Switch to English

బిగ్ స్టోరీ: ఈ ‘సినిమా’ కష్టాలు ప్రభుత్వాలకి అర్థమవుతాయా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

కరోనా వైరస్‌ నేపథ్యంలో సినిమా షూటింగులు ఎప్పుడో ఆగిపోయాయ్‌.. సినిమా థియేటర్లూ మూతబడ్డాయ్‌. లాక్‌డౌన్‌ సడలింపులతో సినీ పరిశ్రమకూ కొంత ఊరట కలుగుతుందని అంతా భావించారు. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. కానీ, షూటింగులకు అనుమతి లభించేదెప్పుడు.? థియేటర్లు తెరుచుకునేదెప్పుడు.?

తెలంగాణ ప్రభుత్వం ఒక్కటీ అనుమతిస్తే సరిపోదు.. కేంద్రం సినీ పరిశ్రమ పట్ల కాస్తంత సానుకూలంగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా థియేటర్లు తెరుచుకుంటేనే, వాట్‌ నెక్స్‌ట్‌ అన్నదానిపై సినీ పరిశ్రమకు ఓ అవగాహన వస్తుంది. కానీ, అది అప్పుడే జరిగేలా కన్పించడంలేదు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ వంటి పదాలు నిన్న మొన్నటిదాకా బాగానే వున్నా, సడలింపుల తర్వాత అది ఎంతవరకు దేశంలో సాధ్యమవుతుంది.? సినీ పరిశ్రమలో ఇదెంతవరకు పాటించదగ్గది.? అన్న విషయమై చాలా అనుమానాలున్నాయి.

ఓవర్సీస్‌ బిజినెస్‌ కూడా సినిమాకి అత్యంత కీలకం. జనం థియేటర్ల దగ్గరకి గుంపులు గుంపులుగా వస్తేనే నిర్మాతలకు వర్కవుట్‌ అవుతుంది. అంతే తప్ప, సోషల్‌ డిస్టెన్సింగ్‌ పాటించాలంటూ 1000 సీటింగ్‌ సామర్థ్యమున్న ది¸యేటర్‌లో 500 టిక్కెట్లకు అనుమతిస్తే ఎలా.? షూటింగ్‌ సందర్భంలోనూ ఫిజికల్‌ కాంటాక్ట్‌ వుంటుంది. దాన్నెలా నివారించగలం.? రొమాంటిక్‌ సీన్స్‌ ఎలా తీస్తారు.? రెయిన్‌ సాంగ్స్‌ ఎలా ప్లాన్‌ చేస్తారు.? యాక్షన్‌ ఎపిసోడ్స్‌ మాటేమిటి.? చెప్పుకుంటూ పోతే సినిమా కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

పోనీ, పరిస్థితి అదుపులోకి వచ్చినట్లే కాబట్టి సినిమాలు తీసేద్దామంటే.. రేప్పొద్దున్న మళ్ళీ పరిస్థితులు తేడాకొట్టవన్న గ్యారంటీ ఏంటి.? విడుదల డేట్‌ అనౌన్స్‌ చేసుకుని మరీ ఆగిపోయిన సినిమాల పరిస్థితి తలచుకుంటే, ఏ నిర్మాత అయినా ధైర్యంగా ముందడుగు వేసి కొత్త సినిమా తీయగలిగే పరిస్థితి కన్పిస్తుందా.? ఏదీ ఇదివరకటిలా వుండదన్నది నిర్వివాదాంశం. అది సినీ పరిశ్రమకూ వర్తిస్తుంది.

కానీ, సినిమా అంటే ఆ కిక్కు వేరు. థియేటర్లు కళకళ్ళాడాలి.. అలా జరగాలంటే ప్రేక్షకులు ధైర్యంగా సినిమాకి రావాలి. ఇది జరిగినప్పుడే నిర్మాత ధైర్యంగా సినిమా తీయగలడు. దానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే చెప్పలేం. ఈలోగా జస్ట్‌ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చేసుకోండి, ఆ తర్వాత షూటింగులు జరుపుకోండి.. అనంటే అది సినీ పరిశ్రమకు తీపి కబురు ఎలా అవుతుంది.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: నిడదవోలులో జనసేన పరిస్థితేంటి.?

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నిడదవోలు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా వున్నాయ్.? 2024 ఎన్నికల్లో ఏ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి గెలవబోతోంది.? నాటకీయ పరిణామాల మధ్య జనసేన పార్టీకి ‘కూటమి’ కోటాలో...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...