైన వ్యాధితో పోరాడుతున్న హనుమకొండ యువకుడు నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నిరంజన్ తనను కలవాలనే ఆకాంక్షను వ్యక్తం చేసిన వీడియోను...

”వంద ఇస్తామని పిలిచారు.. వచ్చాం”: చావుల వద్ద కూడా తరలింపా?!

రాజకీయాలు చాలా ఖరీదైపోయాయి. వంద నుంచి రెండు వేల రూపాయల దాకా ఒక్కో మనిషి మీదా ఖర్చు చేస్తే తప్ప, రాజకీయాలు చేయలేని దుస్థితి. ఇంకెవరూ రాజకీయం చేయడం లేదా.? వైఎస్ జగన్...

విధ్వంస పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడారు: సీఎం చంద్రబాబు

తిరుపతిలో నిర్వహించిన కూటమి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా మాట్లాడారు. తన రాజకీయ ప్రయాణం తిరుపతిలోనే ప్రారంభమైందని, ఇదే రోజున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయ్యాయని...

కూటమి విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లండి.. టీడీపీ కేడర్‌కు లోకేష్ పిలుపు

అమరావతి: గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమ విజయాలను ప్రజలకు చేరవేయడం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త బాధ్యత అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పేర్కొన్నారు. ఈనెల...

నాగబంధం కోసం రథయాత్ర.. సంస్కృతిని తదుపరి తరాలకు చేరవేసే ప్రయత్నమన్న అభిషేక్ నామా

ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న వేళ చిత్రబృందం వినూత్న ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న...