Switch to English

ఈటీవీ ప్రభాకర్ వారసుడి తెరంగేట్రం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,468FansLike
57,764FollowersFollow

బుల్లి తెర మెగాస్టార్‌ గా పేరు దక్కించుకున్న ప్రభాకర్‌ తనయుడు చంద్రహాస్‌ త్వరలో ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతున్నాడు. చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ‘ఇంట్రడ్యూసింగ్‌ చంద్రహాస్‌’ పేరుతో మీడియా సమావేశం ఏర్పాటు చేసి చంద్రహాస్ ని ప్రభాకర్‌ పరిచయం చేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌ మాట్లాడుతూ… నేను ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలం అయినా మీడియాతో ఇంటరాక్ట్‌ అవడం అరుదు. ఇప్పుడు ఈ ప్రెస్‌ మీట్‌ ఏర్పాటు చేయడానికి కారణం మా అబ్బాయి చంద్రహాస్‌ కూడా ఇండస్ట్రీని నమ్ముకుని నటననే ప్రొఫెషన్‌గా ఎంపిక చేసుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. తండ్రిగా వాడికి ఇష్టమైన దాన్ని ప్రోత్సహించడం నా ధర్మం కనుక ఇలా మీ ముందుకు వచ్చాను. హీరో కావాలనేది కేవలం చంద్రహాస్‌ కోరిక మాత్రమే.

ఓ రోజు నా దగ్గరకు వచ్చి నాకు కొంత డబ్బు ఇవ్వు డాడీ దాంతో నేను యూట్యూబ్‌లో కవర్‌ సాంగ్స్‌ చేసుకుంటాను అన్నాడు. అలా చేసిన ‘‘నాటు నాటు’’ అనే కవర్‌ సాంగ్‌ వీడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పేరుతో పాటు సినిమా హీరోగా కూడా రెండు అవకాశాలు వచ్చాయి. మా అబ్బాయి పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ఇంటరాక్ట్‌ అయితే బాగుంటుంది అనిపించింది… అందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. చంద్రహాస్‌ను నటనవైపు ఎక్కువగా ప్రోత్సహించింది వాళ్ల అమ్మ, నా భార్య మలయజ అన్నాడు.

మలయజ మాట్లాడుతూ… చంద్రహాస్‌ కూడా వాళ్ల నాన్నగారిలానే మంచి హార్డ్‌ వర్కర్‌. ఏదైనా అనుకుంటే చేసి తీరాల్సిందే అన్నట్టుగా ఉంటాడు. అలా పట్టుబట్టి ఈరోజు హీరోగా మారుతున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులకు ఇంతకు మించి ఆనందం ఏముంటుంది. మా చంద్రహాస్‌ నిర్మాతలకు ఎప్పుడూ ఎస్సెట్‌ కావాలి అని కోరుకుంటున్నాను. మా అబ్బాయిని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు.

చంద్రహాస్‌ మాట్లాడుతూ… ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి షూటింగ్ వాతావరణంలో పెరిగాను. అందుకే సినిమాపై ఆసక్తి పెరిగింది. హీరో అవ్వాలనేది నా డ్రీమ్‌. దీని కోసం నాన్నగారిని ఎంతగా విసిగించినా పని అవ్వలేదు. ఆయన నీకు ఇంకా అంత వయస్సు రాలేదు. కనీసం 25 సంవత్సరాలు అన్నా రావాలి అన్నారు. ‘‘నాటు నాటు’’ కవర్‌ సాంగ్‌ చూసి నాకు అవకాశం ఇచ్చారు మా దర్శక, నిర్మాతలు. మీ అందరి ఆశీర్వాదాలు తీసుకోవాలని ముందుగా మిమ్మల్ని కలిసేందుకు మీ ముందుకు వచ్చాం అన్నాడు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్...

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad...

Ritu Varma: నభా నటేశ్-ప్రియదర్శికి రీతూవర్మ క్లాస్.. ట్వీట్ వార్ వైరల్

Ritu Varma: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ‘డార్లింగ్’ సంబోధనపై మాటల యుద్ధం వైరల్ అయిన సంగతి తెలిసిందే....

Chiranjeevi: చిరంజీవితో రష్యన్ సినిమా ప్రతినిధుల భేటీ.. చర్చించిన అంశాలివే

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)తో రష్యా నుంచి వచ్చిన మాస్కో సాంస్కృతిక శాఖ ప్రతినిధులు సమావేశమయ్యారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని చిరంజీవి...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం...

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh)....

రాజకీయం

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

CM Jagan: సీఎం జగన్ ఎదుటే పవన్ కల్యాణ్ నినాదం.. జేజేలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) కి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానుల నుంచి నిరసన ఎదురైంది. సీఎం ఎదుటే...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

ఎక్కువ చదివినవి

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

రఘురామకృష్ణరాజు పంతం పట్టి మరీ సాధించుకున్నారుగానీ.!

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీని వీడి టీడీపీలో చేరి, టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. నర్సాపురం లోక్ సభ సీటుని బీజేపీ నుంచి ఆశించి...

Pushpa 2: ‘పుష్ప-2’పై బాలీవుడ్ దర్శకుడి కామెంట్స్..! నెట్టింట వైరల్

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప ది రూల్ (పుష్ప-2). (Pushpa 2) సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై దేశవ్యాప్తంగా భారీ...

Viral News: పేరెంట్స్ నిర్లక్ష్యం.. బైక్ ఫుట్ రెస్ట్ పై బాలుడిని నిలబెట్టి.. వీడియో వైరల్

Viral News: ప్రయాణంలో జాగ్రత్తలు, రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్స్, సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం, ఫుట్ బోర్డు ప్రయాణాల వద్దని నిత్యం అవగాహన కల్పిస్తూంటారు ట్రాఫిక్ పోలీసులు. కొందరు సూచనలు పాటిస్తే.. మరికొందరు నిర్లక్ష్యంగా...