ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,313FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల నాయకులు రాష్ట్రస్థాయి నేతలుగా ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. మంగళగిరిలో జరిగిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల శిక్షణా తరగతుల భాగంగా నిర్వహించిన “కాఫీ కబుర్లు” కార్యక్రమంలో ఆయన పాల్గొని, పార్టీ బలోపేతంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ ఒక విశ్వవిద్యాలయంలాంటిదని, పార్టీ ఇచ్చిన అవకాశాలు, గుర్తింపు, గౌరవం అన్నీ గుర్తుంచుకుని నిబద్ధతతో పనిచేయాలని అన్నారు. గ్రామ, మండల స్థాయిల్లో పనిచేసిన ఎన్నో మంది నేటి రాష్ట్ర నాయకులుగా ఎదిగారని గుర్తుచేస్తూ, అందరూ అదే దారిలో ముందుకు సాగాలన్నారు.

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో తప్పకుండా భాగస్వామ్యం కావాలని లోకేష్ స్పష్టం చేశారు. చిన్న సమస్యలు సహజమని, అలకలు వద్దని, ఏ విషయం ఉన్నా సంబంధిత నాయకుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ప్రజలతో అనుబంధం పెంచుకోవడం అత్యంత ముఖ్యం అని, తమ ప్రాంత ప్రజలతో మమేకం అయితే మాత్రమే నిజమైన నాయకత్వం నిలుస్తుందని గుర్తు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన అణచివేతలను ప్రస్తావిస్తూ, టీడీపీ కార్యకర్తలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేశారు. సైకో పాలనతో పోరాడుతున్నామనే విషయాన్ని గుర్తుంచుకుని అందరూ ఒకే దారిలో కష్టపడాలన్నారు.

ప్రజల హృదయాలు గెలుచుకునేలా పనిచేయాలి: లోకేష్

ప్రతి నాయకుడు క్లస్టర్, యూనిట్, బూత్ ఇంఛార్జిలతో కలిసి పని చేసి సమస్యలను పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు. అహంకారం దూరంగా ఉంచి, ప్రజల మనస్సులు గెలుచుకునే విధంగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికీ స్పష్టంగా వివరించాలని, దేశంలో ఎక్కడా లేనంతగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. చేస్తోన్న పనిని గర్వంగా చెప్పాలని, ఓర్పు, సహనంతో ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు ‘మై టీడీపీ’ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయాలని సూచించారు.

లోకేష్ మాట్లాడుతూ, నాయకులు జీవితాంతం నేర్చుకోవాలనే తపన కలిగి ఉండాలి, కష్టపడి పనిచేశాకే నిజమైన ఫలితాలు వస్తాయని చెప్పారు. తాను పాదయాత్ర చేసి ప్రజల్లోకి వెళ్లడం వల్లే నేటి స్థాయికి చేరుకున్నానని, అదే మార్గంలో అందరూ కృషి చేయాలని సూచించారు. శిక్షణా తరగతుల తొలి రోజున రాష్ట్రవ్యాప్తంగా వంద మంది వరకు మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. పల్లా శ్రీనివాసరావు, మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రులు అమర్ నాథ్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యేలు అశోక్, శిరీషలతో పాటు పలువురు నాయకులు పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత నిర్మాణంపై నేతలకు అవగాహన కల్పించారు. అనంతరం మండల నాయకులు తమ అభిప్రాయాలను లోకేష్‌కి తెలుపగా, ఆయన కార్యక్రమం ముగింపులో ఆలోచనాత్మక సూచనలు చేశారు.

సినిమా

S. JANAKI: “గుడికే చేరిన దీపం.. పడమటి సంధ్యా రాగం”

 "కొండల్లో... కోనల్లో... కూ యన్న ఓ కోయిల..." ఆ పాటలో వినిపించిన ఆ కోయిల గాత్రం ఇక కొత్త పాటల్లో వినిపించకపోవచ్చు. కానీ ఆ స్వరం మాత్రం...

 శ్రీకాంత్‌తో రిలేషన్‌పై రీతూ క్లారిటీ.. ఎంత సాయం చేశాడంటే?

బిగ్‌బాస్ ఫేమ్ రీతూ చౌదరి గతంలో చీమకుర్తి శ్రీకాంత్‌తో తన రిలేషన్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వస్తున్నాయి. తమ ఇద్దరికీ...

‘మీ స్వరం ఎప్పటికీ అమరం’.. జానకికి చిరంజీవి భావోద్వేగ నివాళి

లెజెండరీ గాయని ఎస్. జానకి  మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి మరణవార్త తన హృదయాన్ని ఎంతో కలచివేసిందని పేర్కొంటూ,...

S.Janaki: చిత్రసీమలో విషాదం..! దిగ్గజ గాయని ఎస్.జానకి కన్నుమూత

S.Janaki: ప్రముఖ నేపథ్యగాయని ఎస్. జానకి కన్నుమూశారు. ఇటివల అనారోగ్యానికి గురైన ఆమె మైసూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమె...

‘అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాం’.. ‘ఓ.! సుకుమారి’పై నిర్మాత...

యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన గ్రామీణ కుటుంబ కథా చిత్రం 'ఓ.! సుకుమారి' జూలై 17న ప్రేక్షకుల ముందుకు...

రాజకీయం

తిరుమల మెట్ల మార్గంలో చిరుత కలకలం.. భక్తుల భద్రతపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుతపులి సంచారం నేపథ్యంలో భక్తుల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్...

నారా లోకేష్ సొంత నిధులతో కుట్టు మిషన్లు పంపిణీ

మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో నిర్వహిస్తున్న 'స్త్రీ శక్తి' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి స్థానికంగా మంచి ఆదరణ...

వియత్నాం బోటు ప్రమాదం.. వెంటనే రంగంలోకి దిగిన లోకేష్!

వియత్నాంలో జరిగిన ఘోర బోటు ప్రమాదం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పర్యాటకులు చిక్కుకున్నారన్న సమాచారం అందడంతో అత్యవసరంగా అధికారులతో మాట్లాడి పరిస్థితిపై పూర్తి...

“కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ స్వయంగా మాట్లాడతారు”.. తాళ్లూరి రామ్

జనసేన పార్టీ కార్మికులు, శ్రామికులు, ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ అన్నారు. జనసేన సభ్యత్వం పొందిన కార్మికులకు రూ.5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం...

సౌత్ కొరియాలో లోకేష్ సక్సెస్ టూర్.. 50కి పైగా కంపెనీలతో పెట్టుబడి చర్చలు

ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వారంరోజుల సౌత్ కొరియా పర్యటన విజయవంతంగా ముగిసింది. భారత్-దక్షిణ కొరియా సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే...

ఎక్కువ చదివినవి

రామోజీ ఫిల్మ్ సిటీలో రాజేష్ శర్మ ఆరోగ్యంపై గందరగోళం.. అసలు ఏం జరిగింది?

బాలీవుడ్, బెంగాలీ చిత్ర పరిశ్రమల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటుడు రాజేష్ శర్మ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో గందరగోళం నెలకొంది. తొలుత హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రభాస్ నటిస్తున్న సినిమా షూటింగ్...

ఏపీ షిప్‌బిల్డింగ్ రంగంలో పెట్టుబడులకు లోకేష్ ఆహ్వానం.. హెచ్‌డీ KOSEతో కీలక చర్చలు

దక్షిణ కొరియాలో పెట్టుబడుల ఆకర్షణ యాత్ర కొనసాగిస్తున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ షిప్‌బిల్డింగ్ సంస్థ HD Korea Shipbuilding & Offshore Engineering (HD...

డెలివరీ బాయ్ షాకింగ్ నిర్వాకం..! పార్సిల్‌తో పాటు ప్రమాదమూ వస్తుందా..?

 బెంగళూరులో చోటుచేసుకున్న ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. Flipkartకు చెందిన డెలివరీ బాయ్‌గా గుర్తించబడిన వ్యక్తి పార్సిల్ డెలివరీ కోసం ఓ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో...

నా వ్యక్తిత్వంపై దుష్ప్రచారం చేస్తే కోర్టులో సమాధానం చెప్పాల్సిందే: చిన్మయి హెచ్చరిక

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో తనపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన ఓ నెటిజన్‌కు ఘాటుగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్యం, సంతానోత్పత్తి వంటి అంశాలపై అసత్య ప్రచారం చేస్తూ...

Mega158: రెండో షెడ్యూల్లో చిరంజీవి-బాబీ సినిమా..! త్వరలో గుడ్ న్యూస్..

Mega158: మెగాస్టార్ చిరంజీవి హిరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #Mega158గా మే21వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆమధ్య తమిళనాడులోని...