ఫేక్ ప్రచారాలకి కట్టడి ఎలా.? కూటమి ప్రభుత్వం అంతర్మధనం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,072FansLike
57,764FollowersFollow

ఏదన్నా ఓ మంచి పని చేయాలన్న ప్రయత్నం మొదలయ్యేటప్పటికే, దుష్ప్రచారం అంతకన్నా ముందే విపరీతమైన స్థాయిలో జరిగిపోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో చాలా చాలా చిత్రమైన పరిస్థితి ఇది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, వైసీపీ నుంచి జరుగుతున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు.

అనునిత్యం, వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలకి కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికే ప్రభుత్వం నడుపుతున్న కూటమి పార్టీలు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందా.? అంటే, ఔననే చెప్పాల్సి వస్తుందేమో. రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఇక్కడ కనిపిస్తున్నది విద్వేషం.

గతంలో, నారాసుర రక్తచరిత్ర.. అంటూ, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుని చంద్రబాబుపైకి తోసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. అధికారంలోకి వచ్చాక, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై ‘కమ్మరావతి’ అంటూ వైసీపీ చేసిన దుష్ప్రచారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

వైసీపీ అంటేనే అదొక రాజకీయ పార్టీ కాదు, ఫేక్ ఫ్యాక్టరీ.. అనే వాదనకి రోజు రోజుకీ మరింత బలం చేకూరుతోంది. తిరుపతి లడ్డూ కల్తీ విషయమై వివిధ నివేదికలు చెబుతున్న విషయాల్ని తప్పుదోవ పట్టించేలా, అత్యంత నీఛమైన రీతిలో ఫేక్ ప్రచారం చేస్తోంది వైసీపీ.

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వ్యవహారంపై జరుగుతున్న ఫేక్ ప్రచారం ఇంకో లెవల్ అంతే. డీప్ ఫేక్ ద్వారా, వీడియోల్ని తమక్కావాల్సిన విధంగా మార్ఫింగ్ చేసి, పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతోంది వైసీపీ. ఇంత జరుగుతున్నా, ఈ ఫేక్ ప్రచారాలపై కూటమి ప్రభుత్వం ఎందుకు కఠిన చర్యలకు దిగలేకపోతోందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది.

కేసులు నమోదవుతున్నాయి, కొన్ని ఘటనల్లో అరెస్టులూ జరుగుతున్నాయి. అయితే, చట్టాల్లోని లొసుగులను వాడుకుంటూ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు సులువుగానే తప్పించుకుంటున్నారు ఆయా కేసుల్లో. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం చేష్టలుడిగి చూడటం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి.

మరోపక్క, వైసీపీ దుష్ప్రచారమైతే విచ్చలవిడిగా కొనసాగుతూనే వుంది. ప్రధానంగా తిరుమల చుట్టూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, అందర్నీ విస్మయానికి గురిచేస్తుంది. క్యూ లైన్లలో ఓ మహిళకు పాముకాటు.. అంటూ దుష్ప్రచారం చేయడం.. దాంతో ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది.

రెండేళ్ళలోనే కూటమి ప్రభుత్వానికి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందన్నది నిర్వివాదాంశం. ఆలస్యం, అమృతం విషం. కేంద్రం, ఇంటర్నెట్ వేదికగా పో..ర్న్.. వీడియోలపై ఉక్కుపాదం మోపినట్లే, సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలపైనా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనేమో.!

సినిమా

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి....

“మంగ్లీ కేసు ట్విస్ట్… ఆరోపణలకు కౌంటర్ స్టేట్‌మెంట్!”

హైదరాబాద్‌లో ప్రముఖ గాయని Mangli చుట్టూ కొనసాగుతున్న వివాదం మరింత ఆసక్తికరంగా మారుతోంది. ఆమె Panjagutta Police Station ను ఆశ్రయించి సింగపోగు సుబ్బు అనే...

Stand-up Comedian Anudeep: అనుదీప్ క్షమాపణలు.. శాంతించని అభిమానులు

Stand-up Comedian Anudeep: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, హీరో పవన్ కల్యాణ్‌, రామ్ చరణ్, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నిహారికలపై స్టాండప్ కమెడియన్...

Stand-up comedy: పవన్-బాలకృష్ణ-రామ్ చరణ్-ఎన్టీఆర్-నిహారిక.. నవ్వు పేరుతో బాధితులే

Stand-up comedy: మనసుకి ఉల్లాసాన్నిచ్చేది హాస్యం కానీ, మనసుల్ని కించపరిచేది కాదు. మనుషుల్ని నవ్వించేది హాస్యం కానీ, మనుషుల్ని బాధించేది హాస్యం కాదు. నీ వ్యక్తిత్వం...

“10 రోజుల్లోనే 10 మిలియన్ వ్యూస్”: ‘గురుతుందా..’ సాంగ్ సెన్సేషన్

యువ హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా తెరకెక్కుతున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే బిజినెస్ పరంగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది....

రాజకీయం

“రక్త చరిత్రే రాజకీయం..!” వైసీపీపై నిమ్మల తీవ్ర ఆరోపణలు

ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. రక్త చరిత్రనే రాజకీయం గా మార్చుకుని వైసీపీ ముందుకు సాగుతోందని ఆయన ఆరోపించారు. ప్రత్యేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై మండిపడ్డ...

రోడ్డు కట్‌పై రచ్చ… నాణ్యతా పరీక్షలే అంటూ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ

రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై జరుగుతున్న ప్రచారాలపై ఉప ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టత ఇచ్చింది. కొన్ని వర్గాలు, అనుకూల మీడియా సంస్థలు రోడ్లలో కనిపిస్తున్న కట్‌లను నిర్మాణ లోపాలుగా చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని...

“వైఎస్ మరణంపై అనుమానాలు ఇప్పుడు నిజమై కనిపిస్తున్నాయి”: అచ్చెన్నాయుడు

అమరావతిలో మంత్రి అచ్చెన్నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై గతంలో వ్యక్తమైన అనుమానాలు ఇప్పుడు నిజమనే భావన కలుగుతోందని ఆయన...

“ట్రెండ్ కాదు.. లక్ష్యమే ముఖ్యం”: యువతకు లోకేష్ సందేశం

బెంగళూరులో నిర్వహించిన గ్రీన్‌వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబీడీపీ గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి...

“జగన్‌లో గన్.. అవినాష్‌లో వినాశనం”: అనంతపురంలో షర్మిల ఘాటు వ్యాఖ్యలు

అనంతపురంలో నిర్వహించిన సభలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సిద్ధాంతం మొత్తానికి “నరకాలి, చంపాలి, నాశనం చేయాలి” అనే...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: సింహకు గౌరవం పెరుగుతుంది.. మీనకు శుభవార్తలు అందుతాయి

ఏప్రిల్ 10 , 2026 శుక్రవారం రాశిఫలాలు ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా సిద్ధం చేసిన రాశిఫలాలు మీ దినచర్య, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో మార్గదర్శకంగా...

Jananayagan: ‘జననాయగన్’ లీక్ కేసులో పురోగతి.. ఆరుగురి అరెస్ట్..

Jananayagan: తమిళ హీరో విజయ్ నటించిన జననాయగన్ సినిమా లీక్ అంశం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా దక్షిణాది చిత్రసీమను కలవరపరచిందనే చెప్పాలి. డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ కు...

నాగార్జున 100వ చిత్రం ‘లాటరీ కింగ్’.. దసరాకు గ్రాండ్ రిలీజ్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున తన 100వ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ఖరారైనట్టు సమాచారం. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉండగా,...

వృషభం ఆర్థిక జాగ్రత్తలు… ధనుస్సు కొత్త అవకాశాలకు శ్రీకారం

ఏప్రిల్ 7 , 2026 మంగళవారం రాశిఫలాలు మేషం (Aries): ఈరోజు మీ ఆలోచనలు వేగంగా పనిచేస్తాయి. పనుల్లో ముందడుగు వేయాలనే ఉత్సాహం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓర్పు అవసరం. ఖర్చుల విషయంలో...

Allu Arjun: అల్లు అర్జున్.. ఇప్పుడు పేరు కాదు.. అదొక ‘బ్రాండ్’

Allu Arjun: సినీ పరిశ్రమలో హీరోల వారసులు చాలామందే ఉన్నారు. హీరోల కుమారులు కాకుండా పరిశ్రమలో నిర్మాత, దర్శకుల వారసులకూ కొదవలేదు. అటువంటి హీరోల్లో ఒకరు అల్లు అర్జున్. అగ్ర నిర్మాణ సంస్థగా...