సేవ ముసుగులోనూ దోపిడీనే.. జగన్ మేనత్త నిర్వాకం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,098FansLike
57,764FollowersFollow

సేవ చేస్తామని చెప్పి రూ. కోట్ల విలువైన భూములను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆసుపత్రి కట్టి పేదలకు ఉచిత వైద్య సాయం అందిస్తామని నమ్మబలికి అక్కడ చర్చి మాత్రం కట్టించారు. ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రి ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే విచిత్రమైన కారణం చెబుతున్నారు అదేంటో తెలుసా.. అక్కడ హాస్పిటల్ కట్టడానికి మట్టి స్వభావం సరిగా లేదట. కానీ ఆగమేగాల మీద చర్చి మాత్రం కట్టేశారు.

సెయింట్ లూక్స్ మైనారిటీ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే సంస్థ విశాఖ కేంద్రంగా పనిచేస్తోంది. క్రిస్టియన్ కమ్యూనిటీ, బీసీ ఎస్సి, ఎస్టీ మహిళల సాధికారత కోసం నర్సింగ్ శిక్షణ ఇస్తామని అందుకు అవసరమైన స్థలం కేటాయించాలంటూ ఆ సంస్థ 2004లో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. ఆసుపత్రి నిర్మాణం, మౌలిక వసతులు, శిక్షణ తరగతులకు అనుగుణంగా భవనాలు నిర్మించాల్సి ఉన్నందున తక్కువ ధరకు భూమిని కేటాయించాలని, పేదల వైద్య అవసరాలు తీర్చేలా మిషనరీ ఆసుపత్రి నడిపి సమీప గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామంటూ ఆ సంస్థ అప్పట్లో ప్రభుత్వానికి నివేదించింది. 2006 లో ఆ సంస్థ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే 2009 ఫిబ్రవరి 20న స్థలం కేటాయిస్తూ అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2006 లో క్యాబినెట్ తిరస్కరించినప్పటికీ వైయస్ కుటుంబ సభ్యుల జోక్యం ఉండటంతో సెయింట్ లూక్స్ కి విలువైన భూమిని దారాదత్తం చేశారు.

ఆ మిషనరీ సంస్థకు 7.5 ఎకరాలు కేటాయించగా అందులో రోడ్డు విస్తరణ కు పోగా 6 ఎకరాలకు పైగా భూమి ఆ సంస్థ అధీనంలో ఉంది. ఇందులో కొంత భాగం నర్సింగ్ శిక్షణ కోసం మూడు రేకుల షెడ్డులు నిర్మించి మమ అనిపించేశారు. ఆ తర్వాత ఆగమేఘాల మీద ఓ చర్చిని నిర్మించారు. ఏపీ మాజీ సీఎం జగన్ మేనత్త వైయస్ విమల రెడ్డి అక్కడికి వచ్చి సందేశాలు ఇచ్చి వెళ్ళిపోతుంటారు. సాగర తీరానికి చేరువలో సముద్రానికి అభిముఖంగా స్థలం ఇవ్వాలని కోరడం, ఇప్పటికీ అక్కడ ఆసుపత్రి నిర్మించకపోవడంతో విలువైన భూమిని దక్కించుకోవాలని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ 300 కోట్లకు పై మాటే మరి ఆసుపత్రికి కట్టడానికి అనువుగా లేని స్థలంలో చర్చి ఎలా కట్టారో వైఎస్ విమలా రెడ్డికే తెలియాలి.

సినిమా

“గాయాల మచ్చలతోనే గ్లామర్… నభా నటేష్ న్యూ స్టిల్స్ వైరల్!”

తన అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన Nabha Natesh తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా, గతంలో ఎదుర్కొన్న...

Peddi: మరోసారి ‘పెద్ది’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్...

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల...

‘హుషారు 2’లో అశోక్ గల్లా… హైదరాబాద్‌లో షూటింగ్ జోరుగా

యువ హీరో Ashok Galla ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “హుషారు 2” ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారుతోంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా...

వాలీబాల్ ప్రాక్టీస్‌లో గాయం… వరుణ్ తేజ్‌కు శస్త్రచికిత్స

మెగా హీరో Varun Tej కాలికి గాయం అయినట్లు ప్రాధమిక సమాచారం నిన్న ముందుగానే వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని మొదటగా TeluguBulletin ప్రచురించగా, ఇప్పుడు...

న్యూ కమర్స్ ఎదురు చూపులు, కష్టాలు తెలియచెప్పిన.. తిమ్మరాజుపల్లి ప్రీ రిలీజ్...

కొత్త వాళ్ల ఆశలు, కష్టాలు, అవకాశాల కోసం పడే పోరాటం… ఇవన్నీ ఒక్క వేదికపై ప్రతిధ్వనించిన వేడుకగా “తిమ్మరాజుపల్లి టీవీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ నిలిచింది....

రాజకీయం

జనసేన స్పోక్స్‌పర్సన్స్‌కు స్పెషల్ ట్రైనింగ్… వర్క్‌షాప్ ముగింపు

విజయవాడలో రెండు రోజుల పాటు నిర్వహించిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి అధికార ప్రతినిధులు, ఔత్సాహిక నాయకులు పాల్గొని...

వైఎస్ జగన్ మకాం హైద్రాబాద్‌కి.! సూచించిన ‘పండితుడు’ ఎవరో.?

మొన్నీమధ్యనే ఓ పండితుడు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉత్తరాదికి చెందిన ఆ పండితుడ్ని, వైసీపీకి గతంలో ‘సలహాదారు’గా పని చేసిన ‘పీకే’ అలియాస్ ప్రశాంత్ కిషోర్...

“ఈ పదవి అదృష్టం కాదు… కృషి ఫలితం”: లోకేష్ వ్యాఖ్యలు

చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో Nara Lokesh కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి స్థానిక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన,...

“కార్యకర్త నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వరకు… లోకేష్ ప్రయాణం”

తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ప్రారంభమైన ప్రయాణం అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లగలదో నేటి పరిస్థితులు స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ ఉదాహరణగా నిలిచిన పేరు Nara Lokesh. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి...

పవన్‌పై వ్యాఖ్యలు… శంకర్ గౌడ్ తీవ్ర హెచ్చరిక

మంగళగిరిలో జరిగిన ఓ సభలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంపై...

ఎక్కువ చదివినవి

Ram Charan: “బాలీవుడ్‌లోకి రామ్ చరణ్..! భన్సాలీ ప్రొడక్షన్‌లో భారీ ప్లాన్..!”

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. భారీ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో రామ్ చరణ్...

“సీట్ ఎడ్జ్ సస్పెన్స్… ‘తిమ్మరాజుపల్లి టీవీ’పై దర్శకుడు మునిరాజు నమ్మకం”

హీరో Kiran Abbavaram న్యూ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ సుమైర స్టూడియోస్‌తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, ఈ సినిమాతో సాయి...

టీడీపీ కొత్త కమిటీలు: లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్… సీనియర్లకు గౌరవం, కొత్తవారికి ఛాన్స్

అమరావతిలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంది. పార్టీ పొలిట్ బ్యూరో, జాతీయ మరియు రాష్ట్ర కమిటీలను అధికారికంగా ప్రకటిస్తూ, కొత్త సమీకరణాలతో ముందుకు వెళ్లే సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో Nara...

తిరుపతిలో క్రీడా విప్లవం… ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించిన లోకేష్

తిరుపతిని స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వేగం పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh తిరుపతిలో పలు క్రీడా అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. గొల్లవానిగుంటలో...

అలీ బాలీవుడ్ ఎంట్రీ.. ‘దాదీ కి షాదీ’లో కీలక పాత్ర!

తెలుగు ప్రముఖ కమెడియన్ అలీ బాలీవుడ్‌లో ఆసక్తికర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కపిల్ శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న దాదీ కి షాదీ చిత్రంలో అలీ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రముఖ...