Switch to English

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్–వైష్ణవి జంట నుంచి వింటర్ ట్రీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,204FansLike
57,764FollowersFollow

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.32కి ‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ అనే ఆకట్టుకునే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘బేబీ’ తరువాత మరొకసారి ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ‘90s’ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్ తొలిసారి దర్శకుడిగా రూపొందిస్తున్నారు. సోమవారం హైదరాబాద్ ఆర్కే సినీప్లెక్స్‌లో టైటిల్ గ్లింప్స్‌ను రంగరంగుల వేడుకగా విడుదల చేశారు.

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్–వైష్ణవి జంట నుంచి వింటర్ ట్రీట్

విడుదలైన గ్లింప్స్‌లో లండన్ బ్యాక్‌డ్రాప్‌లోని స్నాతకోత్సవ వాతావరణం ప్రత్యేకతను చాటింది. వైష్ణవి చైతన్య తనకు కావాల్సిన భర్త గురించి చెప్పే సందర్భంలో, గద్దర్‌ను గుర్తు చేసే లుక్‌లో ఆనంద్ దేవరకొండ కనిపించడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. “శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలా ఉన్న అబ్బాయి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోయిన్‌లాంటి అమ్మాయి ప్రేమ పడితే ఎలా ఉంటుంది?” అన్న డైలాగ్‌తో సినిమా ఎంత వైవిధ్యంగా, ఎంత వినోదంగా ఉండబోతుందో చూపించింది. ‘90s’ సిరీస్‌లో ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ‘ఆదిత్య’ పాత్ర ప్రయాణమే ఈ సినిమాలో కొనసాగుతుండటం కూడా ఆసక్తిని పెంచుతోంది.

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్: ఆనంద్–వైష్ణవి జంట నుంచి వింటర్ ట్రీట్

గ్లింప్స్ విడుదల సందర్భంగా ఆనంద్ దేవరకొండ ఈ చిత్రం తనకు చాలా దగ్గరైన కథ అని, విద్యార్థిగా ఉన్నప్పుడు తాను కూడా ఇలా తడబడుతూ మాట్లాడేదానని గుర్తుచేసుకున్నారు. లండన్‌లో జరిగే కథ అయినా, మన ఇంట్లో జరిగే కథలా ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని చెప్పారు. తెలుగులో పూర్తిస్థాయి రొమాంటిక్ కామెడీలు చాలా అరుదుగా వస్తున్న నేపథ్యంలో, ‘ఎపిక్’ ఆ లోటును నింపే చిత్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.

వైష్ణవి చైతన్య ఈ ప్రేమకథలో యువతను ఆకట్టుకునే భావాలు, అందమైన జ్ఞాపకాలు ఉంటాయని చెప్పారు. హీరో పాత్రతో అబ్బాయిలు, హీరోయిన్ పాత్రతో అమ్మాయిలు బలంగా కనెక్ట్ అవుతారని తెలిపారు. జీవితంలో మనం దాటి వచ్చిన చిన్న చిన్న భావోద్వేగాలను గుర్తుచేసేలా చిత్రమంతా ఉంటుంది అని అన్నారు.

దర్శకుడు ఆదిత్య హాసన్ మాట్లాడుతూ, నిజాయితీని మించిన శక్తి ఏదీ లేదని, ‘90s’లా ఈ చిత్రానికి కూడా అదే నిజాయితీ పునాది అని చెప్పారు. మధ్యతరగతి యువకుడి ప్రేమకథగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ తాము అనుభవించిన క్షణాలను గుర్తుచేసుకుంటారని నమ్మకం వ్యక్తం చేశారు.

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ, ఇది మొదటి భాగం మాత్రమే, దీనికి కొనసాగింపు కూడా ఉంటుందని తెలిపారు. ఆదిత్య చెప్పిన ఈ రొమాంటిక్ కామెడీ కథ మొదట విన్నప్పుడే సినిమా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మంచి భావాలతో, అందమైన భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ యువ ప్రేమ కథను హృదయానికి హత్తుకునేలా, నిజాయితీతో చూపించబోతున్న చిత్రం. అతి త్వరలో భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లు త్వరలోనే రానున్నాయి.

 

సినిమా

ప్రేక్షకుల ప్రేమే మా అసలైన విజయం: ‘అనగనగా ఒక రాజు’ థాంక్యూ...

సంక్రాంతి కానుకగా విడుదలై థియేటర్లలో నవ్వుల పండగ సృష్టించిన చిత్రం ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సాహంతో దూసుకుపోతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన...

మెగా 158లో చిరంజీవి సరసన ఐశ్వర్య రాయ్?

మెగాస్టార్ చిరంజీవి తాజా బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగా 158 సినిమాను పూర్తి...

సంక్రాంతికి ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్.. యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ప్రభాస్ నిమ్మల కొత్త...

సంక్రాంతి పండుగ కానుకగా దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మిరాకిల్’ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఈరోజు (జనవరి 16) అధికారికంగా విడుదల...

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు...

CHIRANJEEVI: చిరంజీవి క్రేజ్, రేంజ్ ఏంటో చూస్తున్న ‘Gen Z’

CHIRANJEEVI: ‘నువ్వేమైనా చిరంజీవి అనుకుంటున్నావా..., నువ్వో చిరంజీవి మరి.., చిరంజీవిలా ఆ ఫోజేంటేహే’.. ఇదీ 80, 90 దశకాల్లో చిరంజీవి హవా. చెప్పాలంటే రాజకీయాల్లోకి వెళ్లే...

రాజకీయం

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...

“స్వగ్రామం నుంచి స్వర్ణాంధ్ర దిశగా: సమసమాజమే లక్ష్యం”: చంద్రబాబు

నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ అభివృద్ధి దృక్పథం, పండుగల ప్రాధాన్యం, గ్రామీణ పునర్నిర్మాణం, ఆర్థిక అసమానతలపై తన ఆలోచనలను విస్తృతంగా వెల్లడించారు. గతంలో గ్రామాలకు వెళ్లడానికి...

నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు: కుటుంబంతో కలిసి పూజల్లో పాల్గొన్న నారా లోకేష్

మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని నారావారిపల్లెలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి గ్రామంలో ఏర్పాటైన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొని...

వాటర్‌ పాలిటిక్స్‌లో రాజకీయ ఆరోపణలు.. ఏపీపై ప్రభావం?

ఆంధ్రప్రదేశ్‌–తెలంగాణ రాజకీయాల్లో నీటి అంశం మరోసారి కేంద్రబిందువుగా మారింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య సన్నిహిత రాజకీయ అవగాహన ఉందన్న ఆరోపణలు మళ్లీ తెరపైకి...

పీపీపీపై కేంద్రం మరో లేఖ.. రాష్ట్ర వైద్య రంగానికి కీలక దిశానిర్దేశం

వైద్య సేవల డిమాండ్‌–లభ్యత మధ్య ఉన్న గ్యాప్‌ను పూరించేందుకు పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరోసారి స్పష్టమైన సూచనలు చేసింది. ఈ మేరకు...

ఎక్కువ చదివినవి

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

ఎన్టీవీ క్షమాపణతో వ్యవహారం ముగిసినట్టేనా?

ఎన్టీవీ ఛానల్ ఇటీవల ప్రసారం చేసిన ఒక వార్తా కథనం తీవ్ర దుమారం రేపింది. ఓ మంత్రి, ఐఏఎస్ అధికారులకు సంబంధించిన వివాహేతర బంధాలపై వ్యాఖ్యానించినట్టుగా వచ్చిన ఆ కథనం తీవ్ర అభ్యంతరాలకు...

అమరావతి విషయంలో కూటమి చేతికి ఆయుధాన్నిచ్చిన జగన్.!

ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకుడు అయినా, ఏ ప్రజా ప్రతినిథి అయినా.. తన రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తే, అలాంటివాళ్ళు రాజకీయాల్లో కొనసాగడానికి నైతిక అర్హతను కోల్పోతారు....

సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’

సంక్రాంతి పండుగ సీజన్‌లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తోంది. విడుదలైన కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.190...

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ సందడి: సాహిత్యానికి సత్కారం, క్రీడలకు ఉత్సాహం, చేనేతకు ప్రోత్సాహం

మంగళగిరి నియోజకవర్గంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శుక్రవారం వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ విస్తృతంగా సందడి చేశారు. సాహిత్య రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు, క్రీడలను ఉత్సాహపరిచి, స్థానిక వ్యాపారాలకు...