Switch to English

ఆప్ వైపు సీబీఐ మాజీ జేడీ చూపు?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,469FansLike
57,764FollowersFollow

ఉద్యోగాన్ని సైతం వదిలేసి రాజకీయాల్లో అడుగుపెట్టిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తదుపరి పయనం ఎటు? జనసేనకు రాజీనామా చేసిన ఆయన బీజేపీలో చేరతారా లేక ఆమ్ ఆద్మీ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనే అంశంపై చర్చ సాగుతోంది.

వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కేసుల దర్యాప్తుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన ఆయనకు టీడీపీ అనుకూల మీడియా ఎనలేని ప్రాధాన్యత ఇవ్వడంతో హీరో అయిపోయారు. ఏకంగా ఏపీలోని పలుచోట్ల ఆయనకు అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి. వీటన్నింటినీ చూసుకుని రాజకీయ ఆరంగేట్రం చేశారు. తొలుత టీడీపీ నుంచే బరిలోకి దిగుతారని అంతా భావించారు. కానీ ఆయన అనూహ్యంగా జనసేనను ఎంచుకున్నారు.

విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ వైసీపీ గాలిలో నిలువలేక ఓటమి చవిచూశారు. తర్వాత జరిగిన పరిణామాలతో జనసేనకు గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీ వీడటానికి చెప్పిన కారణం కూడా చాలా సిల్లీగా అనిపించింది. పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడం ఇష్టం లేకనే తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

ప్రస్తుతం ఏ పార్టీలోనూ చేరని లక్ష్మీనారాయణ.. బీజేపీ వైపు వెళతారనే ప్రచారం జరిగింది. దానికి తగినట్టుగానే ఆ పార్టీ లైన్ లో పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆప్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ఆప్.. దేశవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించే ప్రణాళిక రచిస్తోంది. ఇకపై దేశంలో జరిగే ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తాము పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో ఏపీలో లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆప్ ను బలోపేతం చేయాలని వారు భావిస్తున్నారని, ఆ దిశగా సంప్రదింపులు జరుపుతున్నామంటూ లీకులు వదులుతున్నారు. ఇందులో నిజానిజాలు పూర్తిగా తెలియలేదు. ఇందుకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

21 అసెంబ్లీ సీట్లు.! జనసేన ప్రస్తుత పరిస్థితి ఇదీ.!

మొత్తంగా 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది.! వీటిల్లో జనసేన ఎన్ని గెలవబోతోంది.? పోటీ చేస్తున్న రెండు లోక్ సభ నియోజకవర్గాల్లో జనసేన పార్టీ ఎంత బలంగా వుంది.? ఈ...

ఎక్కువ చదివినవి

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని (Naveen Yerneni) పేరు వెలుగులోకి వచ్చింది....

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

‘గులక రాయి’ ఘటనలో సమాచారమిస్తే రెండు లక్షల బహుమతి.!

ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ, రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరంలో జరిగిన దాడికి సంబంధించి సరైన సమాచారం ఇచ్చినవారికి ఈ...

‘గులక రాయి’పై పవన్ కళ్యాణ్ ట్వీట్: అక్షర సత్యం.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, విజయవాడ నగరం నడిబొడ్డున ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన ‘గులక రాయి’ ఘటనపై ఆసక్తికరమైన ట్వీట్ వేశారు. ఆసక్తికరమైన అనడం...