తెలంగాణ సీఎం కు మోడీ భయం పట్టుకుందని.. ఆయన హైదరాబాద్ కు వచ్చిన సమయంలో ఎక్కడ తెలంగాణ ప్రజలు ఆయన వైపుకు మళ్లుతారో అంటూ భయం టీఆర్‌ఎస్ వారిని వెంటాడుతుంది. అందుకే పీఎం మోడీ హైదరాబాద్ కు వచ్చిన సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్లెక్సీల హడావుడి చేస్తున్నారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అంటున్నారు.
హైదరాబాద్ లో మోడీ ప్లెక్సీలు కనిపించకూడదు అనే ఉద్దేశ్యంతో కేసీఆర్ కుట్ర పన్నారు. మోడీ ప్లెక్సీలు లేకున్నా కూడా ఆయన దేశ ప్రజల గుండెల్లో ఉన్నారు. ప్రజల గుండెల్లో ఉన్న మోడీని ఏ ఒక్కరు ఆపలేరు అంటూ ఈటెల టీఆర్ఎస్ నాయకులకు కౌంటర్ ఇచ్చాడు. ఒక ఎస్సీ బిడ్డను రాష్ట్రపతిగా చేసిన ఘనత మోడీది… ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన ఘనత బీజేపీది అంటూ ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.