తిరుమల తిరుపతి దేవస్థానంపై పనికట్టుకుని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇందులో నీలి కూలి మీడియా పాత్ర సుస్పష్టం. కొద్ది రోజుల క్రితం లడ్డూలో ‘బీడీ’ దర్శనమిచ్చిందంటూ తెలంగాణకి చెందిన భక్తులు ఆరోపణలు చేయడం, వైసీపీకి అలాగే బీఆర్ఎస్‌కి ఉమ్మడిగా భజన చేసే ఓ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
దాన్ని, వైసీపీ ‘కూలి’ మీడియా అంతా విచ్చలవిడిగా ప్రచారం చేయడం చూశాం. ఆ వెంటనే, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలోని ద్వజస్తంభానికి సంబంధించి అపశృతి.. అంటూ ఇంకో దుష్ప్రచారం తెరపైకొచ్చింది. దీన్ని కూడా సదరు నీలి, కూలి మీడియా సంస్థలే విచ్చలవిడిగా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడం చూశాం.
ఇది చాలదన్నట్టు తాజాగా, అన్న ప్రసాదంలో ‘జెర్రి’ వచ్చిందంటూ ఇంకో దుష్ప్రచారానికి ఇదే నీలి కూలి మీడియా తెరలేపింది. దాంతో, సదరు నీలి కూలి మీడియా సంస్థలపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పై మూడు సందర్భాల్లోనూ టీటీడీ, జరుగుతున్న దుష్ప్రచారాన్ని అధికారికంగానే తమ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఖండించడం గమనార్హం. ఖండించి ఊరుకుంటే సరిపోతుందా.? దుష్ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి కదా.? ఇదే విషయాన్ని భక్తులు ప్రస్తావిస్తున్నారు, టీటీడీని ప్రశ్నిస్తున్నారు.
ఓ వైపు లడ్డూ ప్రసాదానికి సంబంధించి వివాదం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో. నిత్యం టీటీడీ మీద బురద చల్లే ప్రయత్నాలు నీలి కూలి మీడియా నుంచి జరుగుతోంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.? టీటీడీ ఏం చేస్తున్నట్లు.?
ఇదంతా చూస్తోంటే, సనాతన ధర్మంపై నీలి కూలి మీడియా ఓ పద్ధతి ప్రకారం దాడి చేస్తోందన్న అనుమానాలు వెంకన్న భక్తుల నుంచి వ్యక్తమవుతున్నాయి
Have you evger cohsidered writing an ebook oor guest authoring oon othner websites?
I have a boog cenrered on thee sake information yoou discuss and wuld love tto have you shaare some
stories/information. I kmow mmy visitors woupd enjoy
ykur work. If you arre even remotely interested, feel free to ssnd me
aan email.