వరుస సినిమాలతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమె తీసుకున్న ఆహారం కల్తీ కావడంతో అనారోగ్యం పాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు జాన్వి తండ్రి బోనికపూర్ తెలిపారు. రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతుందని చెప్పారు.
ప్రస్తుతం ఆమె.. గుల్షన్ దేవయ్య, రోషన్ మాథ్యూ తో కలిసి నటించిన “ఉలఝ్” విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్ల లో జాన్వి బిజీగా ఉంటోంది. ఇందులో భాగంగా చెన్నై వెళ్లిన ఆమె మంగళవారం ముంబయి చేరుకున్నారు. అప్పటినుంచి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆసుపత్రిలో చేరారు. ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల ఆమె అస్వస్థతకు గురైనట్లు వైద్యులు తెలిపారు.
మరోవైపు జాన్వి తెలుగులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ కి జంటగా “దేవర” సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతోపాటు బుచ్చిబాబు సాన-రామ్ చరణ్ ప్రాజెక్టులోనూ ఈమే హీరోయిన్. వీటితోపాటు యంగ్ హీరో నాని తోనూ ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.