అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,218FansLike
57,764FollowersFollow

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్ బాబు సినిమాల వరుస వ్యాపార పరిణామాల్లో ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ‘దూకుడు’ సమయంలో 14 రీల్స్ కొంత మొత్తాన్ని ఫైనాన్స్ చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘1 నేనొక్కడినే’కు ఎరోస్ ఫైనాన్స్ చేసిందిగానీ, ఆ సినిమా భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. దీనివల్ల 14 రీల్స్.. ఎరోస్‌కు పెద్ద మొత్తం బాకీ పడింది.

ఈ పరిస్థితుల్లో ‘దూకుడు’ విజయంతో ఏర్పడిన క్రేజ్‌ను నమ్ముకుని రెండు సంస్థలు కలిసి ‘ఆగడు’ చిత్రాన్ని విడుదల చేశాయి. కానీ అదే ఏడాదిలో ఆ సినిమా కూడా భారీ నిరాశను మిగిల్చింది. ఆర్థిక ఒత్తిడి తీవ్రంగా పెరగడంతో 14 రీల్స్‌ను ఇబ్బందుల్లోంచి బయటపడేసేందుకు మహేష్ బాబు వ్యక్తిగతంగా ముందుకొచ్చి సహకరించారు. ఎరోస్‌కు ఇచ్చిన మాట ప్రకారం, ‘శ్రీమంతుడు’ చిత్రానికి డిస్ట్రిబ్యూషన్ హక్కులు వారికి ఇచ్చారు. ఆ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ, 14 రీల్స్ బాకీలు పూర్తిగా క్లియర్ చేయలేకపోయింది.

దీంతో 2015 నుంచి 2019 వరకూ బాకీ తీర్చేందుకు ప్రత్యేక ఒప్పందం కుదిరింది. ఎరోస్ నాలుగేళ్లు వేచి చూసినా, 14 రీల్స్ వాగ్దానం నెరవేర్చలేదు. ఫలితంగా 2019 జూలై నుంచి పెండింగ్ మొత్తంపై 14% వార్షిక వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ మొత్తం భారీగా పెరిగిపోయింది.

అంతలో ‘సర్కారు వారి పాట’‌ను ఆపే అవకాశం ఎరోస్‌కు లేకపోయింది, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్‌లో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంగా ఉండగా, మహేష్ ఇప్పటికే 2015లో వారిని సపోర్ట్ చేశారు.

ఇప్పుడు ‘అఖండ 2’ ఈ పెద్ద బాకీ మొత్తాన్ని రికవరీ చేసుకునే కీలక అవకాశంగా ఎరోస్ కు దొరికిందని పరిశ్రమ చర్చ. దాంతో ఎరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించి.. తమ బాకీ తీర్చే వరకూ అఖండ 2 .. విడుదల కాకుండా స్టే తెచ్చుకుంది..

ఈ మొత్తం వ్యవహారం మళ్లీ బయటకు రావడంతో టాలీవుడ్‌లో ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ మధ్య ఉన్న సంబంధాలపై చర్చలు మరింత వేడెక్కుతున్నాయి.

సినిమా

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

‘రావు బహదూర్’ విజయోత్సవం.. ప్రేక్షకుల ప్రేమకు సత్యదేవ్ కృతజ్ఞతలు

సత్యదేవ్, దీపా థామస్ జంటగా వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కిన 'రావు బహదూర్' చిత్రం ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. జూలై 3న విడుదలైన...

జూలై 9నే తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఐ, నోబడీ’.. పెయిడ్ ప్రీమియర్స్‌కు...

మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ ఈ నెల 9న మలయాళంలో విడుదల కానుండగా, జూలై 10న తెలుగు ప్రేక్షకుల...

రాజకీయం

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

శ్రీసిటీలో హ్యోసంగ్ యూనిట్‌కు లోకేష్ ఆహ్వానం

సౌత్ కొరియాలోని సియోల్ పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ PU ప్రెసిడెంట్ యోకోటా తకేషితో సమావేశమయ్యారు. హ్యోసంగ్...

ఏపీపై కొరియా స్టార్టప్‌లకు లోకేష్ ఆహ్వానం.. లక్ష ఉద్యోగాలే లక్ష్యం

దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో కొరియన్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై కీలక...

విశ్వనాథ ఆలయ మహోత్సవంలో ప్రేమ్ కుమార్ ప్రత్యేక పూజలు

హైదరాబాద్‌లోని వసంతనగర్ కాలనీలో ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారి ఆలయంలో నిర్వహించిన శివాలయం పునః ప్రతిష్ట మహోత్సవం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి...

ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో జనసేనలోకి కూకట్‌పల్లి యువత చేరిక

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీకి యువత నుంచి మద్దతు పెరుగుతున్నట్లు మరోసారి కనిపించింది. కేపీహెచ్‌బీ కాలనీ 5వ ఫేజ్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కూకట్‌పల్లి డివిజన్‌కు చెందిన పలువురు...

ఎక్కువ చదివినవి

Lenin: ‘లెనిన్’ ట్రైలర్ రిలీజ్..! అఖిల్ కష్టంపై నాగ చైతన్య స్పందన

Lenin: అక్కినేని ఇంటి మూడో తరం హీరోల్లో ఒకరు అఖిల్. అక్కినేని నాగార్జున వారసుడిగా ఇప్పటికే తెరంగేట్రం చేసిన అఖిల్ పలు సినిమాల్లో హీరోగా నటించారు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన హీరోగా...

Jailer 2: ‘జైలర్ 2’పై లేటెస్ట్ అప్డేట్..! రజినీకాంత్ సినిమాలో మరో స్టార్ హీరో

Jailer 2: తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న సినిమా ‘జైలర్ 2’. 2023లో విడుదలై సూపర్ హిట్టయిన ‘జైలర్’కు సీక్వెల్ గా తెరకెక్కుతోందీ మూవీ. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న...

తన వెంట నడిచిన వారిని మరిచిపోని లోకేష్.. యువగళం బృందంతో ఆప్యాయ కలయిక

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో తనతో కలిసి నడిచిన కార్యకర్తలను గుర్తుపట్టడమే కాకుండా, వారిని పేరుపేరునా పలకరించి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. దీంతో యువగళం...

వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. ధనుస్సు రాశికి కొత్త అవకాశాలు

జులై 1, 2026 బుధవారం రాశిఫలాలు చాంద్రమాన పంచాంగం ఆధారంగా జులై 1, 2026 బుధవారం నాటి రాశి ఫలాలను తెలుసుకోండి. ఈ రోజు గ్రహాల సంచారం వివిధ రాశులపై భిన్నమైన ప్రభావాన్ని చూపనుంది....

కోదాడలో గ్యాస్ పేలుడు కలకలం.. అప్రమత్తమైన పోలీసులు

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆదివారం గ్యాస్ పేలుడు సంభవించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. రంగా థియేటర్ సమీపంలోని సందులో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో ఆ ప్రాంత ప్రజలు...