Switch to English

3 రాజధానులు.. వైఎస్‌ జగన్‌కి ‘ముప్పు’ తప్పదా.?

దేశంలో ఏ రాష్ట్రానికీ మూడు రాజధానులు లేవు. ఆ మాటకొస్తే, భారతదేశానికి ఢిల్లీ మాత్రమే ఏకైక రాజధాని. అలాంటిది, అతి చిన్న రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు ఎందుకు.? ఈ మాత్రం ఇంగితం లేకుండా పోయింది ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి.

‘మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి..’ అంటూ వైసీపీ నేతలు పైకి చెబుతున్నా, తెరవెనుకాల వ్యవహారం వేరేలా వుంది. నిజానికి వైసీపీలో చాలామందికి మూడు రాజధానుల ప్రతిపాదన నచ్చలేదు. ఈ విషయాన్ని ఇప్పుడిప్పుడే వైసీపీకి చెందిన నేతలు చెప్పుకొస్తున్నారు.

మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, మూడు రాజధానుల పట్ల తన అసంతృప్తిని ఓ సందర్భంలో వెల్లడించారు. తన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌, మూడు రాజధానులపై అసంతృప్తిని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికే తీసుకెళ్ళాడని వసంత నాగేశ్వరావు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. అయితే, తానిప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వున్నానని వసంత నాగేశ్వరరావు చెప్పడం గమనార్హం.

అమరావతిని శాసన రాజధానిగా మార్చుతూ, విశాఖకి అడ్మినిస్ట్రేటివ్‌ క్యాపిటల్‌ హోదాని ఇచ్చి, కర్నూలుని జ్యుడీషియల్‌ రాజధానిని చేయాలన్నది వైఎస్‌ జగన్‌ ఆలోచన. అయితే, వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆ మధ్య ‘అమరావతిలో శాసన సభ వుండాలా.? వద్దా.?’ అంటూ బెదిరింపులకు దిగిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవాలి.

పరిపాలన అంటే.. మరీ చులకనైపోయింది అధికార పక్షానికి. లేకపోతే, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేస్తోన్న ఎమ్మెల్యే రోజా, అమరావతి ప్రాంత ప్రజల్ని బ్లాక్‌మెయిల్‌ చేసేలా ‘శాసన సభ వుండలా.? వద్దా.?’ అని ప్రశ్నించడమేంటి.? ఇక్కడ ఒక్కటి మాత్రం నిజం. పార్టీలో ఎమ్మెల్యేల అభిప్రాయాలకి విలువ లేకుండా పోయింది. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని పార్టీ నేతలు తమకు ఇష్టం వున్నా లేకున్నా భరించాల్సిన దుస్థితి ఏర్పడింది.

అయితే, ఎక్కువకాలం ఇలా నేతల నోళ్ళను కట్టేయడం సాధ్యం కాదు ఏ రాజకీయ పార్టీకి అయినా. ఒక్కసారి, పార్టీ అధినేత పట్ల వ్యతిరేక గళం బయటకొస్తే.. ఇక, ఆ తర్వాత అదో ఉప్పెనగా మారి, అధికార పార్టీ కొంపు ముంచేయడం ఖాయం. ఆ రోజు ఎంతో దూరం లేదని ప్రతిపక్షం భావిస్తోంది. ప్రతిపక్షమే కాదు, వైసీపీలోనూ ఈ అభిప్రాయం వుందనే విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది అందరికీ.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఎన్.టి.ఆర్ కాకపోతే వెంకీ – నానిలకి ఫిక్స్ అంటున్న త్రివిక్రమ్.?

కరోనా అనేది లేకుండా ఉంటే, అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఇప్పటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఫినిష్ చేసుకొని త్రివిక్రమ్ సినిమా కోసం సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండి ఉంటారు....

బర్త్‌డే స్పెషల్‌: పడి లేచిన కెరటంలా దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్

తెలుగు సినిమా ఉన్నంత కాలం ఎప్పటికి గుర్తుండి పోయే నందమూరి తారక రామారావు వారసత్వంతో బాల నటుడిగానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్టీఆర్‌ చిన్న తనంలోనే రాముడిగా నటించి నిజంగా రాముడు ఇలాగే...

బ్రేకింగ్ న్యూస్: పాక్ లో కూలిన 107మంది ఉన్న విమానం.!

పాకిస్థాన్, లాహోర్ నుంచి 107 మందితో కరాచీకి బయల్దేరిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కి చెందిన A320 విమానం కరాచీ ఎయిర్ పోర్ట్ దగ్గర్లో కూలిపోయింది. మలిర్ లోని, మోడల్ కాలనీ...

కరోనా కష్ట కాలంలో వైసీపీ సంబరాలు సమంజసమా.?

కరోనా వైరస్‌ ముప్పు రోజురోజుకీ పెరుగుతోంది. ఈ తరుణంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ‘ఏడాది పాలన’ సంబరాలకు సమాయత్తమవుతోంది. ఈ నెల 23 నుంచి వారం రోజులపాటు సంబరాల కోసం అటు ప్రభుత్వం...

వలస కార్మికుల కోసం అల్లు అరవింద్ సైతం

ప్రస్తుతం దేశమంతా లాక్ డౌన్ పరిస్థితుల్లోనే ఉంది. ఇటువంటి విపత్కర పరిస్థితులకు వ్యవస్థలే నిస్తేజమైపోవడంతో ఎక్కువగా బలైపోయింది అసంఘటిత కార్మికులే. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి ఉపాధి కరువై పోయింది. దీంతో ఉన్నదేదో చేతబట్టి...