పుష్ప-2 లేని వివాదాన్ని సృష్టిస్తోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఈ మూవీ పార్టు-1కు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. అది చాలా పెద్ద హిట్ అయింది. పాటలు అయితే ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యాయి. కానీ పార్టు-1 బీజీఎం అంతగా బాగాలేదని కొన్ని విమర్శలు వచ్చాయి. ఇక పార్టు-2కు దేవి శ్రీ ప్రసాద్ పాటలు కంపోజ్ చేశాడు. అయితే పాటల పరంగా ఓకే గానీ.. బీజీఎం ఆ రేంజ్ లో లేదని తమన్ ను తీసుకున్నాడంట సుకుమార్. మొదట్లో దీనిపై కొన్ని రూమర్లు వచ్చినా ఎవరూ దాన్ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన సింగర్ కార్తీక్ మ్యూజికల్ కన్సర్ట్ లో తమన్ పాల్గొన్నాడు. ఈ ప్రోగ్రామ్ లో ఆయన పుష్ప-2 గురించి ఓ కామెంట్ చేశాడు. వీ ఆర్ వెయిటింగ్ ఫర్ పుష్ప-2 అన్నాడు. ఇంకేముంది ఈ సినిమాకు ఆయన బీజీఎం అందిస్తున్నాడని కన్ఫర్మ్ చేస్తున్నారు నెటిజన్లు. దీంతో తమన్ మీద దేవి శ్రీ ప్రసాద్ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా దేవి శ్రీ ప్రసాద్ ను అవమానించడమే అంటున్నారు. ఆయన కంపోజ్ చేసిన బీజీఎం బాగా లేదని ఎవరు చెప్పారంటూ కామెంట్లు పెడుతున్నారు.
గతంలో తమన్ చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. ఒక సినిమాకు పాటలకు ఒకరిని, బీజీఎంకు మరొక మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకుంటే తప్పు అన్నాడు. పెళ్లి ఒకరితో చేసి శోభనం మరొకరితో చేస్తారా అంటూ కామెంట్స్ చేశాడు. దాన్ని ఇప్పుడు వైరల్ చేస్తూ నువ్వు చేసిన కామెంట్స్ ను మర్చిపోయావా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.