EVOL: సూర్య శ్రీనివాస్, శివ బొడ్డు రాజు, జెనిఫర్ ఇమ్మానుయేల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా EVOL. సినిమా చిత్ర బృందం హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ట్రైలర్ విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక-నిర్మాత రామ్ యోగి వెలగపూడి మాట్లాడుతూ..
‘కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సినిమాను తప్పక ఆదరిస్తున్నారు. కొత్తదనం ఉన్న సినిమా ఇది. LOVE ను తిప్పి రాస్తే వచ్చే EVOL రివర్స్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రేక్షకుల్లో బజ్ క్రియట్ చేసేందుకు కాకుండా కథ ప్రకారం నిర్ణయించిన టైటిల్ EVOL. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి స్పందన లభిస్తోంది’.
‘నక్షత్ర ఫిల్మ్ ల్యాబ్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ఇద్దరు స్నేహితుల మధ్య సాగే కథ. డిఫరెంట్ కథకు కమర్షియల్ అంశాలు జోడించి క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. ఆధ్యంతం ఉత్కంఠ రేకెత్తించే సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముంద’ని రామ్ యోగి అన్నారు