Switch to English

ఇలాంటి గొప్ప కథ ఇప్పటి వరకూ రాలేదు : దుల్కర్ సల్మాన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,514FansLike
57,764FollowersFollow

దుల్కర్ సల్మాన్ – మృణాల్ ఠాకూర్ జంటగా అశ్వినీదత్ నిర్మించిన చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా హీరో దుల్కర్ సల్మాన్ విలేఖరులతో ముచ్చటించారు.

‘సీతారామం’ ప్రమోషన్స్ తో బిజీ బిజీ…

సినిమా ప్రమోషన్స్‌ తో బిజీ బిజీగా ఉన్నాం. ప్రేక్షకుల నుండి వస్తున్న ఈ రెస్పాన్స్ ని ఊహించలేదు.

‘సీతారామం’లో వున్న మేజర్ ఎట్రాక్షన్…

ఇది చాలా ఒరిజినల్ కథ. రియల్లీ క్లాసిక్ మూవీ. ఇలాంటి సినిమా ఇప్పటి వరకూ ఎక్కడా రాలేదు. ఇలాంటి గొప్ప కథలు ఇప్పటి వరకు రాలేదు. ట్రైలర్ లో చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే.

ఇకపై ప్రేమ కథలకు బ్రేక్‌..

ప్రేమ కథలకు కొంత విరామం ఇవ్వాలని భావిస్తున్నాను. ఇంకా పరిణితి గల విభిన్నమైన పాత్రలు చేయాలనీ వుంది.

‘సీతారామం’ లో ఫేవరేట్ సాంగ్…

కథ విన్నప్పుడు సినిమాలో సంగీతం బావుంటుందని అనుకున్నాను. కానున్న కళ్యాణం పాట కాశ్మీర్ లో షూట్ చేస్తున్నప్పుడే మ్యాజికల్ గా వుంటుందని అర్ధమైయింది. పాటలన్నీ విజువల్ వండర్ లా వుంటాయి. ఒక పాటకు మించి మరో పాట ఆకట్టుకున్నాయి. కానున్న కళ్యాణం పాట నా ఫేవరేట్.

‘సీతారామం’ లో రామ్‌…

రామ్ అనే ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తా. రామ్ ఒక అనాధ. రామ్ కి దేనిపైనా ద్వేషం వుండదు. అతనికి దేశభక్తి ఎక్కువ.

వైజయంతి మూవీస్ తో అనుబంధం…

ఒక మంచి మనిషిగా అశ్వనీదత్ గారంటే నాకు ఎంతో ఇష్టం. చాలా పాజిటివ్ గా వుంటారు. ఆయన చూపించే ప్రేమ, వాత్సల్యం చాలా గొప్పగా వుంటుంది.

సీత గురించి..

‘సీతారామం’ కథ విన్నప్పుడు సీత పాత్రని ఒక అద్బుతంగా ఊహించుకున్నా. ఈ పాత్రలోకి మృణాల్ వచ్చే సరికి అద్భుతమైన ఛాయిస్ అనిపించింది. సెట్స్ లో మృణాల్ ని చూస్తే సీత పాత్రకు ఆమె తప్పితే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది.

రష్మిక పాత్ర గురించి…

కొత్త రష్మిక ని చూస్తారు. ఇది వరకు ఎప్పుడూ ఇలాంటి పాత్రని చేయలేదు. రష్మిక గ్రేట్ ఎనర్జీ.

పదేళ్ల సినీ కెరీర్‌…

నిజానికి నేను ఈ పదేళ్లలో చాలా తక్కువే చేశాను. మలయాళంలో నాతోటి హీరోలు ఏడాదికి 12 సినిమాలు చేస్తున్నారు. మా నాన్న గారే ఏడాది 30కి పైగా సినిమాలు చేసిన సందర్భాలు వున్నాయి. వాళ్లతో పోల్చుకుంటే నేను తక్కువ చేసినట్లే.

పాన్ ఇండియా మూవీ…

‘పాన్ ఇండియా అనే ట్యాగ్ విని విని విసుగొచ్చింది. ఆ పదం వాడకుండా ఒక ఆర్టికల్ కూడా వుండటం లేదు. నిజానికి పాన్ ఇండియా కొత్త కాన్సెప్ట్ ఏమీ కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా పాన్ ఇండియా ఫిల్మ్ అని ఒత్తి చెప్పడం అవసరం లేదని నా ఫీలింగ్.

తెలుగులో మీకున్న క్రేజ్…

తెలుగు ప్రేక్షకులు నాపై చూపిన అభిమానం చాలా సర్ ప్రైజ్ అనిపించింది. నా చిత్రాలు వివిధ ఓటీటీ వేదికలపై చూసి సినిమాల పట్ల వున్న ఒక ప్యాషన్ తో చాల మంది కనెక్ట్ అవ్వడం ఆనందమనిపించింది. మహానటి సమయంలో నా కాళ్ళకి గాయం కావడంతో ఈవెంట్స్ కి రాలేకపోయాను. వైజాగ్, విజయవాడ ఈవెంట్స్ అభిమానుల చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు.

సీతారామం స్టార్‌ కాస్టింగ్‌…

తెలుగు, తమిళ్, బెంగాలీ ఇలా వివిధ పరిశ్రమల ప్రముఖ నటీనటులు ఇందులో భాగమయ్యారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ గారితో రెండోసారి నటించడం ఆనందంగా వుంది.

యాక్టర్ కాకపోయింటే….

బిజినెస్ స్కూల్ లో చదువుకున్నాను. ఎంబీఎ చేశాను. బహుశా ఇన్వెస్టర్ ని అయ్యేవాడినేమో.

దర్శకత్వం ఆలోచన…

దర్శకత్వం చేయాలని వుంది. కానీ ఇప్పుడంత సమయం లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘టిల్లు స్క్వేర్‌’ లో కొత్త అందాలు చూడబోతున్నామా..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొంది మంచి విజయాన్ని సొంతం చేసుకున్న డీజే టిల్లుకు సీక్వెల్‌ గా రూపొంది మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో...

Kalki 2898AD : ప్రభాస్ కి ఉన్నది ఒకే ఒక్క ఆప్షన్..!

Kalki 2898AD : యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ హీరోగా మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడీ సినిమా విడుదల...

Manchu Manoj: ‘చిరంజీవి-మోహన్ బాబు’ పై మంచు మనోజ్ సరదా కామెంట్స్

Manchu Manoj: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) జన్మదిన వేడుకల సందర్భంగా హైదరాబాద్ శిల్పకళావేదికలో జరిగిన కార్యక్రమంలో హీరో మంచు మనోజ్ (Manchu...

Game Changer: ‘గేమ్ చేంజర్’ స్పెషల్ అప్డేట్.. పూనకాలు తెప్పించిన దిల్...

Game Changer: దిగ్గజ దర్శకుడు శంకర్ (Shankar) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్ (Game Changer). నేడు రామ్...

రాజకీయం

Tillu Square : ఫీల్ అయిన అనుపమ.. టిల్లు రిక్వెస్ట్

Tillu Square : డీజే టిల్లు కు సీక్వెల్ గా రూపొందిన టిల్లు స్క్వేర్ సినిమా రేపు విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. సినిమా విడుదల నేపథ్యంలో నిన్న రిలీజ్ ట్రైలర్ ను...

వైఎస్ జగన్ ‘మేం సిద్ధం’ యాత్ర.! తొలి రోజు అట్టర్ ఫ్లాప్ షో.!

ఏమయ్యింది.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.? ‘సిద్ధం’ సభల కోసం 18 లక్షల మంది జనాన్ని రప్పించగలిగామని గొప్పలు చెప్పుకున్న వైసీపీ, అట్టహాసంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మేం సిద్ధం’ బస్సు యాత్ర...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

కంటెయినర్ రాజకీయం.! అసలేం జరుగుతోంది.?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసంలోకి ఓ అనుమానాస్పద కంటెయినర్ వెళ్ళిందిట.! అంతే అనుమానాస్పదంగా ఆ కంటెయినర్ తిరిగి వెనక్కి వచ్చిందట. వెళ్ళడానికీ, రావడానికీ మధ్యన ఏం జరిగింది.? అంటూ టీడీపీ...

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

ఎక్కువ చదివినవి

Uppena : హిందీ ‘ఉప్పెన’ ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

Uppena : మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన సినిమా ఉప్పెన. ఇదే సినిమా తో దర్శకుడిగా బుచ్చిబాబు మరియు హీరోయిన్‌ గా కృతి శెట్టి లు నటించిన...

బ్రేకింగ్ : యూఎస్ లో తెలుగు హీరోకి యాక్సిడెంట్‌

జాతిరత్నాలు సినిమాతో స్టార్‌ హీరోగా యూత్‌ లో మంచి క్రేజ్ ను దక్కించుకున్న నవీన్ పొలిశెట్టి ఆ మధ్య మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనగనగా ఒక...

వైసీపీ ఎంపీ వంగా గీతకి ఎందుకింత ప్రజా తిరస్కారం.?

వంగా గీత.. వైసీపీ ఎంపీ.! ఆమె అనూహ్యంగా ఇప్పుడు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. అదీ పిఠాపురం నియోజకవర్గం నుంచి. కాకినాడ ఎంపీగా పని చేస్తున్న వంగా గీత, అదే పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని...

Janhvi Kapoor : ‘పుష్ప – 2’ కి జాన్వీ ఓకే చెప్పిందా? లేదా?

Janhvi Kapoor : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పుష్ప సినిమాలో సమంతతో చేయించిన ఐటెం సాంగ్‌ బ్లాక్ బస్టర్‌...

పులివెందులలో వైసీపీకి ఎదురుగాలి.? నిజమేనా.!?

వై నాట్ కుప్పం.. అన్నారు కదా.? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్కడ్ని ఓడించేందుకు గుంపులు గుంపులుగా వైసీపీ ముఖ్య నేతలంతా ఎందుకు మోహరించినట్టు.? ఇంతకీ, పులివెందుల పరిస్థితేంటి.? వాస్తవానికి పులివెందులలో వైఎస్ కుటుంబానికి ఎదురే...